ఈ బైక్‌తో రోడ్డు మన గ్రిప్‌లోకి రావాల్సిందే.. మార్కెట్లోకి సుజుకి ‘వీస్ట్రోమ్ 650’

సుజుకి మోటార్స్ సంస్థ సరికొత్త ప్రీమియం ‘వీ-స్ట్రోమ్ 650ఎక్స్‌టీ మోడల్ బైక్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. రెండు రంగుల్లో లభించే ఈ మోటారు సైకిల్ అక్షరాల రూ.7.46 లక్షలు పలుకుతుంది. ఈ బైక్ నడిపే వారికి దాని నియంత్రణకు తేలికపాటి వెసులుబాట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. 

Suzuki Motorcycle launches new edition of V-Strom 650XT at Rs 7.46 lakh

సుజుకి మోటార్‌సైకిల్‌ ఇండియా కొత్త ప్రీమియం మోటార్‌ బైక్‌ మోడల్‌ను లాంచ్‌ చేసింది. అడ్వెంచర్‌ టూరర్‌ బైక్‌ ‘వీ-స్ట్రోమ్‌ 650ఎక్స్‌టీ’ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ బైక్ రెండు రంగుల్లో లభించనున్నది. దీని ధర రూ.7.46 లక్షలు పలుకుతుంది. 

కొత్త గ్రాఫిక్స్‌, అదనపు ఫీచర్లతో వీ -స్ట్రామ్‌ కొత్త వెర్షన్‌ భారతీయ వినియోగదారులకు అద్భుతమైన అడ్వెంచర్‌ అనుభూతిని అందిస్తుందని సుజుకీ మోటార్‌సైకిల్‌ ఇండియా ఎండీ సతోషి ఉచిడా తెలిపారు. గత ఏడాది లాంచ్‌ చేసిన ఈ వి- స్ట్రామ్‌ మోటార్‌  సైకిల్‌కు మంచి ఆదరణ లభించిందనీ, ఇప్పుడూ అదే స్పందన లభిస్తుందని తాము ఆశిస్తున్నామన్నారు. 

లైట్‌ వెయిట్‌ యాంటీ లాక్‌ బ్రేక్‌ సిస్టమ్ రహదారిపై పట్టును కోల్పోకుండా చేస్తుందని సుజుకీ మోటార్‌సైకిల్‌ ఇండియా ఎండీ సతోషి ఉచిడా పేర్కొన్నారు. ప్యూయల్‌-ఇంజెక్షన్‌ టెక్నాలజీతో బైకు పనితీరు మరింత  మెరుగుకానుందని అన్నారు.

సైడ్ రిఫ్లెక్టర్లు, హజార్డ్ లైట్స్ అదనపు ఫీచర్లుగా ఉన్నాయి. వీ స్ట్రోమ్ 650 ఏబీఎస్ మోడల్ మోటారు సైకిల్ ఫోర్ స్ట్రోక్ 645 సీసీ ఇంజిన్ సామర్థ్యం కలిగి ఉంటుంది. ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీతో రూపుదిద్దుకున్న ఈ బైక్ లైట్ వెయిట్ యాంటీ బ్రేక్ సిస్టమ్, విషమ పరిస్థితుల్లో బ్రేకింగ్ ఫెర్పార్మెన్స్ కలిగి ఉంటుందని సతోషి ఉచిడా తెలిపారు.

లైట్‌వెయిట్‌ యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ వ్యవస్థతో బైకుపై మరింత పట్టు సాధించొచ్చని సుజుకీ మోటార్‌సైకిల్‌ ఇండియా ఎండీ సతోషి ఉచిడా తెలిపారు. ఫోర్‌ స్ట్రోక్‌ 645 సీసీ ఇంజిన్‌ కలిగిన కొత్త బైకు.. మధ్య స్థాయి అడ్వెంచర్‌ బైకు కోరుకునే వారికి నచ్చుతుందని సుజుకి మోటార్ సైకిల్ ఇండియా తెలిపింది. . 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios