సారాంశం

భారతదేశంలో Mercedes-Benz GLS 2925 cc డీజిల్ ఇంజిన్‌తో అందించబడుతుంది. ఈ SUV కార్ ఇంజన్ 326 హార్స్‌పవర్, 700 న్యూటన్ మీటర్ల టార్క్‌ను అందిస్తుంది. దీనితో పాటు, 3982 సిసి పెట్రోల్ ఇంజన్ కూడా ఇందులో ఉంది.

భారత మార్కెట్లో హై పవర్ ఫుల్ ఇంజన్ తో ఎన్నో  వాహనాలు ఉన్నాయి. అలాంటి వాహనాలు కార్ లవర్స్ కి ఎంతో ఇష్టం. 300 కంటే ఎక్కువ హార్స్ పవర్ వచ్చే ఐదు వాహనాల గురించి మీకోసం.. 

మెర్సిడెస్ 
భారతదేశంలో Mercedes-Benz GLS 2925 cc డీజిల్ ఇంజిన్‌తో అందించబడుతుంది. ఈ SUV కార్ ఇంజన్ 326 హార్స్‌పవర్, 700 న్యూటన్ మీటర్ల టార్క్‌ను అందిస్తుంది. దీనితో పాటు, 3982 సిసి పెట్రోల్ ఇంజన్ కూడా ఇందులో ఉంది. ఈ SUV 550 హార్స్‌పవర్, 730 న్యూటన్ మీటర్ల టార్క్‌ను పొందుతుంది. ఈ SUVకి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లభిస్తుంది.

ఆడి Q8
Q8 SUVని ఆడి కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఈ కార్ త్రి-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇంకా 335 హార్స్‌పవర్, 500 న్యూటన్ మీటర్ల టార్క్‌ను పొందుతుంది. ఇంకా క్వాట్రో టెక్నాలజీతో వస్తుంది.

ఆడి Q7
Q7 SUV కూడా ఆడి నుండి అందించబడుతుంది. ఈ SUV బాలీవుడ్ తారలతో పాటు పారిశ్రామికవేత్తలు, కొంతమంది రాజకీయ నాయకులకు ఇష్టమైన SUV. ఈ suv 3000 cc పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజన్ అప్షన్ పొందుతుంది. రెండు ఇంజన్లు SUVకి 300 హార్స్‌పవర్ కంటే ఎక్కువ శక్తిని ఇస్తాయి.

ల్యాండ్ రోవర్
డిస్కవరీ SUVని ల్యాండ్ రోవర్ కంపెనీ శక్తివంతమైన ఇంజన్‌తో అందిస్తుంది. ఈ కార్ పెట్రోల్ ఇంకా డీజిల్ ఇంజన్ అప్షన్ కూడా పొందుతుంది. ఈ SUV రెండు-లీటర్ పెట్రోల్ ఇంజన్ నుండి 296 bhp, 400 Nm టార్క్‌ను అందిస్తుంది. SUV త్రి-లీటర్ డీజిల్ ఇంజన్ నుండి 355 bhp, 650 న్యూటన్ మీటర్ల టార్క్‌ను పొందుతుంది.

వోల్వో
XC90 SUVని వోల్వో అందిస్తోంది. ఇందులో రెండు లీటర్ పెట్రోల్ ఇంజన్ లభిస్తుంది. దీనితో ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ కూడా ఇచ్చారు. ఈ SUV ఇంజిన్ నుండి 402 హార్స్‌పవర్, 640 న్యూటన్ మీటర్ల టార్క్‌ను పొందుతుంది. లైట్ హైబ్రిడ్ ఇంజిన్‌తో, SUV 295 హార్స్‌పవర్, 420 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఇస్తుంది. ఈ SUV లెవెల్ 2 ADAS వంటి ఫీచర్లతో వస్తుంది.