Asianet News TeluguAsianet News Telugu

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ కొత్త ఓఎస్.. దీని స్పెషాలిటీ ఎంటో తెలుసా..

ఓలా సి‌ఈ‌ఓ అండ్ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ కంపెనీ త్వరలో కొత్త OS 4ని తీసుకురావచ్చని సోషల్ మీడియాలో ద్వారా తెలిపారు. కొత్త OSలో కాన్సర్ట్ మోడ్ వంటి ఫీచర్‌లతో సహా అనేక ఫీచర్లను కంపెనీ యాడ్ చేస్తుంది.
 

Ola preparing to dance electric scooter, glimpse seen on social media-sak
Author
First Published Apr 7, 2023, 10:57 AM IST

దేశంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ త్వరలో కొత్త ఓఎస్‌ని తీసుకురావచ్చని సమాచారం. ఓలా సి‌ఈ‌ఓ అండ్ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ దీనిపై అందించిన సమాచారం ద్వారా తెలుస్తుంది.

కొత్త ఓఎస్
ఓలా సి‌ఈ‌ఓ అండ్ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ కంపెనీ త్వరలో కొత్త OS 4ని తీసుకురావచ్చని సోషల్ మీడియాలో ద్వారా తెలిపారు. కొత్త OSలో కాన్సర్ట్ మోడ్ వంటి ఫీచర్‌లతో సహా అనేక ఫీచర్లను కంపెనీ యాడ్ చేస్తుంది.

ఓలా వ్యవస్థాపకుడు అండ్ సీఈఓ భవిష్ అగర్వాల్ సోషల్ మీడియాలో దీనిపై  ఒక వీడియోను కూడా షేర్ చేశారు.  ఈ వీడియోలో ఓలా కొత్త ఫ్యూచర్ ఫ్యాక్టరీలో ఎలక్ట్రిక్ స్కూటర్లు వరుసలో ఉంటాయి ఇంకా కాన్సర్ట్ మోడ్‌ లాగానే స్కూటర్ లైట్లు నిరంతరం ఆన్‌లో ఉంటాయి. దీనితో పాటు, పార్టీ మోడ్ తర్వాత కాన్సర్ట్ మోడ్‌ను త్వరలో తీసుకువస్తామని భవిష్ అన్నారు. మీ అందరికీ OS4లో ఈ ఫీచర్ కావాలా అని కూడా కోరారు.

తగ్గిన ధర
ఇటీవల ఓలా SOne ప్రో ధరను తగ్గించింది. ఇప్పుడు రూ.1.25 లక్షల ధరతో SOne ప్రోని కొనుగోలు చేయవచ్చు. ఓలా ద్వారా SOne ఎయిర్‌ను ప్రవేశపెట్టిన తర్వాత దాని సేల్స్ పై ప్రభావం పడిందని, ఈ కారణంగా కంపెనీ Ola SOne Pro ధరను తగ్గించిందని నిపుణులు అంటున్నారు.

Move OS 3లో ఏముంది
Move OS 3 కూడా Ola ద్వారా కొంతకాలం క్రితం ప్రారంభించబడింది. ఇందులో అనేక కొత్త ఫీచర్లు జోడించారు. వీటికి హైపర్ ఛార్జింగ్, సెట్టింగ్ మోడ్, ఆర్టిఫిషియల్ సౌండ్, పార్టీ మోడ్, వెకేషన్ మోడ్, హిల్ హోల్డ్ ఫీచర్, ప్రాక్సిమిటీ లాక్ ఇంకా అన్‌లాక్ వంటి ఫీచర్లు అందించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios