Asianet News TeluguAsianet News Telugu

Royal enfield:కొత్త ఎంట్రీ లెవల్ బైకుని తీసుకోస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్.. ధర, ఫీచర్స్ ఎంటో తెలుసా..

J1C1 కోడ్‌నేమ్‌తో కూడిన సరికొత్త ఎంట్రీ-లెవల్ బ్రాండ్ పై రాయల్ ఎన్‌ఫీల్డ్ పనిచేస్తోందని ఒక మీడియా నివేదిక పేర్కొంది. ఈ ఏడాది చివరి నాటికి దేశంలో కొత్త బ్రాండ్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం.
 

Royal enfield Working On A New Entry-Level Bike Could Cost Rs. 1.3 Lakh Report
Author
hyderabad, First Published Feb 24, 2022, 7:55 PM IST

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎంట్రీ-లెవల్ క్లాసిక్ నుండి 650సీసీ క్రూయిజర్ వరకు ఎన్నో రకాల కొత్త బైక్స్ పని చేస్తోంది. గత కొన్నేళ్లుగా దేశంలో ఆటోమొబైల్ ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ ఆశ్చర్యకరంగా ఖరీదైనవిగా మారాయి. దీనిని అధిగమించడానికి  సంస్థ త్వరలో కొత్త ఎంట్రీ లెవల్ బైక్ పరిచయం చేయనుంది.

J1C1 కోడ్‌నేమ్‌తో కూడిన సరికొత్త ఎంట్రీ-లెవల్ బ్రాండ్ పై రాయల్ ఎన్‌ఫీల్డ్ పనిచేస్తోందని ఒక మీడియా నివేదిక పేర్కొంది. ఈ ఏడాది చివరి నాటికి దేశంలో కొత్త బ్రాండ్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. J1C1ని రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ అని పిలుస్తున్నారు. ఈ బైక్ క్లాసిక్ 350, మెటోర్ 350లో ఉపయోగించిన 350 సిసి ఇంజన్ లభిస్తుంది. నివేదిక ప్రకారం, కొత్త బైక్‌లోని చాలా భాగాలు క్లాసిక్ 350గా ఉంటాయి. 

ఇంజన్ పవర్
అయితే ఇంజన్ పవర్ వివరాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. 346cc, ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌, ఈ ఇంజన్ 19.4 PS పవర్, 28 Nm టార్క్ ఉత్పత్తి చేయగలదని, వెనుక చక్రానికి శక్తినిచ్చే 5-స్పీడ్ గేర్‌బాక్స్ స్టాండర్డ్ గా వస్తుందని భావిస్తున్నారు. కొత్త ఎంట్రీ-లెవల్ బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. కొత్త మెటోర్ 350, క్లాసిక్ 350లను అభివృద్ధి చేయడానికి ఉపయోగించే కొత్త J-సిరీస్ ఆర్కిటెక్చర్ పై కాదు.  

కంపెనీ కొత్త ఎంట్రీ-లెవల్ బైక్ ని లాంచ్ చేస్తుందని, దీనికి J1C1 అనే కోడ్‌నేమ్ ఉంటుందని నివేదిక పేర్కొంది . ఈ బైక్ బ్రాండ్ నుండి అత్యంత బడ్జెట్ బైక్ అవుతుంది. దీని ధర రూ. 1.3 లక్షల కంటే తక్కువ ఉండే అవకాశం ఉంది. 

ఫీచర్లు 
కొత్త ఎంట్రీ లెవల్ బైక్ లో డిస్క్ బ్రేక్‌లతో పాటు సింగిల్-ఛానల్ ఏ‌బి‌ఎస్ సిస్టమ్ కూడా ఉండే అవకాశం ఉంది. ఎల్‌ఈ‌డి లైట్లకు బదులుగా J1C1 హాలోజన్ లైట్లను పొందవచ్చు. బైక్ లో సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, సింగిల్ సీటును పొందవచ్చు. ఇందులో రాయల్ ఎన్‌ఫీల్డ్‌లోని ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్‌ను తొలగించవచ్చు. రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మెటోర్ 350, షాట్‌గన్ 650, సరికొత్త 650cc క్రూయిజర్ బైక్ తో సహా కొత్త 650cc బైక్స్ పై కూడా పని చేస్తోంది. దీనితో పాటు కంపెనీ కొత్త 450cc అడ్వెంచర్ బైక్స్ ను కూడా విడుదల చేయాలని చూస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios