Auto Sales: మార్చిలో భారీ తగ్గుదల.. 10 ఏళ్ల కనిష్టానికి వాహన అమ్మకాలు..!

టూవీలర్ అమ్మకాలు భారీగా తగ్గాయి. పదేళ్ల కనిష్ట స్థాయికి దిగి వచ్చాయి. అలాగే ఇతర వాహన అమ్మకాల్లో కూడా తగ్గుదల కనిపించింది. అయితే త్రివీలర్, కమర్షియల్ వాహన అమ్మకాలు మాత్రం కొంత మేర పెరిగాయి. చిప్ కొరత కారణంగా ఆటోమొబైల్ పరిశ్రమపై ఎఫెక్ట్ పడిందని చెప్పుకోవచ్చు. 
 

Passenger vehicle sales dip nearly 4% in March

దేశంలో వాహన అమ్మకాలు పడిపోతూనే వస్తున్నాయి. ప్యాసింజర్ వాహన అమ్మకాలు తగ్గాయి. మార్చి నెలలో 4 శాతం మేర క్షీణత నమోదైంది. 2,79,501 యూనిట్లుగా నమోదు అయ్యాయి. వెహికిల్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆర్గనైజేషన్ సియామ్ తాజా గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది. 2021 మార్చి నెలలో ప్యాసింజర్ వాహన అమ్మకాలు 2,90,939 యూనిట్లుగా ఉన్నాయి.

లేటెస్టే డేటా ప్రకారం చూస్తే.. టూవీలర్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. ఏకంగా 21 శాతం క్షీణత నమోదైంది. మార్చి నెలలో టూవీలర్ విక్రయాలు 11,84,210 యూనిట్లుగా ఉన్నాయి. ఇది పదేళ్ల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. గత ఏడాది ఇదే నెలలో టూవీలర్ అమ్మకాలు 14,96,806 యూనిట్లుగా నమోదు అయ్యాయి. ఈ సమయంలో మోటార్‌సైకిళ్ల అమ్మకాలు 21 శాతం తగ్గాయి. వార్షిక ప్రాతిపదికన ఈ మార్చి నెలలో టూవీలర్ విక్రయాలు 9,93,996 యూనిట్ల నుంచి 7,86,479 యూనిట్లకు తగ్గాయి. స్కూటర్ అమ్మకాలు 4,58,122 యూనిట్లుగా ఉన్నాయి.

దేశీయంగా ప్యాసింజర్ వాహనాల టోకు అమ్మకాలు మార్చిలో 3.9 శాతం క్షీణించాయని ఆటో పరిశ్రమ సమాఖ్య సియామ్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. సమీక్షించిన నెలలో పరిశ్రమ మొత్తం 2,79,501 యూనిట్ల విక్రయాలను నమోదు చేసిందని, గత ఏడాది ఇదే నెలలో మొత్తం 2,90,939 యూనిట్లుగా నమోదయ్యాయని సియామ్ పేర్కొంది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరింగ్(సియామ్) తాజా గణాంకాల ప్రకారం.. వాహన తయారీ కంపెనీలు డీలర్లకు పంపించే ద్విచక్ర వాహనాలు 20.8 శాతం తగ్గి 11,84,210 యూనిట్లకు తగ్గాయి. 2021, మార్చిలో ఇవి 14,96,806 యూనిట్లుగా ఉన్నాయి.

గత నెలలో మోటార్‌సైకిళ్ల అమ్మకాలు 20.88 శాతం పడిపోయి 7,86,479 యూనిట్లుగా నమోదవగా, స్కూటర్ అమ్మకాలు 21.4 శాతం తగ్గి 3,60,082 యూనిట్లకు చేరాయి. త్రీ-వీలర్ అమ్మకాలు గతేడాది మార్చిలో అమ్ముడైన 32,310 యూనిట్ల నుంచి 32,088 యూనిట్లకు స్వల్పంగా తగ్గాయి. మొత్తంగా 2021-22లో ఆటో పరిశ్రమ 6 శాతం క్షీణతను ఎదుర్కొందని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ చెప్పారు. అన్ని విభాగాల్లోనూ సరఫరా సవాళ్లు ఇబ్బందిగా మారాయి. పరిశ్రమ 2020 ప్రారంభం నుంచి ఎదుర్కొంటున్న కష్టాల నుంచి ఇప్పటికీ పూర్తిగా పునరుద్ధరణ సాధించలేదు. ప్యాసింజర్, కమర్షియల్, త్రీ-వీలర్ వాహనాల అమ్మకాలు కోలుకుంటున్న సంకేతాలు ఇస్తున్నప్పటికీ ద్విచక్ర వాహనాల విభాగం మాత్రమే ఇంకా ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటున్నది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ విభాగం 11 శాతం పడిపోయింది.

మొత్తంగా ఆటోమొబైల్ పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఆటోమొబైల్ పరిశ్రమపై చిప్ కొరత ప్రభావం కూడా ఎక్కువగా ఉందని సియామ్ ప్రెసిడెంట్ కెనిచి అయుకవా తెలిపారు. వాహన పరిశ్రమలో కొంత రికవరీ ఉన్నా కూడా అమ్మకాలు మాత్రం 2018-19 నాటి కన్నా తక్కువగా ఉన్నాయని వివరించారు. కొన్ని విభాగాల్లో డిమాండ్ కనిపిస్తోందన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios