రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఇంత తక్కువకేనా.. ధర వింటే ఆశ్చర్యపోతారు!
1986లో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350సీసీ బైక్ ధర చాలా తక్కువ. అవును.. నమ్మలేకపోతున్నారా..? ప్రస్తుతం ఈ బైక్ పాత బిల్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రస్తుతం ఏ బైక్ కొనాలన్నా కనీసం రూ.50వేల పైనే ఖర్చుపెట్టాలి. అలాంటిది కొంచెం పెద్ద బైక్ కొనాలంటే లక్ష కంటే ఎక్కువే అవుతుంది. అయితే, యూత్ తో పాటు ప్రతి ఒక్కరూ ఇష్టపడే బైక్ రాయల్ ఎన్ఫీల్డ్. ఈ బైక్‌కి ఒకప్పటి నుంచి మార్కెట్లో డిమాండ్ ఉంది.
కానీ, 1986లో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350సీసీ బైక్ ధర చాలా తక్కువ. అవును.. నమ్మలేకపోతున్నారా... ప్రస్తుతం ఈ బైక్ పాత బిల్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని ధర అప్పట్లో ఎంత ? ఎందుకు అంత తక్కువ ? అని తెలుసుకోవాలని ఉందా...
భారత సైన్యం ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో గస్తీ కోసం రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకుని ఉపయోగించింది. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ అప్పటి నుండి ఇప్పటి వరకు భారతీయ ప్రజల్లో చెరిగిపోని ముద్ర వేస్తూ ఎంతో ప్రజాదరణ పొందింది. దేశ వ్యాప్తంగా బుల్లెట్ లవర్స్ గత కొన్ని ఏళ్లుగా రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 బైకును కొనేందుకు ఇష్టపడుతున్నారు.
ఈ బైక్ చాలా కాలం నుండి కంపెనీ తయారు చేస్తున్నందున కొంతమంది దానిని స్వంతం చేసుకోవడం లగ్జరీ ఇంకా గర్వంగా భావిస్తారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 కొన్ని సంవత్సరాల్లోనే కొన్ని చిన్న టెక్నాలజీ మార్పులకు లోనైనప్పటికీ, డిజైనర్లు బైక్ లుక్ అండ్ ఫీల్‌ని కాపాడేందుకు ప్రయత్నించారు.
ప్రస్తుతం ఆల్ న్యూ క్లాసిక్ 350 అఫీషియల్ వెబ్‌సైట్ (ఎక్స్-షోరూమ్) ధర రూ. 2.2 లక్షలు. అయితే, ఈ బైక్ ధర ఒకప్పుడు రూ.18,700 అని మీకు తెలుసా ? విచిత్రంగా అనిపించినా, జనవరి 23, 1986 నాటి బైక్ ధర చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
పాతకాలపు బైక్ లవర్ దీన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఇందులో బులెట్ ఇన్‌వాయిస్ రూ. 18,700తో 36 సంవత్సరాల బండి అని చూపించాడు. సందీప్ అనే ఆటో మొబైల్ డీలర్ దీనిని సప్లయ్ చేశారు. జార్ఖండ్‌లోని బొకారోలోని ఓ ఆటో కంపెనీ 36 ఏళ్ల క్రితం దీన్ని విక్రయించింది.
అప్పట్లో బిల్లులో పేర్కొన్న బుల్లెట్‌ను కేవలం ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ అని పిలిచేవారు. భారత సైన్యం ప్రాథమికంగా సరిహద్దు ప్రాంతాల్లో పెట్రోలింగ్ కోసం ఈ మోటార్‌సైకిల్‌ను ఉపయోగించింది. ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్ గురించి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ భారీ లైక్‌లు మరియు కామెంట్‌లను పొందుతోంది.