Asianet News TeluguAsianet News Telugu

మార్కెట్‌లోకి రాయల్ ఎన్‌ఫీల్డ్ ‘కాంటినెంటల్’ ప్లస్ ఇంటర్‌సెప్టర్

పాతకాలం నాటి మోటార్ బైక్‌ల తయారీ సంస్థ ‘రాయల్ ఎన్‌ఫీల్డ్ ’ ఆధునిక యువత ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త బైక్‌లను మార్కెట్‌లోకి ఆవిష్కరిస్తోంది. తాజాగా రాయల్ ఎన్ ఫీల్డ్ కాంటినెంటల్ 650, ఇంటర్ సెప్టర్ 650 బైక్‌లను మార్కెట్‌లోకి ఆవిష్కరించనున్నది. రెండు మోటార్ బైక్ ల ధరలు రూ.3.5 లక్షల నుంచి రూ.4.2 లక్షలు పలుకుతుంది. రెండు మోటార్ బైక్‌లకు కూడా ఒకే మోడల్ 647 సీసీ పార్లల్ ట్విన్ ఇంజిన్ ఉండటం ఆసక్తి కర పరిణామం. 

Royal Enfield Continental GT 650 And Interceptor 650; What We Know So Far
Author
New Delhi, First Published Sep 1, 2018, 10:21 AM IST

న్యూఢిల్లీ: పాతకాలం నాటి మోటార్ బైక్‌ల తయారీ సంస్థ ‘రాయల్ ఎన్‌ఫీల్డ్ ’ ఆధునిక యువత ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త బైక్‌లను మార్కెట్‌లోకి ఆవిష్కరిస్తోంది. తాజాగా రాయల్ ఎన్ ఫీల్డ్ కాంటినెంటల్ 650, ఇంటర్ సెప్టర్ 650 బైక్‌లను మార్కెట్‌లోకి ఆవిష్కరించనున్నది. రెండు మోటార్ బైక్ ల ధరలు రూ.3.5 లక్షల నుంచి రూ.4.2 లక్షలు పలుకుతుంది. రెండు మోటార్ బైక్‌లకు కూడా ఒకే మోడల్ 647 సీసీ పార్లల్ ట్విన్ ఇంజిన్ ఉండటం ఆసక్తి కర పరిణామం. 

ప్రపంచవ్యాపంగా 650 సీసీ సామర్థ్యం గల జంట మోటార్ బైక్‌లను రాయల్ ఎన్‌ఫీల్డ్ సెప్టెంబర్ నెలలో మార్కెట్ లోకి విడుదల చేస్తున్నది. అయితే భారతీయ మార్కెట్‌లోకి మాత్రం నవంబర్ లో తీసుకురానున్నది. తాము భారతీయ రోడ్లపై రాయల్ ఎన్ ఫీల్డ్ మోటార్ బైకులు తిరుగుతూ ఉంటే ఎలా ఉంటాయో చూడాలని ఆసక్తిగా ఉన్నదని రాయల్ ఎన్‌ఫీల్డ్ అంటోంది. 

గతేడాది నవంబర్ నెలలో ఇస్మా మోటార్ సైకిల్ షోలో తొలిసారి రాయల్ ఎన్‌ఫీల్డ్ రెండు మోటార్ బైక్‌లు.. కాంటినెంటల్ జీటీ 650, ఇంటర్‌సెప్టర్ 650 ప్రదర్శించింది. రాయల్ ఎన్‌ఫీల్డ్‌లో శక్తిమంతమైన ఇంజిన్లు ‘ప్యార్లల్ ట్విన్ ఇంజిన్ మోడళ్లు’ తయారుచేసింది. ప్రస్తుతం రాయల్ ఎన్ ఫీల్డ్ భారతదేశంలోని మోటార్ బైక్‌ల తయారీతో లాభాల్లోనే పయనిస్తోంది. 350 సీసీ నుంచి 700 సీసీ సామర్థ్యం గల ఇంజిన్ల తయారీ దశకు రాయల్ ఎన్‌ఫీల్డ్ చేరుకున్నది. కాంటినెంటల్ జీటీ 650, ఇంటర్‌సెప్టర్ 650 మోడల్ మోటార్ బైక్‌ మోడల్ సెగ్మెంట్లతో అంతర్జాతీయ మార్కెట్‌లోకి విస్తరించాలని రాయల్ ఎన్ ఫీల్డ్ భావిస్తోంది. ఈ సెగ్మెంట్‌లో రాయల్ ఎన్ ఫీల్డ్ అంతర్జాతీయంగా అతిపెద్ద మార్కెట్ వాటా సొంతం చేసుకోగలమని ఆశిస్తోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios