హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ వాహనంలో లోపం.. 800 పైగా కార్లను రీకాల్ చేసిన కంపెనీ..
దక్షిణ కొరియా కంపెనీ కూడా ఈ లోపం కారణంగా ఇప్పటివరకు ఎటువంటి ప్రమాదం జరిగినట్లు తెలియదని చెప్పింది. రీకాల్ చేసిన 2021 మోడల్ ఇయర్ హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ వెహికిల్ లు EPCUతో అమర్చబడి ఉన్న DC కన్వర్టర్ హౌసింగ్‌లో కొంత సీలింగ్ కోల్పోవచ్చు.
కులెంట్ లీకేజీల సమస్య కారణంగా యుఎస్‌లో 853 యూనిట్ల కోనా ఎలెట్రిక్ వాహనాలని రీకాల్ చేస్తున్నట్లు సౌత్ కొరియన్ కంపెనీ హ్యుందాయ్ ప్రకటించింది. సెలెక్ట్ చేసిన చేసిన కోన ఎలక్ట్రిక్ వెహికిల్ లోని ఎలక్ట్రిక్ పవర్ కంట్రోల్ యూనిట్ (EPCU)లో ఇంటర్నల్ లీకేజీ వల్ల పవర్ తగ్గుతుందని లేదా వాహనం నిలిచిపోవచ్చని వాహన తయారీ సంస్థ తెలిపింది. అయితే, దక్షిణ కొరియా కంపెనీ కూడా ఈ లోపం కారణంగా ఇప్పటివరకు ఎటువంటి ప్రమాదం జరిగినట్లు తెలియదని చెప్పింది. కానీ కోనా ఎలక్ట్రిక్ వెహికిల్ లో పవర్ తగ్గినట్లు కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. రీకాల్ చేసిన మోడళ్లకు సంబంధించి సమస్యని డీలర్‌షిప్‌లలో ఫిక్స్ చేస్తారని కార్ బ్రాండ్ తెలిపింది.
రీకాల్ చేసిన 2021 మోడల్ ఇయర్ హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ వెహికిల్ లు EPCUతో అమర్చబడి ఉన్న DC కన్వర్టర్ హౌసింగ్‌లో కొంత సీలింగ్ కోల్పోవచ్చు. ఈ క్రిటికల్ కాంపోనెంట్ ఉత్పత్తి సమయంలో స్టీమ్ క్లీనింగ్ లేకపోవడం వల్ల ఈ లోపం సంభవించినట్లు నివేదించింది.
నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (NHTSA) రీకాల్ డాక్యుమెంట్‌లో ఇంటర్నల్ కూలెంట్ లీక్‌తో ప్రభావితమైన కార్లు మెయిన్ కంట్రోలర్‌ను ప్రభావితం చేయవచ్చని పేర్కొంది. ఈ లోపం కారణంగా, కొంతమంది వాహన యజమానులు వారి డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్ ప్లే లో వార్నింగ్ మెసేజ్ అందుకోవచ్చు.
ఈ సంవత్సరం నవంబర్‌లోనే పొటెన్షియల్ సమస్యను గమనించినట్లు కార్ బ్రాండ్ పేర్కొంది. అంతర్గత విచారణ అనంతరం హ్యుందాయ్ ఈ ఏడాది డిసెంబర్ 9న వాహనాలను రీకాల్ చేయాలని నిర్ణయించింది. అయితే, కంపెనీ రీకాల్ గురించి ఒనర్లకు కూడా తెలియజేస్తుంది. హ్యుందాయ్ కంపెనీ కోనా EVని భారతదేశంలో కూడా విక్రయిస్తుంది. ప్రస్తుతానికి, ఇండియా-స్పెక్ మోడల్‌లో కూడా ఈ సమస్య ప్రభావితం చేస్తుందో లేదో తెలియదు.