Asianet News TeluguAsianet News Telugu

ఒలింపియన్ రెజ్లర్ గీతా ఫోగట్ కొత్త కార్.. ట్విట్టర్ ఫోటో పై ఆనంద్ మహీంద్రా స్వీట్ రిప్లయ్..

గీతా ఫోగట్ భర్త  అండ్ బంగారు పతక విజేత రెజ్లర్ పవన్ కుమార్  వారి రెండేళ్ల కొడుకుతో  ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో ఇది బోనస్, Scorpio-N మా మొదటి కస్టమర్‌లలో గీత ఫోగట్ ఉండటం విశేషం అని అన్నారు.

Olympian Geeta Phogat took delivery of Mahindra Scorpio-N Anand Mahindra said this
Author
First Published Sep 29, 2022, 11:57 AM IST

ఒలింపియన్ రెజ్లర్ గీతా ఫోగట్ కొత్త కార్ మహీంద్రా స్కార్పియో-ఎన్ ఎస్‌యూ‌వి డెలివరీ పొందింది. గీతా ఫోగట్ తన కుటుంబంతో కలిసి మహీంద్రా ఎస్‌యూ‌వి కార్ డెలివరీ అందుకున్న  ఫోటోలను సోషల్ మీడియా ట్విట్టర్‌లో ట్వీట్ చేస్తూ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాని ట్యాగ్ చేసింది. వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా కూడా రెజ్లర్ అండ్ 2010 కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ గీతా ఫోగట్ ట్విట్టర్ పోస్ట్‌పై స్పందించారు. ఈ కొత్త ఎస్‌యూ‌వి మొదటి కస్టమర్లలో గీతా ఫోగాట్ ఒకరని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. అలాగే  స్కార్పియో-ఎన్ కుటుంబంలోకి ఆమెని స్వాగతించారు. 

గీతా ఫోగట్ భర్త  అండ్ బంగారు పతక విజేత రెజ్లర్ పవన్ కుమార్  వారి రెండేళ్ల కొడుకుతో  ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో ఇది బోనస్, Scorpio-N మా మొదటి కస్టమర్‌లలో గీత ఫోగట్ ఉండటం విశేషం అని అన్నారు.

మహీంద్రా స్కార్పియో-ఎన్ ఎస్‌యూవీ పూర్తిగా కొత్త ఆర్కిటెక్చర్‌తో నిర్మించారు. 30 జూలై 2022న బుకింగ్‌లు ప్రారంభమైన డేట్ నుండి 30 నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో లక్షకు పైగా బుకింగ్‌లను సంపాదించి రికార్డు సృష్టించింది. మహీంద్రా స్కార్పియో-ఎన్ డీజిల్ అండ్ పెట్రోల్ పవర్‌ట్రైన్‌తో ఐదు ట్రిమ్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఎస్‌యూ‌వి అన్ని వేరియంట్లు టూ-వీల్ డ్రైవ్ అండ్ ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ పొందుతాయి. 

ఇంజన్ అండ్ పవర్
కొత్త మహీంద్రా స్కార్పియో-N 200 PS పవర్, 380 Nm టార్క్ ఉత్పత్తి చేసే ఆమ్‌స్టాలియన్ పెట్రోల్ ఇంజన్ ద్వారా శక్తిని పొందింది. సెకండ్ ఆప్షన్ mHawk డీజిల్ ఇంజన్ 175 PS పవర్, 400 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గేర్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ లో 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఇంకా మహీంద్రా 4XPLOR 4WD సిస్టమ్‌తో 6-స్పీడ్ టార్క్-కన్వర్టర్ AT ఉన్నాయి. కొత్త మహీంద్రా స్కార్పియో-ఎన్ మల్టీ డ్రైవ్ మోడ్స్ పొందుతుంది.

గొప్ప ఫీచర్లు
AdrenoX కనెక్టివిటీ అప్లికేషన్ ద్వారా స్మార్ట్‌ఫోన్ అండ్ స్మార్ట్-వాచ్ రెండింటిలో యాక్సెస్‌తో 60కి పైగా కనెక్ట్ ఫీచర్లను అందిస్తుంది. కొత్త స్కార్పియో N 3D సౌండ్ స్టేజింగ్‌తో సోనీ 12-స్పీకర్ సిస్టమ్‌ పొందుతుంది. 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, Apple CarPlay అండ్ Android Auto సపోర్ట్‌తో పాటు Alexa కనెక్టివిటీ సపోర్ట్ కూడా ఉంది. సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, 3-వరుసల ఎయిర్ వెంట్‌లు, వైర్‌లెస్ ఛార్జర్, క్రూయిజ్ కంట్రోల్ ఇంకా ఎన్నో ఫీచర్స్ పొందుతుంది.  

సేఫ్టీ ఫీచర్లు
కొత్త మహీంద్రా స్కార్పియో N ఎన్నో సేఫ్టీ ఫీచర్లతో వస్తుంది. దీని ఫీచర్స్ లిస్ట్‌లో EBDతో ABS, మల్టీ ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, ట్రాక్షన్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, హిల్ డిసెంట్ కంట్రోల్ ఇంకా ఇతర ఫీచర్లు ఉన్నాయి. భారత మార్కెట్లో మహీంద్రా స్కార్పియో-N SUV టాటా సఫారి, టాటా హారియర్, హ్యుందాయ్ అల్కాజార్, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్,  MG హెక్టర్ ట్విన్స్ తో పోటీ పడుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios