రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కొన్ని మోడల్స్‌ వాహనాలపై ధరలను పెంచింది. పెంచిన ధరలు ఈ నెల నుంచి అమల్లోకి వచ్చాయి. 350 సీసీ - 500 సీసీ మధ్య మోడల్ మోటారు సైకిళ్లపై రూ.1500వరకు ధర పెరిగింది. 

బుల్లెట్‌ 350, 500, క్లాసిక్‌ 350, 500 , హిమాలయన్ మోడళ్లపై ధరలను పెంచింది. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఇంటర్‌సెప్టర్‌ 650, కాంటినెంటల్‌ జీటీ 650 ధరలు మాత్రం యథాతథంగా ఉన్నాయి. కొత్త ధరల ప్రకారం బుల్లెట్‌ 350 ధర రూ.1.34 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

క్లాసిక్‌ ధర 350 ఏబీఎస్‌ ధర రూ.1.53లక్షల నుంచి మొదలవుతుంది.రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్‌ 350 ఏబీఎస్‌ సిగ్నల్స్‌‌ ఎడిషన్‌ కూడా ధర పెరిగి రూ.1.63లక్షలకు చేరింది. హిమాలయన్‌ ఏబీఎస్‌ ఎడిషన్‌ 1.80లక్షల నుంచి మొదలవుతుంది. ధర పెంపునకు గల కారణాలను ఎన్‌ఫీల్డ్‌ వివరించలేదు. 

ప్రస్తుతం కార్ల ఉత్పత్తి వ్యయాలు పెరగటమే దీనికి కారణమని రాయల్ ఎన్‌ఫీల్డ్ యాజమాన్యం పేర్కొన్నట్లు సమాచారం. వచ్చే ఏప్రిల్ నుంచి 125సీసీ సామర్థ్యం గల అన్ని మోటారు సైకిళ్లలో అదనపు సేఫ్టీ ఫీచర్లు తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం ఉన్నందున ఏబీఎస్ వంటి ఫీచర్లు అమర్చుస్తారు.