డ్రైవరు లేకుండా హెలికాప్టర్ లాగా గాలిలోకి ఎగిరే కార్ ఎప్పుడైనా చూసారా.. ?
ఆకాశంలోకి ఎగరాలనే కోరిక అందరికీ ఉంటుంది. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని క్యాబ్ అగ్రిగేటర్ ఓలా సంస్థ డ్రైవరు లేకుండా ప్రాయనించే ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కారును త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది.
గ్లోబల్ క్యాబ్ అగ్రిగేటర్ ఓలా ఫుల్ ఆటోనోమస్ ఎగిరే కార్ల వ్యాపారంలో అడుగుపెట్టింది. యాప్ ఆధారిత టాక్సీ సేవలను అందించే ఓలా కార్లను మీరు చూసే ఉంటారు. కానీ భవిష్యత్తులో ఓలా ఎగిరే కార్ల కోసం సిద్ధంగా ఉండండి.
డ్రైవర్ లేకుండా ప్రయాణించే ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కారుతో త్వరలో వస్తున్నట్లు ఓలా ప్రకటించింది. ఓలా ఫ్లయింగ్ కార్ల ప్రాజెక్టులో భారత సంస్థ పనిచేస్తోంది. దీని బట్టి చూస్తుంటే ఆకాశంలో ఎగరాలన్న మీ కల త్వరలో నెరవేరనున్నట్లు అనిపిస్తుంది. ఓలా ప్రకారం ప్రపంచంలో మొట్టమొదటి డ్రైవర్ లెస్ ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కారును పరీక్షించడం ప్రారంభించింది.
also read 4నిమిషాల చార్జింగ్ తో 100కి.మీ మైలేజ్ ఇచ్చే కియా కొత్త కార్ వచ్చేసింది.. కొత్త లోగో, ఫీచర్స్ చూసారా....
ఓలా ప్రెసిడెంట్ అండ్ గ్రూప్ సిఇఒ భవీష్ అగర్వాల్ గురువారం సోషల్ మీడియా ట్విట్టర్ లో "ప్రపంచంలోని మొట్టమొదటి అండ్ ఏకైక ఫుల్ ఆటోనోమస్ ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కారును పరిచయం చేయబోతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. దీనికి ఓలా ఎయిర్ ప్రొ అని పేరు కూడా పెట్టారు.
ఇప్పుడు ప్రతి కుటుంబం ఆకాశంలో ఎగురుతుంది. అంతా కాకుండా ఈ ఫ్లయింగ్ కారు టెస్టింగ్ కోసం ఇప్పుడు కంపెనీ సైట్ లో ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు అని ఓలా సిఇఒ తెలిపారు.
ఈ ఓలా ఫ్లయింగ్ కారును ఒక్కసారి మాత్రమే ఛార్జ్ చేయవలసి ఉంటుంది ఎందుకంటే ఈ కారు ప్రయాణంలో ఉన్నప్పుడు సెల్ఫ్ ఛార్జ్ అవుతుంది. దీని కోసం ప్రాడక్ట్ డెవలప్మెంట్ వీడియోను కూడా విడుదల చేసింది. అలాగే ఇది ఫుల్ ఆటోనోమస్ కారు. అంటే ఈ వాహనాన్ని నడపడానికి పైలట్ లేదా డ్రైవ్ అవసరం లేదు.
ఓలా వీడియో ప్రకారం ఈ వాహనం వెర్టికల్ టేకాఫ్ ఇంకా ల్యాండింగ్ (విటిఓఎల్ ) సామర్థ్యాన్ని కలిగి ఉంది. అంటే హెలికాప్టర్ లాగా నేరుగా గాలిలోకి ఎగరగలదు. అందువల్ల దీనికి రన్‌వే అవసరం లేదు. ఈ ఫ్లయింగ్ కారు వేగం గంటకు 350 కిలోమీటర్లు అని కంపెనీ తెలిపింది. కాన్సెప్ట్ మోడల్‌లో చూపినట్లుగా, దీనికి పాయింటెడ్ ప్రొపెల్లర్ బ్లేడ్‌లు లేవు.