స్టార్ క్రికేటర్ కొత్త లగ్జరీ కార్.. కోట్లు ఖర్చు పెట్టి కొన్న ఈ కార్ స్పెషాలిటీ తెలిస్తే వావ్ అనాల్సిందే..

BMW కార్లు కాకుండా, పోర్షే 911 ఇటీవల సచిన్ గ్యారేజీలోకి వచ్చి చేరింది. ఫార్ములా వన్ ఛాంపియన్ మైఖేల్ షూమేకర్‌తో సన్నిహితంగా ఉన్న సచిన్ కి   మైఖేల్ షూమేకర్‌ ఫెరారీ 360 మోడెనాను బహుమతిగా ఇచ్చాడు.
 

Sachin Tendulkar owns Lamborghini's luxury SUV for Rs 4.18 crore-sak

ముంబై: బ్యాటింగ్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ లంబోర్గినీకి చెందిన లగ్జరీ కారు ఉరుస్‌ ని సొంతం చేసుకున్నాడు. లాంబోర్గినీ ఇటీవల విడుదల చేసిన ఉరుస్ ఎస్ మోడల్‌ను సచిన్ రూ.4.18 కోట్లకు కొనుగోలు చేశారు. బిఎమ్‌డబ్ల్యూ కార్ల బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సచిన్ టెండూల్కర్ ఫస్ట్ లాంబోర్గినీ కారును దక్కించుకున్నాడు. సచిన్ కలెక్షన్‌లో ఇప్పటికే BMW 7 సిరీస్ LI, BMW X5M, BMW i8, BMW 5 సిరీస్ కార్లు ఉన్నాయి.

BMW కార్లు కాకుండా, పోర్షే 911 ఇటీవల సచిన్ గ్యారేజీలోకి చేరింది. ఫార్ములా వన్ ఛాంపియన్ మైఖేల్ షూమేకర్‌తో సన్నిహితంగా ఉన్న సచిన్ కి షూమేకర్ ఫెరారీ 360 మోడెనాను బహుమతిగా ఇచ్చాడు. దీనిని  భారత్‌కు తీసుకురావడానికి పన్ను మినహాయింపు కోరిన సచిన్ టెండూల్కర్ చర్య గతంలో వివాదాస్పదమైంది. ఆ తర్వాత సచిన్ సూరత్‌లోని ఓ వ్యాపారికి కారును విక్రయించాడు.

ఇది కాకుండా, సచిన్ లిమిటెడ్ ఎడిషన్ నిస్సాన్ GT-R ఇగోయిస్ట్ కూడా ఉంది. నిస్సాన్ GT-R ఇగోయిస్ట్  43 కార్లు మాత్రమే విడుదల చేయబడ్డాయి. ఈ కారును సొంతం చేసుకున్న తొలి భారతీయుడు కూడా సచిన్ టెండూల్కర్.

లంబోర్ఘిని ఉరస్ ఫీచర్స్ 

ఈ కారుని డిసెంబర్ 2017లో ప్రపంచవ్యాప్తంగా, జనవరి 2018లో భారతదేశంలో ప్రవేశపెట్టారు, ఉరుస్ ప్రస్తుతం లంబోర్ఘిని లైనప్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి. లంబోర్ఘిని ఉరస్ 4.0 లీటర్ ట్విన్టర్బో V8 ఇంజన్ పొందుతుంది. ఈ ఇంజన్ 6,000 rpm వద్ద 641 bhp పవర్, 2,2504,500 rpm వద్ద 850 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిని 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ ట్రాన్స్‌మిషన్‌ లభిస్తుంది.

ఉరుస్ 3.6 సెకన్లలో  0 నుండి 100 kmph వరకు స్పీడ్  అందుకోగలదు. ఈ కార్  టాప్ స్పీడ్ గంటకు 305 కి.మీ. అలాగే గంటకు 100 కి.మీ వేగంతో వెళ్లే సమయంలో బ్రేకు వేస్తే 33.7 మీటర్ల దూరంలోనే వాహనం ఆగిపోగలగడం విశేషం. ఈ సూపర్ SUV భద్రత విషయంలో కూడా చాలా ముందుంది.

ఉరుస్‌లో ఆరు డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి. ఇది ఆఫ్-రోడింగ్‌ను లక్ష్యంగా చేసుకుని సబియా (సాండ్), టెర్రా (గ్రావెల్), నివి (మంచు) మూడు డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి. ఈ SUV పొడవు 5,112 mm, వెడల్పు 2,016 mm, ఎత్తు 1,683 mm. వీల్‌బేస్ పొడవు 3,003 mm. ఉరుస్ డిజైన్ అండ్  సాంకేతికతలో ఉన్నత ప్రమాణాలతో కూడిన 'సూపర్ SUV'.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios