Asianet News TeluguAsianet News Telugu

ఒక్కసారి చార్జింగ్ చేస్తే 156 కి.మీ. మైలేజీ.. రివోల్ట్ ఆర్వీ 400 బెస్ట్


మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ ‘మైక్రోమాక్స్’ అనుబంధ రివోల్ట్ ఇంటెల్లీ కార్స్ ఆధ్వర్యంలో  ‘ఆర్‌వీ 400’ పేరుతో తొలి 'ఏఐ' ఎలక్ట్రిక్‌ బైక్‌ చేపట్టనున్నది. దీంతో ఈ నెల 28వ తేదీన అధికారికంగా మార్కెట్లోకి విడుదల కానున్నది.

Revolt RV 400 AI-Enabled Electric Bike Rolls Off the Assembly Line, Launch on August 28
Author
Hyderabad, First Published Aug 8, 2019, 11:52 AM IST

స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ మైక్రోమాక్స్‌ సహ-వ్యవస్థాపకుడు రాహుల్‌ శర్మకు చెందిన ఎలక్ట్రిక్‌ టూ వీలర్‌ స్టార్టప్‌ ‘రివోల్ట్‌ ఇంటెల్లీకార్ప్‌’ తన తొలి వాహనాన్ని విపణిలోకి విడుదల చేయనుంది. ‘ రివోల్ట్‌ ఆర్‌వీ 400’  పేరుతో పరిచయం చేసిన  ఈ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌ను ఈ నెల 28వ తేదీన ఆవిష్కరించనున్నామని రివోల్ట్‌ ఇంటెల్లీకార్ప్‌ వ్యవస్థాపకులు రాహుల్‌ శర్మ  ట్వీట్ చేశారు. 
  
దేశంలో తొలిసారిగా కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీ  ఆధారంగా రూపొందించిన ఈ బైక్‌ను ఒకసారి పూర్తిగా చార్జ్‌ చేస్తే 156 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఆర్‌వీ 400 బ్యాటరీని 4 గంటల్లో పూర్తిగా చార్జ్‌ చేసుకోవచ్చు.  ఢిల్లీ వినియోగదారుల కోసం రూ.1000లతో జూన్ 25 నుంచి బుకింగ్స్‌ను  ప్రారంభించిన సంగతి తెలిసిందే.

వచ్చే నాలుగు నెలల్లో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, పుణె, బెంగళూరు, హైదరాబాద్‌, నాగ్‌పూర్‌, అహ్మదాబాద్‌, చెన్నై మార్కెట్లోకి ఈ వాహనాన్ని విడుదల చేయనుంది. అలాగే చార్జింగ్‌ కోసం కంపెనీ ఆన్‌బోర్డ్‌, పోర్టబుల్‌ చార్జింగ్‌ ఫీచర్లను ఆఫర్‌ చేస్తోంది. ఈ సంస్థ హర్యానాలోని మనేసర్‌ యూనిట్‌లో ఏటా 1.2 లక్షల వాహనాల ఉత్పత్తి సామర్థ్యంతో కూడిన ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్టు  కంపెనీ ప్రకటించింది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios