న్యూఢిల్లీ: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా మరో విలాస వంతమైన కారును వినియోగదారులకు అందుబాటులోకి తేనున్నది. ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, విలాసవంతమైన ఎలక్ట్రిక్‌ కారు బటిస్టాని రూపొందించి చరిత్ర సృష్టించిన మహీంద్రా అనుబంధ ఇటలీ కంపెనీ పినిన్‌ఫరినా మరో సరికొత్త కారును మార్కెట్లోకి తేనున్నది.

also read  మరింత శక్తివంతమైన చేటక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌....

దీనికి పీఎఫ్‌1గా పేరు పెట్టింది పినిన్ ఫరినా. నిజానికి దీని డిజైన్‌ని బటిస్టా ఆవిష్కరణ కార్యక్రమంలోనే చూపినా.. పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఇదే కోవకు చెందిన మరో ఐదు సరికొత్త కార్లను కూడా భవిష్యత్తులో వినియోగదారులకు అందుబాటులోకి తేనున్నామని పినిన్ ఫరీనా వెల్లడించింది.

లంబోర్గిని ఉరుస్‌, పోర్షే పనమెరా షూటింగ్ బ్రేక్, ఫెరారీ జీటీసీ4 తరహాలోనే పీఎఫ్‌1 కూడా అత్యంత సౌకర్యవంతంగా ఉంటుందని కానీ, ఇది మాత్రం పూర్తిగా విద్యుత్ వాహనం అని సంస్థ సీఈఓ మైఖేల్‌ ఓ ఆంగ్ల పత్రికకిచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. పీఎఫ్‌1లో నాలుగు సీట్లు ఉంటాయని తెలిపారు. పనితీరు, డిజైన్‌లో ఈ కారు అత్యంత మెరుగ్గా, నాణ్యతతో ఉంటుందన్నారు. 

also read  స్పోర్ట్స్ బ్యాగ్‌లో సరిపడే వోక్స్ వేగన్ ఎలక్ట్రిక్ మోటార్

బటిస్టా కంటే కాస్త ఎత్తుగా, పొడుగ్గా ఉంటుందని సంస్థ సీఈఓ మైఖేల్‌ అన్నారు. ఇక ఇంటీరియర్‌లో 90శాతం మేర ప్రత్యేకమైన మెటీరియల్‌ వాడతున్నామని.. ప్లాస్టిక్‌ వినియోగం చాలా తక్కువగా ఉంటుందని మైఖేల్‌ తెలిపారు. అలాగే డ్యాష్‌బోర్డులో 90శాతం చెక్కనే వాడుతున్నామన్నారు.  ఇది తొలి సస్టైనబుల్‌ లైఫ్‌స్టైల్‌ యుటిలిటీ వెహికల్‌ (ఎస్‌-ఎల్‌యూవీ) అని తెలిపారు. 

తక్కువ ఎత్తులో ఉండే బానెట్‌, పెద్ద ఫెండర్‌, పూర్తిగా గ్లాస్‌ కప్పుతో పీఎఫ్‌1 రాబోతుందని సంస్థ సీఈఓ మైఖేల్‌ వెల్లడించారు. పరిమాణంలో ఐదు మీటర్ల పొడవు, రెండు మీటర్ల ఎత్తు ఉంటుందన్నారు. బరువును బ్యాలెన్స్‌ చేసేలా వెనుకభాగంలో రెండు ముందు భాగంలో ఒక ఎలక్ట్రిక్‌ మోటార్లు ఉంటాయన్నారు. ఇవి 1000బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తాయన్నారు. సంవత్సరానికి దాదాపు 1500యూనిట్లను ఉత్పత్తి చేసే అకవాశం ఉందని తెలిపారు.