హైదరాబాద్‌, ఫిబ్రవరి 19,2020: దేశంలో అతి పెద్ద ఆటోమొబైల్‌ రిటైలర్లలో ఒకరైన పీపీఎస్‌ మోటార్స్‌ తమ పీవీ డీలర్‌షిప్‌ నెట్‌వర్క్‌ను ఐదు నూతన షోరూమ్‌లు–ఎల్‌బీ నగర్‌, కొంపల్లి, మలక్‌పేట, వరంగల్‌, నిజామాబాద్‌లలో– తెరువడం ద్వారా విస్తరించింది.

నూతన రెనాల్ట్‌ కిగర్‌ ధర 5.45 లక్షల రూపాయలు. హైదరాబాద్‌లో నూతన షోరూమ్‌ ప్రారంభం సందర్భంగా దీనిని ఆవిష్కరించారు. రెనాల్ట్‌ కిగర్‌ వాహనాన్ని రెండు ఇంజిన్‌ అవకాశాలు 1.0 లీటర్‌ ఎనర్జీ మరియు 1.0 లీటర్‌ టర్బో –మాన్యువల్‌, ఆటోమేటిక్‌ అవకాశాలలో అందిస్తున్నారు.

రెనాల్ట్‌ కిగర్‌ ఇప్పుడు ఆరు ఉత్సాహపూరితమైన బాడీ కలర్స్‌లో అత్యద్భుతమైన డ్యూయల్‌టోన్‌ కాంబినేషన్‌లో  లభిస్తుంది. ఇది నాలుగు ట్రిమ్స్‌– ఆర్‌ఎక్స్‌ఈ, ఆర్‌ఎక్స్‌ఎల్‌, ఆర్‌ఎక్స్‌టీ, ఆర్‌ఎక్స్‌జెడ్‌లో లభిస్తుంది. ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌, సీ ఆకృతి సిగ్నేచర్‌ ఎల్‌ఈడీ టైల్‌ ల్యాంప్స్‌,40.64 సెంటీమీటర్‌ వీల్స్‌, రూఫ్‌ రైల్‌ బార్స్‌, డ్యూయల్‌ టోన్‌ అవకాశాలు అన్ని ట్రిమ్స్‌లో లభ్యమవుతాయి.

నూతన రెనాల్ట్‌ కిగర్‌ వాహనాలను అన్ని పీపీఎస్‌ రెనాల్ట్‌ షోరూమ్‌ల వల్ల వినియోగదారులు టెస్ట్‌ డ్రైవ్‌ చేయవచ్చు. దీనితో పాటుగా 11వేల రూపాయలు చెల్లించి దీనిని బుక్‌ చేసుకోవచ్చు. నూతన రెనాల్ట్‌ కిగర్‌ డెలివరీలు మార్చి03,2021వ తేదీ నుంచి ఆరంభమవుతాయి.

ఈ సందర్భంగా శ్రీ రాజీవ్‌ సంఘ్వీ, మేనేజింగ్‌ డైరెక్టర్‌, పీపీఎస్‌ మోటార్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మాట్లాడుతూ ‘‘రెనాల్ట్‌ ఇండియాతో భాగస్వామ్యం బలోపేతం చేసుకోవడం పట్ల ఆనందంగా ఉన్నాం. తెలంగాణాలో మా ఉనికిని మరింతగా విస్తరించాం.

అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ఎస్‌యువీ రెనాల్ట్‌ కిగర్‌ను  ఆవిష్కరించడం పట్ల సంతోషంగా ఉన్నాం. సృజనాత్మతక డిజైన్‌, అసాధారణ ధర వంటివి బీ–ఎస్‌యువీ విభాగంలో  నూతన ప్రమాణాలను రెనాల్ట్‌ కిగర్‌ ఏర్పరుస్తుంది. ప్రపంచంలో అత్యుత్తమ ప్రక్రియలతో పాటుగా వినియోగదారుల ప్రాధాన్యతలను అర్థం చేసుకోవడం వంటి అంశాల కారణంగా అత్యున్నత శ్రేణి వినియోగదారుల అనుభవాలను అందించనున్నాం’’ అని అన్నారు.

For further details please contact: sreedhar@adfactorspr.com / venkat.palivela@adfactorspr.com