Asianet News TeluguAsianet News Telugu

మరోసారి చిక్కుల్లో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. కొన్న ఆరు రోజులకే ఎలా అయిపోయిందో చూడండి..

ఓలా ఎలక్ట్రిక్ పబ్లిక్ గ్రూప్ ద్వారా ఫేస్‌బుక్ పోస్ట్‌లో సంజీవ్ జైన్ ఈ స్కూటర్ ఫోటోలను  షేర్ చేశారు. ఫోటోలలో అతని రెడ్ కలర్ S1 ప్రో విరిగిన ఫ్రంట్ సస్పెన్షన్‌తో కనిపిస్తుంది. అతను కాలనీలో స్కూటర్ స్టార్ట్ చేసిన కొద్దిసేపటికే ఇలా జరిగిందని చెప్పాడు. 
 

Once again front suspension of Ola electric scooter broken  customer was driving after its delivery
Author
First Published Oct 13, 2022, 12:37 PM IST

ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ సమస్యలు తొలగిపోయాయి అని మీరు అనుకుంటే అలా కనిపించడం లేదని సూచించే సంఘటన ఒకటి ఉంది. ఓలా ఎలక్ట్రిక్  ఇండియన్ మార్కెట్లో అత్యధిక స్కూటర్లను విక్రయించడంలో విజయవంతమై ఉండవచ్చు, కానీ చాలా మంది ఇప్పటికీ ఓలా స్కూటర్లను కొనుగోలు చేయడం ద్వారా చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు.  తాజాగా సంజీవ్ జైన్ అని వ్యక్తి  ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌ని కొనుగోలు చేశాడు. డెలివరీ తీసుకున్న ఆరు రోజులకే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్రంట్ ఫోర్క్ విరిగిపోయిందని తెలిపాడు.

ఓలా ఎలక్ట్రిక్ పబ్లిక్ గ్రూప్ ద్వారా ఫేస్‌బుక్ పోస్ట్‌లో సంజీవ్ జైన్ ఈ స్కూటర్ ఫోటోలను  షేర్ చేశారు. ఫోటోలలో అతని రెడ్ కలర్ S1 ప్రో విరిగిన ఫ్రంట్ సస్పెన్షన్‌తో కనిపిస్తుంది. అతను కాలనీలో స్కూటర్ స్టార్ట్ చేసిన కొద్దిసేపటికే ఇలా జరిగిందని చెప్పాడు. 

సోషల్ మీడియాలో ఈ సమస్య హైలైట్ కావడం ఇదేం మొదటిసారి కాదు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్రంట్ సస్పెన్షన్ గుంతలు లేదా స్పీడ్ బ్రేకర్‌ని ఢీకొట్టిన తర్వాత విరిగిపోయిందని గతంలో నివేదికలు వచ్చాయి. ఇలాంటి ఘటనలు రైడర్‌కు చాలా ప్రమాదకరమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లలో నాణ్యత సమస్యలపై ఇప్పటికే చాలా విమర్శలను ఎదుర్కొంది. కంపెనీ వీటిని పెద్ద లోపాలుగా పరిగణించలేదు ఇంకా సాఫ్ట్‌వేర్ వైఫల్యాలు అని పేర్కొంది, వీటిలో చాలా వరకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అండ్ MoveOS 2 తో పరిష్కరించాయి. అలాగే, ప్యానెల్ గ్యాప్‌లు, రబ్బర్ మ్యాట్‌లు సరిగ్గా సరిపోకపోవడంతో బిల్ట్ క్వాలిటీ ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. S1 ప్రో అండ్ S1 మార్కెట్‌లో చాలా కొత్తవి కాబట్టి, భారతీయ రోడ్లపై ప్రతిరోజూ ఉపయోగించిన తర్వాత అవి ఎంతకాలం మన్నుతాయి అనేది ఇంకా తెలియదు. 

కంపెనీ ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్‌ల కోసం MoveOS 3ని విడుదల చేయడానికి పని చేస్తున్నాయి. ఈ ఏడాది దీపావళికి దీన్ని లాంచ్ చేయనున్నారు. ఓలా అప్‌డేట్‌తో లాంచ్ చేయనున్న ఫీచర్స్ టీజర్‌ను విడుదల చేసింది. యాక్సిలరేషన్ సౌండ్ ఇంకా పార్టీ మోడ్ ఫీచర్ ఉండవచ్చు. ఓలా మరింత బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్, అక్సెసోరిస్ కూడా విడుదల చేయవచ్చు. 

అయితే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లతో పాటు ఓలా స్కూటర్ల హార్డ్‌వేర్‌పై ఎలా దృష్టి పెడుతుందో చూడాలి. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లపై అందుతున్న ఫిర్యాదులు కస్టమర్ల భద్రత గురించి ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios