ఇండియాలోనే అత్యంత కాస్ట్లీ కారును కొన్న ప్రముఖ సింగర్.. దీని బుకింగ్ ధరనే అక్షరాల రూ. 10 లక్షలు..!

భారత్‌లో అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన టయోటా కారు ఇదే. ఈ కారు బుకింగ్ కోసం రూ.10 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ కారును రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు ఎక్కువగా ఇష్టపడతారు. ఇప్పుడు ఈ కారును పంజాబీ సింగర్ గురుదాస్ మాన్ కొనుగోలు చేశారు.

Singer Gurdas who bought India's most expensive Toyota car, booking price is Rs 10 lakh-sak

పంజాబీ సింగర్ గురుదాస్ మాన్ భారతదేశపు అత్యంత ఖరీదైన టయోటా కారును సొంతం చేసుకున్నారు. ఈ కారు బుకింగ్ ధర ఎంతో తెలుసా అక్షరాల  రూ.10 లక్షలు. అయితే గురుదాస్ మాన్ ఏ కారు కొన్నాడు..? ఈ కారు ప్రత్యేకత ఏమిటి..? ఒకసారి చూద్దాం..

 భారత్‌లో అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన టయోటా కారు ఇదే. ఈ కారు బుకింగ్ కోసం రూ.10 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ కారును రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు ఎక్కువగా ఇష్టపడతారు. ఇప్పుడు ఈ కారును పంజాబీ సింగర్ గురుదాస్ మాన్ కొనుగోలు చేశారు. భారతదేశంలో అత్యంత ఖరీదైన టయోటా కారు పేరు టొయోటా ల్యాండ్ క్రూయిజర్ 300. ఈ కారును భారతదేశంలో ఢిల్లీ ఆటో ఎక్స్‌పో 2023లో ఆవిష్కరించారు. ల్యాండ్ క్రూయిజర్ 300 కారు అనేది అప్ డెటెడ్ వెర్షన్. ప్రధాని నరేంద్ర మోదీ వద్ద ల్యాండ్ క్రూయిజర్ కస్టమైజ్డ్ కారు కూడా ఉంది. వ్యాపారవేత్తలతో సహా కొంతమంది ఈ కారును ఉపయోగీస్తుంటారు. కానీ గురుదాస్ మాన్ క్రూయిజర్ 300 కారు సరికొత్త అప్ డెటెడ్ వెర్షన్‌ను కొనుగోలు చేశాడు. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.2 కోట్లు.

గురుదాస్ మాన్ టయోటా ల్యాండ్ క్రూయిజర్ 300 కారును భారతదేశంలో ఆవిష్కరించిన వెంటనే బుక్ చేసుకున్నారు. ఇప్పుడు సరికొత్త కారు సింగర్ గురుదాస్ మాన్ గ్యారేజ్ లో వచ్చి చేరింది. అయితే ల్యాండ్ క్రూయిజర్ 200 2021లో విడుదలైంది.  ఇప్పుడు ల్యాండ్ క్రూయిజర్ 300 భారతదేశంలో లాంచ్ చేయబడింది.  గురుదాస్ మాన్  ల్యాండ్ క్రూయిజర్ 300 బ్లాక్ కలర్ కారు కొన్నాడు. ఈ కారు మొత్తం 5 రంగులలో లభిస్తుంది. 

సరికొత్త ల్యాండ్ క్రూయిజర్ 300లో 3.3 లీటర్ ట్విన్ టర్బో డీజిల్ ఇంజన్ అందించారు. ఈ కారు 305 హెచ్‌పి పవర్, 800 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. 10 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ ట్రాన్స్‌మిషన్‌ దీనికి లభిస్తుంది. ల్యాండ్ క్రూయిజర్ 200 కంటే ల్యాండ్ క్రూయిజర్ 300 బరువు 200 కిలోలు తక్కువ. 6 సిలిండర్లు, 3346 సిసి కెపాసిటీ గల ఈ ఎస్‌యూవీ కారు ఎలాంటి రోడ్డులోనైనా ప్రయాణించగలదు. దీని డీజిల్ ట్యాంక్ సామర్థ్యం 110 లీటర్లు. ఈ కొత్త కారు చాలా ఆకర్షణీయమైన డిజైన్‌లో వస్తుంది.  

2019 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ల్యాండ్ క్రూయిజర్ 200 కారును అప్‌గ్రేడ్ చేశారు. 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం ప్రధాని నరేంద్ర మోదీ కస్టమైజ్డ్ ల్యాండ్ క్రూయిజర్ కారును ఉపయోగించారు. ఈ కారులో బుల్లెట్ ప్రూఫ్, బాంబ్ ప్రూఫ్ సహా ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. అప్పట్లో ప్రధానమంత్రి రూ. 1.7 కోట్లకు (ఎక్స్-షోరూమ్) సరికొత్త ల్యాండ్ క్రూయిజర్ కారును కొనుగోలు చేశారు. అయితే ఈ కారును కస్టమైజ్ చేసిన తర్వాత ఈ కారు ఎంత మొత్తంలో ఉందనే సమాచారం లేదు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios