భారతీయ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్  ఆనంద్ మహీంద్రా ఈ రోజు ఉదయం ట్విట్టర్‌లో ఒక  ఎమోషనల్ న్యూస్ షేర్ చేశారు. రెండేళ్ల క్రితం  ఎంతో వైరల్ అయిన తమిళనాడుకు చెందిన "ఇడ్లీ అమ్మ"  కమలాతల్ ఇడ్లీలను వండి ఒక్కొక్క రూపాయికే విక్రయిస్తుండటంతో వైరల్ అయ్యింది. దీనికి సంబంధించి ఇప్పుడు ఒక ట్వీట్ వైరల్ అవుతుంది అదేంటంటే త్వరలో ఆమెకు సొంత ఇల్లు నిర్మించి ఇవ్వనున్నట్లు ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు.  

రెండేళ్ల క్రిఆనంద్ మహీంద్రా కమలాతల్ గురించి ట్వీట్ చేశారు. త్వరలోనే "ఇడ్లీ అమ్మ"  వ్యాపారంలో 'పెట్టుబడులు పెట్టాలని' కోరుకుంటున్నట్లు తెలిపారు. దీంతో కమలతల్ గురించి వైరల్ అయ్యింది, ఆమె ఇడ్లీలను  రూ.1  నామమాత్రపు ఖర్చుతో అందిస్తుందని, దీంతో పాటు సాంబార్, చట్నీని వండడానికి తెల్లవారకముందే మెల్కోంటుంది అని తెలిపారు. ఇంకా ఆనంద్ మహీంద్రా 2019లో కమలతల్ కట్టెల పొయ్యిని ఎల్‌పిజి కనెక్షన్‌తో భర్తీ చేయలని కోరుతూ ట్వీట్ చేశారు.

also read  


ఆనంద్ మహీంద్ర ట్వీట్ ఈ ఇడ్లీ అమ్మపై అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో కోయంబత్తూర్ భారత్ గ్యాస్ ఆమెకు ఎల్‌పి‌జి కనెక్షన్ ని బహుమతిగా ఇచ్చింది.ఈ విషయం తెలిసాక కమలాతల్ కు  ఎల్‌పి‌జి కనెక్షన్ ని బహుమతిగా ఇచ్చిన భారత్ గ్యాస్ కోయంబత్తూర్ కి ధన్యవాదాలు తెలిపారు.

తాజాగా ఆమెకు సంబంధించిన  ఒక విషయాన్ని ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియా లో షేర్ చేశారు. ఈ ఉదయం ఆనంద్ మహీంద్రా సొంత వ్యాపరంలో ఉత్తమమైన 'పెట్టుబడులు పెట్టడం' గురించి కమలతాల్ నుంచి మహీంద్రా గ్రూప్ అర్థం చేసుకుందని ట్వీట్ చేశారు. ఇడ్లీలను వండడానికి లేదా విక్రయించడానికి ఇల్లు లేదా వర్క్‌స్పేస్ కావాలన్న ఆమె కోరికను తెలుసుకున్న మహీంద్రా గ్రూప్ ఆమె పేరు మీద భూమిని నమోదు చేయడంలో సహాయపడటానికి సిద్ధంగా ఉందన్నారు.

also read ఆనంద్‌ మహీంద్రాకు ఇండియన్ క్రికెటర్ నటరాజన్ రిటర్న్‌ గిఫ్ట్‌.. సోషల్ మీడియాలో వైరల్ ఫోటోలు ఇవే.. ...

హీంద్రా గ్రూప్ రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాల అభివృద్ధి విభాగమైన మహీంద్రా లైఫ్ స్పేస్ త్వరలో ఆమె ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించనుంది అని అన్నారు.

"భూమిని వేగంగా రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా మా మొదటి మైలురాయిని సాధించడంలో మాకు సహాయపడినందుకు తోండముత్తూర్ వద్ద ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయానికి కృతజ్ఞతలు" అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.కమలాతల్‌కు ఎల్‌పిజి సిలిండర్ నిరంతరం సరఫరా చేస్తున్నందుకు భరత్ గ్యాస్ కోయంబత్తూర్‌కు ఆనంద్ మహీంద్ర కృతజ్ఞతలు తెలిపారు.


ఆనంద్ మహీంద్ర చేసిన ఈ ట్వీట్ కు వేలాది మంది కామెంట్లు చేయగా మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌లో  ప్రశంసలు పొందుతుంది. 2019లో కమలతాల్ తన సొంత లాభాలను తగ్గించుకుని ఇడ్లీలను చాలా తక్కువ ధరకే విక్రయించెదని  కాబట్టి రోజువారీ వేతనం సంపాదించేవారు వాటిని కూడా తినడానికిఇష్టపడతారని చెప్పారు.