5.9 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగం...ధర ఎంతంటే ?
ప్రముఖ విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ పోర్షే దేశీయ విపణిలోకి కైయేన్ కూపే కారును విడుదల చేసింది. వీ 6 వేరియంట్ కారు ధర రూ.1.36 కోట్లుగా, వీ 8 వేరియంట్ కారు ధర రూ.1.97 కోట్లుగా నిర్ణయించింది.
న్యూఢిల్లీ: విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ పోర్షే.. భారతదేశ విపణిలోకి సరికొత్త కైయేన్ కూపే కారును విడుదల చేసింది. ఈ కారు వీ6 వేరియంట్ ప్రారంభ ధర రూ.1.36 కోట్లుగా నిర్ణయించింది పోర్షే. ఇక వీ 8 వేరియంట్ కారు ధర రూ.1.97 కోట్లు అని పేర్కొంది. ఇందులో అమర్చిన పనోరమిక్ గ్లాస్ అదనపు ఆకర్షణగా నిలిచింది.
also read యమహా ఫస్ట్ 'బ్లూ స్క్వేర్' ప్రీమియం కాన్సెప్ట్ షోరూమ్...
ఈ కారు వెనుక సీట్లలో ఇద్దరు కూర్చోవడానికి పోర్షే సంస్థ సీట్లను రూపొందించింది. సాధారణ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్‌యూవీ)కు భిన్నంగా ఈ కారును రూపొందించింది పోర్షే.కారులో సుమారు 625 లీటర్ల బూట్ సామర్థ్యం ఉంది.
ఈ కారులో 3.0 వీ6 టర్బో చార్జిడ్ ఇంజిన్ అమర్చారు. ఇందులో 335 బీహెచ్పీ శక్తిని, 450 ఎన్ఎం టార్చి విడుదల చేస్తుంది. అత్యధికంగా 243 కిలోమీటర్ల వేగంతో ఈ కారు ప్రయాణించగలదు. కేవలం 5.9 క్షణాల్లో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.
also read డీజిల్ ఇంజిన్ కార్ల ఉత్పత్తిపై ‘మారుతి’ పునరాలోచన
ఇక కైయెన్ టర్బో కూపే 4.0 లీటర్ ట్విన్ టర్బో చార్జిడ్ వీ8 ఇంజిన్‌ను అమర్చారు. ఇది 542 బీహెచ్పీ శక్తిని, 770 ఎన్ఎం టార్చిని విుడదల చేస్తుంది. ఈ కారు కేవలం 3.9 క్షణాల్లో 100 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. అత్యధికంగా 286 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల సామర్థ్యం దీని సొంతం. 22 అంగుళాల జీటీ డిజైన్ వీల్స్ ఈ కారుకు అమర్చారు.