Asianet News TeluguAsianet News Telugu

టాటా మోటార్స్‌కు కరోనా ‘సెగ’ జాగ్వార్’లో 1,100 మంది ఇంటికి!

కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభం అన్ని రంగాలపైనా ప్రభావం చూపుతున్నది. చిన్న సంస్థలు మొదలు దిగ్గజ సంస్థల వరకు కుదేలవుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక మందగమనం, ట్రేడ్ వార్ తదితర కారణాలతో అమ్మకాల్లేక ఆటోమొబైల్ రంగం కుదేలయింది. కరోనాతో ఇప్పుడు తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నది. 

Tata Motors to shed 1,100 JLR jobs after pandemic hits earnings
Author
New Delhi, First Published Jun 17, 2020, 10:57 AM IST

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభం అన్ని రంగాలపైనా ప్రభావం చూపుతున్నది. చిన్న సంస్థలు మొదలు దిగ్గజ సంస్థల వరకు కుదేలవుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక మందగమనం, ట్రేడ్ వార్ తదితర కారణాలతో అమ్మకాల్లేక ఆటోమొబైల్ రంగం కుదేలయింది. కరోనాతో ఇప్పుడు తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నది. 

ఈ నేపథ్యంలో చాలా సంస్థలు ఉద్యోగాల కోత వంటి కఠినమైన నిర్ణయాలతో ఖర్చులు తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఈ జాబితాలో దిగ్గజ వాహన సంస్థ టాటా మోటార్స్​కు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్, ల్యాండ్​రోవర్ (జేఎల్​ఆర్)​ చేరింది. 

also read:‘ముకేశ్ ‘బీ’ ప్లాన్ సక్సెస్.. తాజాగా 10 సంస్థ పెట్టుబడికి రెడీ

లండన్​ కేంద్రంగా పని చేస్తున్న జేఎల్​ఆర్ దాదాపు 1,100 మందిని తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది. రోజురోజుకు నిర్వహణ వ్యయం పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని జాగ్వార్ లాండ్ రోవర్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ పీబీ బాలాజీ తెలిపారు. 

కరోనా కారణంగా విధించిన లాక్​డౌన్​తో తమ విక్రయాలు 30.9 శాతం పడిపోయినట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. ఈ కారణంగానే ఉద్యోగాల కోత ద్వారా ఖర్చులు తగ్గించుకోవాలని భావిస్తోంది.

ముఖ్యంగా బ్రిటన్​లో ఉన్న తమ ప్లాంట్లలోని కాంట్రాక్ట్ ఏజెన్సీ ఉద్యోగులను తగ్గించుకోవాలని చూస్తున్నట్లు జేఎల్​ఆర్ తెలిపింది. వచ్చేనెల చివరి నుంచి ఈ ఏడాది చివరి వరకు ఉద్యోగాల కోత ప్రక్రియ కొనసాగనున్నట్లు వెల్లడించింది.

కరోనా వైరస్ వల్ల నిర్వహణ వ్యయాన్ని రూ.1.26 బిలియన్ల డాలర్ల మేరకు తగ్గించుకోవాలని టాటా మోటార్స్ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. జాగ్వార్ లాండ్ రోవర్ యూనిట్‌లో వచ్చే ఏడాది మార్చి నాటికి 5 బిలియన్ల పౌండ్ల నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకోవాలని భావిస్తున్నది. నిధులను పరిరక్షించుకోవడంతోపాటు మూలధన వ్యయ నిర్వహణ, లక్ష్యానికి అనుగుణంగా పెట్టుబడులు పెట్టడం, సరైన ప్రాంతాలపై కేంద్రీకరణ ఇప్పుడు తమ లక్ష్యాలని పీబీ బాలాజీ వెల్లడించారు. 

గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో టాటా మోటార్స్ రూ.9,863.73 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. ఆ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న బ్రిటిష్ అనుబం సంస్థ జాగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్ఆర్)పైనా కరోనా మహమ్మారి ప్రభావం పడటంతోపాటు దేశీయ వ్యాపారం డీలా పడటంతో నష్టాలు పెరిగాయని టాటా మోటార్స్ తెలిపింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios