అతి చిన్న ఎలక్ట్రిక్ కారు.. రేపే లాంచ్.. దీని ధర, ఫీచర్స్ తెలిస్తే వావ్ అంటారు..
ఈ మైక్రో ఎలక్ట్రిక్ కారు 2,915ఎంఎం పొడవు, 1,157ఎంఎం వెడల్పు, 1,600ఎంఎం ఎత్తు ఉంటుంది. ఇంకా 2,087ఎంఎం వీల్‌బేస్ ఉంటుంది, అయితే దీని గ్రౌండ్ క్లియరెన్స్ 170ఎంఎం ఉంటుంది.
ముంబైకి చెందిన స్టార్టప్ పిఎంవి ఎలక్ట్రిక్ మొదటి ఎలక్ట్రిక్ వాహనాన్ని నవంబర్ 16 బుధవారం భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది. ఈ వాహనం EaS-E అని పిలువబడే ఒక కాంపాక్ట్ ఎలక్ట్రిక్ వాహనం. ప్రతిరోజూ అవసరాలకు ఉపయోగించే వాహనంగా ఈ కారు ఉండాలని కంపెనీ కోరుకుంటుంది. పిఎంవి ఎలక్ట్రిక్ పర్సనల్ మొబిలిటీ వెహికల్ (PMV) అనే కొత్త సెగ్మెంట్‌ని సృష్టించాలనుకుంటోంది. EaS-E అనేది పిఎంవి ఎలక్ట్రిక్ మొదటి వాహనం. నివేదిక ప్రకారం దీని ధర రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య ఉండవచ్చు.
సైజ్
ఈ మైక్రో ఎలక్ట్రిక్ కారు 2,915ఎంఎం పొడవు, 1,157ఎంఎం వెడల్పు, 1,600ఎంఎం ఎత్తు ఉంటుంది. ఇంకా 2,087ఎంఎం వీల్‌బేస్ ఉంటుంది, అయితే దీని గ్రౌండ్ క్లియరెన్స్ 170ఎంఎం ఉంటుంది. అలాగే, దీని కర్బ్ బరువు దాదాపు 550 కిలోలు ఉంటుంది. కాబట్టి చాలా కాంపాక్ట్ అండ్ నగరాల్లో ప్రయాణించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చిన్న సైజ్ కారణంగా పార్కింగ్ చేయడం కూడా సులభం అవుతుంది.
డ్రైవింగ్ రేంజ్
పిఎంవి EaS-E మూడు వేరియంట్లలో అందించబడుతుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే డ్రైవింగ్ పరిధి 120 కి.మీ నుంచి 200 కి.మీల మధ్య ఉంటుందని కంపెనీ పేర్కొంది. డ్రైవింగ్ పరిధి కస్టమర్ ఎంచుకున్న వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది. వాహనం బ్యాటరీ కేవలం 4 గంటల్లో ఛార్జ్ చేయబడుతుందని పిఎంవి పేర్కొంది. కంపెనీ కారుతో పాటు 3 kW AC ఛార్జర్‌ను అందజేస్తుంది.
ఫీచర్ల గురించి మాట్లాడుతూ పిఎంవి ఎలక్ట్రిక్ EaS-E డిజిటల్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, USB ఛార్జింగ్ పోర్ట్, ఎయిర్ కండిషనింగ్, రిమోట్ కీలెస్ ఎంట్రీ, రిమోట్ పార్క్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్, సీట్ బెల్ట్ వంటి చాలా ఫీచర్లను పొందుతుందని చెప్పారు.
త్వరలో ఉత్పత్తి
స్మార్ట్ ఎలక్ట్రిక్ వాహనాల ప్రోటోటైప్ వెర్షన్ సిద్ధంగా ఉందని కంపెనీ తెలిపింది. కంపెనీ ప్రస్తుతం వీలైనంత త్వరగా ఉత్పత్తిని ప్రారంభించే పనిలో ఉంది.