Russia Ukraine War:రష్యాతో వాణిజ్యాన్ని నిలిపివేసిన టయోటా, హోండా.. వాహనాల ఎగుమతి కూడా బంద్..

 ఒక నివేదిక ప్రకారం, టయోటా మోటార్ కార్ప్ (toyota motor corp) రష్యాకు వాహన రవాణాను నిలిపివేయాలని ప్రకటించింది. అలాగే సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని ప్లాంట్‌లో ఉత్పత్తిని నిలిపివేయాలని నిర్ణయించింది. 

Russia Ukraine War: Now Toyota and Honda have also stopped business with Russia,  list of such auto companies has grown

జపనీస్ కార్ల తయారీ సంస్థలు టయోటా (toyota), హోండా (honda) ఆటోమోటివ్ బ్రాండ్‌లతో పాటు ఉక్రెయిన్‌పై దాడి తర్వాత రష్యాలో వ్యాపారం నుండి వైదొలిగిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీల జాబితాలో చేరాయి. ఇందులో వోల్వో (volvo), వోక్స్‌వ్యాగన్ (volkswagen), హార్లే-డేవిడ్‌సన్ (harley davidson), జి‌ఎం (general motors) వంటి ఇతర ఆటోమోటివ్ కంపెనీలు కూడా ఉన్నాయి. 

 ఒక నివేదిక ప్రకారం, టయోటా మోటార్ కార్ప్ (toyota motor corp) రష్యాకు వాహన రవాణాను నిలిపివేయాలని ప్రకటించింది. అలాగే సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని ప్లాంట్‌లో ఉత్పత్తిని నిలిపివేయాలని నిర్ణయించింది. టయోటా ఈ ప్లాంట్‌లో RAV4 అండ్ క్యామ్రీ మోడళ్లను తయారు చేస్తుంది. 

"ఉక్రెయిన్ ప్రజల భద్రత కోసం ఉక్రెయిన్‌లో జరుగుతున్న పరిణామాలను టయోటా చాలా ఆందోళనగా పరిగణిస్తూ, శాంతిని త్వరగా పునరుద్ధరించాలని ఎదురుచూస్తోంది" అని, ఇంకా అవసరానికి అనుగుణంగా అవసరమైన నిర్ణయాలు తీసుకుంటుంది." అని  కంపెనీ ప్రకటనలో తెలిపింది.

హోండా మోటార్ కంపెనీ కూడా రష్యాకు  కార్లు,  బైకుల ఎగుమతిని ప్రస్తుతానికి నిలిపివేయాలని నిర్ణయించింది. కంపెనీకి రష్యా దేశంలో ప్లాంట్ లేనప్పటికీ యూ‌ఎస్ లో ఉన్న కంపెనీ తయారీ ప్లాంట్ నుండి ప్రతి సంవత్సరం రష్యాకు దాదాపు 1,500 ఎస్‌యూ‌విలు ఎగుమతి అవుతున్నాయని నివేదించింది.  

వోక్స్‌వ్యాగన్, వోల్వో, హార్లే-డేవిడ్‌సన్, మెర్సిడెస్ బెంజ్, జనరల్ మోటార్స్ వంటి ఇతర ఆటోమొబైల్  దిగ్గజాలు కూడా  రష్యా- ఉక్రెయిన్ యుద్దం నేపథ్యంలో ఆందోళనలు చేపట్టాయి. అలాగే రష్యాలో వాణిజ్యాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయీ. అదనంగా, ఉక్రెయిన్‌పై దాడి చేయడం వల్ల రష్యాపై అనేక దేశాలు ఆర్థిక ఆంక్షలు విధించినందున, రష్యా మార్కెట్‌కు వాహనాల ఎగుమతి నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు. 

ఇప్పుడు ఈ రెండు జపనీస్ ఆటోమోటివ్ కంపెనీల నిర్ణయం ప్రపంచ ఆటోమోటివ్ పరిశ్రమ మొత్తంగా రష్యాపై పెరుగుతున్న బహిష్కరణను మరింత బలోపేతం చేసే అవకాశం ఉంది. యూ‌ఎస్ అండ్ యూరోపియన్ యూనియన్ (EU) ప్రకటించిన కఠినమైన ఇంకా ఆర్థిక ఆంక్షలు రష్యాపై పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. అటువంటి పరిస్థితిలో, ఆటోమోటివ్ కంపెనీల నిర్లక్ష్యం ప్రపంచంలోని 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థపై కూడా గణనీయమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios