Asianet News TeluguAsianet News Telugu

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ యూజర్లకి షాకింగ్ న్యూస్!

చెన్నైలోని కంపెనీ ప్రొడక్షన్ ప్లాంటులో మే నుంచి జూన్ 2017 మధ్య కాలంలో తయారైన ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఎస్‌యూవీల దృఢత్వం విషయంలో తలెత్తిన అనుమానాల కారణంగా, ఈ కాలంలో తయారైన 4,379 యూనిట్ల ఎకోస్పోర్ట్ ఎస్‌యూవీలను రీకాల్ చేసినట్లు ఫోర్డ్ ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది.

Recall Alert: Ford Recalls Over 4000 EcoSport SUVs

మీరు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారును ఉపయోగిస్తున్నారా..? అయితే, బహుశా మీ ఫోర్డ్ కారును ఓసారి షోరూమ్‌కి తీసుకెళ్లాల్సి రావచ్చు. వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ, భారత మార్కెట్లో అందిస్తున్న తమ పాపులర్ మోడల్ 'ఫోర్డ్ ఎకోస్పోర్ట్'లో తలెత్తిన కొన్ని సమస్యలను సరిచేసేందుకు గాను సుమారు 4000 యూనిట్లకు పైగా వెనక్కి (రీకాల్) పిలుస్తున్నట్లు తెలిపింది.

ఫోర్డ్ ఇండియా తమ ఎకోస్పోర్ట్ మోడల్‌ను తమిళనాడు మార్కెట్లో ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే.  చెన్నైలోని కంపెనీ ప్రొడక్షన్ ప్లాంటులో మే నుంచి జూన్ 2017 మధ్య కాలంలో తయారైన ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఎస్‌యూవీల దృఢత్వం విషయంలో తలెత్తిన అనుమానాల కారణంగా, ఈ కాలంలో తయారైన 4,379 యూనిట్ల ఎకోస్పోర్ట్ ఎస్‌యూవీలను రీకాల్ చేసినట్లు ఫోర్డ్ ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది.

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఎస్‌యూవీని ఫ్రంట్ లోవర్ కంట్రోల్ ఆర్మ్ వెల్డింగ్ ఇంటిగ్రిటినీ (ముందు భాగంలో చేసిన వెల్డింగి సామర్థ్యాన్ని) పరీక్షించడం కోసం ఈ రీకాల్ చేసినట్లు ఫోర్డ్ ఇండియా తెలిపింది. ఈ రీకాల్‌కు గురైన ఎస్‌యూవీలలో వెల్డింగ్ సామర్థ్యం బలహీనంగా ఉందన్న ఫిర్యాదులు అందాయని దీంతో కంపెనీ ఆ కార్లను రీకాల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సమస్య వలన స్టీరింగ్ కంట్రోల్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది. రీకాల్‌కు గురైన వాహన యజమానులకు లేఖల ద్వారా ఫోర్డ్ ఇండియా ఈ విషయాన్ని తెలియజేస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios