యమహా నుంచి కొత్త మోడల్ 125cc ఎఫ్ఐ బైక్...

యమహా ఫాసినో 125cc ఎఫ్ఐ స్కూటర్ యమాహా బ్రాండ్ మొట్టమొదటి 125cc స్కూటర్. ఇది 113సి‌సి మోడల్‌ స్కూటర్ కి రిప్లేస్ చేస్తుంది.ఈ కొత్త స్కూటర్ చాలా సమర్థవంతమైన మోటారుతో ఇంకా చాలా కొత్త ఫీచర్స్ తో  వస్తుంది.

yamaha launches its new 125cc scooter in india

యమహా మోటార్ ఇండియా తన మొట్టమొదటి 125cc స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. యమాహా ఫాసినో 125cc ఎఫ్‌ఐ స్కూటర్. కొత్త యమహా ఫాసినో 125cc ఎఫ్ఐ ధర  రూ.66,430 నుండి రూ. 69, 930 వరకు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్)ఉంటుంది. ఇది భారతదేశంలో డిజైన్ చేసి అభివృద్ధి చేశారు.

also read ఆ రెండు ఆటోమొబైల్ సంస్థ విలీనం...నాలుగో పెద్ద కంపెనీ ఇదే

కొత్త హోండా గ్రాజియా, హోండా యాక్టివా 125, సుజుకి యాక్సెస్, టివిఎస్ ఎన్‌టోర్క్ 125cc  స్కూటర్ లకి మంచి పోటీగా ఉంటుంది. ప్రస్తుతం యమహా కాల్ ఆఫ్ ది బ్లూ క్యాంపెయిన్ 2020లో భాగంగా కొత్త 125cc స్కూటర్‌పై కూడా దృష్టి సారిస్తుందని కంపెనీ తెలిపింది. ఫాసినో 125cc తో పాటు, యమహా వచ్చే ఏడాది రే-జెడ్ఆర్ 125cc ఎఫ్‌ఐని కూడా ప్రవేశపెట్టనుంది.

yamaha launches its new 125cc scooter in india

కొత్త యమహా ఫాసినో 125cc ఎఫ్ఐ కొత్త 125cc బ్లూ కోర్ సింగిల్ సిలిండర్, ఫ్యుయెల్-ఇంజెక్ట్ ఇంజన్ ద్వారా 8 బిహెచ్‌పి, 9.7 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కొత్త 125cc మోటారు ప్రొడ్యూసర్లు మాట్లాడుతూ 113cc మోడళ్ల కంటే 30 శాతం ఎక్కువ శక్తివంతమైనదని, ఫ్యుయెల్ కాపాసిటి 58 కిలోమీటర్ల (క్లెయిమ్) మైలేజ్ ఇస్తుందని, ఇది 113cc స్కూటర్ మోడళ్ల కంటే 16 శాతం ఎక్కువ ఇంధన సామర్థ్యం కలిగి ఉందని యమహా తెలిపింది.

also read మార్కెట్లోకి ఎలక్ట్రిక్ ఆటో విడుదల...లక్ష...వారెంటీతో అందుబాటులోకి...

స్కూటర్లు కూడా స్టార్ట్-స్టాప్ సిస్టమ్‌తో వస్తాయి అలాగే సిటీ ట్రాఫిక్ జామ్‌లలో క్రాల్ సులభతరం చేయడానికి ట్రాఫిక్ మోడ్‌ను కూడా పొందుతాయి.యమాహా ఫాసినో స్కూటర్ కొత్త లైట్ వెయిట్ ఫ్రేమ్‌ ద్వారా ఇదీ కేవలం 99 కిలోల బరువు ఉంటుంది అంటే  113cc మోడల్ కంటే  4 కిలోల బరువు తక్కువ ఉంటుంది. 113cc వెర్షన్‌తో పోలిస్తే కొత్త 125cc ఫాసినో రెట్రో డిజైన్ లాంగ్వేజ్‌ను మెటాలిక్ కలర్ ఆప్షన్స్‌తో, ఫ్యాషన్ ఇంకా ప్రీమియం లుక్  ఉంటుంది.


యమాహా ఫాసినో స్కూటర్ 12-అంగుళాల అల్లాయ్ వీల్స్, యూనిఫైడ్ బ్రేకింగ్ సిస్టమ్ లేదా సిబిఎస్ తో వస్తుంది.ఇంకా ఈ  మోడల్ సైడ్-స్టాండ్ కట్ ఆఫ్ స్విచ్, మల్టీ-ఫంక్షన్ కీ, ఫోల్డబుల్ హుక్, యుఎస్బి ఛార్జింగ్ ఇంకా మరెన్నో ఉన్నాయి. ఈ స్కూటర్ రెడ్ ఇంకా యెల్లో విభిన్న రంగులలో ప్రీమియం మోడళ్లలో మాత్రమే అందుబాటులోకి రానుంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios