Asianet News TeluguAsianet News Telugu

దీపావళి, ధన్‌తేరాస్‌ రోజున మీ డ్రీమ్ కారును కొనాలని ప్లాన్ చేస్తున్నారా..? ఈ కార్ల గురించి తెలుసుకోండి

చాలా ముందుగానే  డ్రీమ్ కారును బుక్ చేసుకున్న వారు ధన్‌తేరస్ రోజున ఇంటికి తీసుకురావడం అదృష్టంగా భావించవచ్చు. అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లకి  65 వారాల కంటే ఎక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. 

Planning to buy your dream car on Diwali? So know waiting period of these cars
Author
First Published Oct 19, 2022, 3:25 PM IST

దీపావలి, ధన్‌తేరస్ రోజున  మీ డ్రీమ్‌ కారును ఇంటికి తీసుకురావాలని చూస్తున్న కొంత నిరాశకు గురవుతుంటారు. ఎందుకంటే అధిక డిమాండ్ కారణంగా ఈ ప్రత్యేకమైన పవిత్రమైన రోజున డీలర్లు ఇన్స్టంట్ బుకింగ్‌లు తీసుకోవడం ఆపివేశారు. మీడియా నివేదికల ప్రకారం, అక్టోబర్ 23న ధన్‌తేరస్ సందర్భంగా డెలివరీ కోసం నాలుగు లక్షల కస్టమర్‌లు ఇప్పటికే  వారి డ్రీమ్ కార్ ను బుక్ చేసుకున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అయితే, బెస్ట్ సెల్లింగ్ కార్లపై వెయిటింగ్ పీరియడ్ కూడా చాలా వేగంగా పెరుగుతోంది. ఈ దీపావళికి కార్ల బుకింగ్, డెలివరీ పరిస్థితి ఏంటో తెలుసుకోండి... 

చాలా ముందుగానే  డ్రీమ్ కారును బుక్ చేసుకున్న వారు ధన్‌తేరస్ రోజున ఇంటికి తీసుకురావడం అదృష్టంగా భావించవచ్చు. అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లకి  65 వారాల కంటే ఎక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఉదాహరణకు, మహీంద్రా  అత్యధికంగా అమ్ముడైన మోడల్ XUV700 ఎస్‌యూ‌వి దాదాపు 66-68 వారాల వెయిటింగ్ పీరియడ్‌ ఉంది. XUV500 SUV కొన్ని మోడళ్లకు 7-27 వారాల వెయిటింగ్ పీరియడ్ ఉంది, అయితే థార్ డీజిల్ 23-25 ​​వారాల వెయిటింగ్ పీరియడ్‌ ఉండగా, బొలెరో డీజిల్ కోసం కూడా 10 వారాల వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. 

టాటా మోటార్స్  కార్ల గురించి మాట్లాడితే అత్యధికంగా అమ్ముడవుతున్న SUV టాటా నెక్సాన్ మోడల్ వేరియంట్‌లను బట్టి 16 నుండి 20 వారాల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంది. టాటా పంచ్ కోసం, 24 నుండి 26 వారాల వెయిటింగ్ పీరియడ్ ఉంది. అలాగే నిస్సాన్ మాగ్నైట్  కోసం 10-12 వారాల వెయిటింగ్ పీరియడ్‌  ఉంది.

ఈ ఏడాది దసరా నవరాత్రి సందర్భంగా సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 మధ్య ఆటోమొబైల్ పరిశ్రమ మొత్తం 5,39,227 వాహనాలను విక్రయించింది. పండుగ సందర్భంగా 1,10,521 ప్యాసింజర్ వాహనాలు, 3,69,020 ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. 

అధిక డిమాండ్ ఉన్నప్పటికీ ఈ సంవత్సరం నవరాత్రి-దసరా, ధన్‌తేరాస్-దీపావళి పండుగ సీజన్ ఇండియాలోని వాహన తయారీదారులకు దాదాపు ఒక దశాబ్దంలోనే నిరాశగా ఉందని వాహన విక్రయాల గణాంకాలు చూపిస్తున్నాయి. నవరాత్రి నుండి దీపావళి వరకు ప్రధాన పండుగ సీజన్‌లో పర్సనల్ మొబిలిటీ విభాగంలో అత్యధిక డిమాండ్ అండ్ సేల్స్ ఉన్నాయి. అయితే ఈసారి ముఖ్యంగా ఉత్తర భారతంలో డిమాండ్ బాగా తగ్గింది. 

గత ఏడాది పండుగ సీజన్‌తో పోలిస్తే ఈ 30 రోజుల్లో వాహనాల రిజిస్ట్రేషన్ రెండంకెలు బాగా తగ్గింది. ముడి పదార్థాల కొరత, ప్రపంచ సరఫరా చైన్ వంటి సమస్యలు దీనికి కారణమని చెప్పవచ్చు.

Follow Us:
Download App:
  • android
  • ios