బీఎస్-6 ఎరా వచ్చేసినా కొన్ని మోడల్స్ ఇంకా..

 దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లోకి బీఎస్-6 ప్రమాణాల తరం వచ్చేసింది. పలు కార్లు, బైక్స్, స్కూటర్ల తయారీ సంస్థలు తమ మోడల్ వాహనాలన్నీ బీఎస్-6 ప్రమాణాలతో తీర్చి దిద్దాయి. కానీ కొన్ని సంస్థలు ఇంకా తమ కొన్ని మోడల్ బైకులు, స్కూటీలను రీడిజైన్ చేయడంలోనే నిమగ్నమయ్యాయి.

Popular Two-wheelers Yet To Receive BS6 Update: Honda CB Hornet 160R, Honda Grazia 125, Benelli Imperiale 400, TVS Victor & More

న్యూఢిల్లీ: ఆర్థిక మాంద్యం.. మందగమనం కొనసాగుతున్నా.. కరోనా వైరస్ ప్రభావంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించినా గత నెల 31తో బీఎస్-4 వాహనాల తరం ముగిసింది. కాలుష్య నివారణకు బీఎస్-6 ప్రమాణాలతో కూడిన వాహనాల విక్రయం అధికారికంగా ప్రారంభమైంది. 

అఫ్‌కోర్స్.. కరోనా లాక్ డౌన్ పుణ్యమా? అని లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత పది రోజుల వరకు బీఎస్-4  వాహన నిల్వల్లో 10 శాతం విక్రయానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చినా బీఎస్-6 వాహనాల విక్రయం ప్రారంభమైన తర్వాత పెద్ద తేడా ఏమీ ఉండదన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. 

దాదాపు టూ వీలర్స్ సంస్థలన్నీ బీఎస్-6 తరంలోకి అడుగు పెట్టేశాయి. అయితే కొన్ని ప్రజాదరణ పొందిన మోడల్ బైక్స్, స్కూటర్లు మాత్రం ఇంకా బీఎస్-6లోకి రూపాంతరం చెందలేదు. అవేంటో ఒక్కసారి పరిశీలిద్దాం..

యాక్టీవా 125 స్కూటర్‌ను బీఎస్-6 దారి తొలిసారి మళ్లించిన ఘనత కొట్టేసిన హోండా మోటార్ సైకిల్స్ యాజమాన్యం పలు మోడల్స్‌ను పట్టించుకోలేదు. వాటిల్లో హోండా సీబీ హార్నెట్ 160ఆర్, ఎక్స్ బ్లేడ్ బైక్స్ ఉన్నాయి. ఇవి అత్యధికంగా కర్బన ఉద్గారాలను వెల్లడిస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. 

యూనికార్న్ బీఎస్ మోడల్ బైక్ 160 సీసీ ఇంజిన్ సామర్థ్యంతో రూపుదిద్దుకున్నది. ఇక 125 సీసీ సామర్థ్యంతో కూడిన హోండా గ్రాజియా 125 స్కూటీ బీఎస్-6లోకి రూపాంతరం చెందలేదు. దీనికి కారణం ఈ స్కూటీ అంతగా విజయవంతం కాలేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 

ఒకవేళ హోండా గ్రాజియా కర్బన ఉద్గారాలను నియంత్రించేలా అప్‌డేట్ కావాలంటే యాక్టీవా 125 స్కూటీ నుంచి ఏసీజీ స్టార్టర్, ఇడ్లింగ్ స్టాఫ్ సిస్టంతో కూడిన నూతన ఇంజిన్ రూపొందించాల్సి ఉంటుంది. ఆ దిశగా హోండా గ్రాజియా రూపుదిద్దుకుంటే ఆశ్చర్య పోవాల్సిందేమీ లేదు.

ప్రముఖ బైక్స్ తయారీ సంస్థ బెనెల్లి ఇండియా ఎంతో కాలం క్రితమే తన మోటారు సైకిళ్లను బీఎస్-6 అప్ డేట్ చేస్తామని ప్రకటించింది. ఇప్పటికి బీఎస్-6 ఎమిషన్ నామ్స్‌కు అనుగుణంగా ఇంపెరియేల్ 400 రూపుదిద్దుకోలేదు. గడువు ముగిసిన తర్వాత ఇంపీరియెల్ 400 బైక్.. బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా రూపుదిద్దు కుంటున్నది. కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో ఈ నెలలో విపణిలో అడుగు పెట్టనున్నదని భావిస్తున్నారు. 

జపాన్ బైక్స్ తయారీ సంస్థ కవాసాకికి చెందిన నింజా 300 బైక్ అత్యంత ప్రజాదరణ పొందింది. అంతే కాదు దేశీయంగానే ఉత్పత్తి చేసి ఈ బైక్‌ను తక్కువ ధరకే వినియోగదారులకు అందుబాటులోకి తేవాలని తలపోసింది కవాసాకీ.

ప్రపంచ దేశాల్లో ఎక్కడ డిమాండ్ లేకపోయినా.. ఇప్పటికీ నింజా 300 బైకుకు భారత్ మార్కెట్‌గా ఉంది. స్థానికంగా తయారు చేయడంతో తక్కువ ధరకే లభిస్తుందని భావించినా కొన్ని నెలల్లో బీఎస్-6 ప్రమాణాలతో కూడిన నింజా 300 బైక్ విపణిలోకి అడుగు పెడుతుందని అంచనా వేస్తున్నారు. 

మరోవైపు టీవీఎస్ మోటార్ సైకిల్స్ సంస్థ నిశ్శబ్దంగా తన బైక్స్, స్కూటర్లను బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా అప్ డేట్ చేస్తోంది. స్కూటీ పెప్ ప్లస్ ధరలు పెరుగనున్నాయి. ఈ సంస్థ పరిధిలో కొన్ని హ్యాండ్ ఫుల్ మోడల్ బైక్స్, స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. కానీ విక్టర్ మోడల్ బైక్ ఇంకా బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా అప్ డేట్ చేయలేదు. ఈ ఏడాది ప్రారంభంలోనే రేడియన్ బైక్ బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా అప్ డేట్ అయింది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios