రాయల్ ఎన్‌ఫీల్డ్ తన 500 సిసి బైక్‌లను భారతదేశంలో బుల్లెట్ 500, క్లాసిక్ 500 అలాగే థండర్‌బర్డ్ 500 అమ్మకాలను ఆపివేయవచ్చని లైవ్‌ మింట్ ఒక నివేదికలో తెలిపింది. దీని వెనుక  గల కారణలు అమ్మకాలు సరిగ్గా లేకపోవటం, బైక్‌లను బిఎస్ 6 ప్రమాణాలకు అప్‌గ్రేడ్ చేయడానికి అయ్యే  ఖర్చు కావచ్చు.

ఇలాంటి పరిస్థితులలో సంస్థ BS6 కు అప్‌గ్రేడ్ చేయడం అంతా లాభదాయకంగా ఉండకపోవచ్చు. దీనికి బదులుగా, రాయల్ ఎన్‌ఫీల్డ్ భారతదేశంలో తన కొత్త అప్ డెటెడ్ 350 సిసి మోటార్‌సైకిళ్లపై దృష్టి పెట్టనుంది. కొత్త అప్ డెటెడ్ మోడల్ బైక్లు  ఇప్పటికే భారతదేశంలో టెస్ట్ చేశారు. 

also read  మహీంద్రా అండ్ పినిన్ ఫరీనా నుంచి మరో స్పీడ్ కారు

కొత్త మోడల్ క్లాసిక్ 350 లో చాలా స్పష్టమైన మార్పులు ఉన్నాయి. ఇంజిన్ దగ్గర కొత్త కన్వర్టర్‌, ఎగ్జాస్ట్ బెండ్ పైపు పైభాగంలో ఆక్సిజన్ సెన్సార్లు ఉంటాయి.  కొత్త తరం రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ఏప్రిల్ 1, 2020 నుండి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.  కొత్త నిబంధనలకు అనుగుణంగా ఫ్యుయెల్-ఇంజెక్ట్ మోడ్ ఉంటుంది.

"ప్రస్తుతం ఉన్న 350 సిసి, 500 సిసి ఇంజిన్ల  పుష్ రాడ్ నిర్మాణం అనుగుణంగా లేదు.  ప్రస్తుతం ఉన్న మోడల్ లైనప్ దశలవారీగా తొలగించబడుతుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 సిసి సెగ్మెంట్‌ను సరికొత్త పవర్‌ట్రెయిన్‌తో పునరుద్ధరించాలని ఆలోచిస్తుంది. అలాగే ఇది 500 సిసి సెగ్మెంట్ నుండి తొలగిపోవలని చూస్తుంది"అని కంపెనీ లైవ్‌మింట్ వర్గాలు తెలిపాయి.

also read 'మేక్ యువర్ ఓన్' కార్యక్రమాన్ని ప్రారంభించిన రాయల్ ఎన్ఫీల్డ్


సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారుల (SIAM) నుండి వచ్చిన డేటా ప్రకారం, 500 సిసి బైకుల దేశీయ అమ్మకాలు ఎఫ్‌వై 13 లో 12,216 యూనిట్ల నుండి ఎఫ్‌వై 19 లో 36,093 యూనిట్లకు పెరిగాయి. ఇది మూడు రెట్లు వృద్ధి. 350 సిసి బైకుల విషయంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎఫ్‌వై 13 లో 108,478 యూనిట్లను విక్రయించింది. ఈ సంఖ్య ఎఫ్వై 19 లో 764,012 యూనిట్లకు పెరిగింది, ఇది దాదాపు ఏడు రెట్లు వృద్ధి చెందింది.