Tata Motors: టాటా మోటార్స్ నుండి అదిరిపోయే కారు.. ఏప్రిల్ 6న విడుదల..!
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ భారత మార్కెట్లలోకి మరో ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసేందుకు సన్నాహాలను చేస్తోంది.టాటా మోటార్స్ నుంచి రాబోయే కొత్త ఎలక్ట్రిక్ కారు మోడల్ టీజర్‌ను కంపెనీ సోషల్‌మీడియాలో టీజ్ చేసింది. ఈ కారు ఏప్రిల్ 6 న లాంచ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
టాటా నెక్సాన్ ఈవీ, టిగోర్ ఈవీ, ఆల్ట్రోజ్ ఈవీలకు కొనసాగింపుగా కొత్త మోడల్‌ను టాటా మోటార్స్ లాంచ్ చేయనుంది. కాగా ఈ కారుకు సంబంధించిన వివరాలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. ఇక మరోవైపు టాటా నెక్సాన్ ఈవీ ఎక్స్‌టెండెడ్ రేంజ్, టాటా ఆల్ట్రోజ్ ఈవీ ఎక్స్‌టెండెడ్ రేంజ్, టాటా పంచ్ ఈవీ భారత మార్కెట్లలోకి ఈ ఏడాదిలోనే విక్రయించేందుకు టాటా మోటార్స్ సిద్దమవుతోంది.
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తన రాబోయే EV కాన్సెప్ట్ కారుకు సంబందించిన టీజర్ వీడియోను విడుదల చేసింది. త్వరలోనే ఆ కారును భారత మార్కెట్లోకి విడుదల చేయనుంది. టిగోర్ ఈవీ, టాటా నెక్సాన్ ఈవీ, ఆల్ట్రోజ్ ఈవీలకు కంటిన్యూగా ఈ సరికొత్త మోడల్‌ను లాంచ్ చేయనుంది టాటా. EV వాహనాలకు డిమాండ్ పెరగడంతో టాటా మోటార్స్ వీటిపై దృష్టి సాదించింది. Nexon EV సక్సెస్‌తో ఇప్పుడు తన తదుపరి కొత్త ఎలక్ట్రిక్ కార్లను సిద్ధం చేస్తోంది టాటా. ఆ ప్రయత్నంలోనే తాజా ఎలక్ట్రిక్ కారును రూపొందించింది టాటా మోటార్స్. ఈ కారు ఏప్రిల్ 6 న లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ కారు ఫీచర్స్‌కు సంబంధించిన వివరాలను మాత్రం కంపెనీ వెల్లడించలేదు.
టాటా మోటార్స్ విడుదల చేసిన టీజర్‌ను చూస్తే, కారు స్లోపింగ్ రూఫ్‌లైన్, స్లాట్డ్ సర్ఫేస్, స్పోర్టీ ఫ్రంట్ బంపర్ వంటి న్యూ డిజైన్ అంశాలను హైలైట్ చేశారు. కారు లుక్ మాత్రం అదుర్స్ అనిపిస్తోంది. లెక్సస్ వంటి ప్రీమియం కార్ల డిజైన్‌ను తలపించేలా కారు లుక్ ఉంది. ఇవి మినహా టీజర్‌లో పెద్దగా చూపించిన అంశాలు ఏవి లేవు. అయితే మార్కెట్ నిపుణుల అంచనా స్రకారం టాటా మోటార్స్ నెక్సాన్ ఈవీలో ఓ లాంగ్ రేంజ్ వేరియంట్ విడుదల చేయాలని చూస్తోందని.. తాజాగా కంపెనీ విడుదల చేసిన టీజర్ అలానే అనిపిస్తోందని అంటున్నారు. టిజర్ లుక్ చూస్తుంటే పూర్తిగా అది సరికొత్త ఎలక్ట్రిక్ కారులా ఉన్నట్లు తెలుస్తోంది. ఎలాంటి విషయాలు బయటకు రాకుండా టాటా జాగ్రత్త పడింది. కానీ టీజర్ చూస్తుంటే మాత్రం ఎలక్ట్రిక్ కారులా కనిపిస్తున్నస్సటికి ఇదే స్పోర్టీ యుటిలిటీ వాహనం మాదిరిగా ఉన్నట్లు అర్థమవుతుంది.