పల్సర్ లాంటి లుక్ తో కొత్త ఎలక్ట్రిక్ బైక్.. ఆండ్రాయిడ్ డిస్‌ప్లే, గూగుల్ మ్యాప్స్ వంటి ఫీచర్లతో వచ్చేస్తోంది.

ఒడిస్సే వాడర్ ఎలక్ట్రిక్ బైక్ ని ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవడానికి ఇంకా కంపెనీ డీలర్‌షిప్ నెట్‌వర్క్‌లోని 68 అవుట్‌లెట్‌లలో రూ.999 బుకింగ్ మొత్తానికి అందుబాటులో ఉంటుంది.

Odysse Vader New electric bike launched with features like 7.0-inch Android display Google Maps know price-sak

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఒడిస్సీ ఎలక్ట్రిక్ వెహికల్స్ (Odysse electrical vehicles) భారత మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌ బైక్ ఒడిస్సీ వాడర్‌ను లాంచ్ చేసింది. వాడెర్ బైక్ భారతదేశంలో 7.0-అంగుళాల ఆండ్రాయిడ్ డిస్‌ప్లే  పొందిన మొట్టమొదటి మోటార్‌బైక్. అప్లికేషన్ అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా కంట్రోల్ చేయవచ్చు. ఈ మేడ్-ఇన్-ఇండియా ఎలక్ట్రిక్ బైక్ ప్రారంభ ధర రూ. 1.10 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద అందుబాటులో ఉంది.

బుకింగ్ & డెలివరీ వివరాలు
ఒడిస్సే వాడర్ ఎలక్ట్రిక్ బైక్ ని ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవడానికి ఇంకా కంపెనీ డీలర్‌షిప్ నెట్‌వర్క్‌లోని 68 అవుట్‌లెట్‌లలో రూ.999 బుకింగ్ మొత్తానికి అందుబాటులో ఉంటుంది. ఈ ఏడాది జులై నుంచి ఒడిస్సీ వాడేర్ డెలివరీలు ప్రారంభమవుతాయి. 

రేంజ్ అండ్ బ్యాటరీ
ఒడిస్సే వాడర్ ఎకో మోడ్‌లో 125 కి.మీ మైలేజ్ అందిస్తుందని పేర్కొన్నారు. IP67 AIS 156 సర్టిఫైడ్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది, దీనిని 4 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. కంపెనీ బ్యాటరీపై 3 సంవత్సరాలు, పవర్‌ట్రెయిన్‌పై 3 సంవత్సరాల వారంటీని అందిస్తోంది.

స్పీడ్ అండ్ బ్రేకింగ్
ఒడిస్సే వాడర్ 3000-వాట్ ఎలక్ట్రిక్ మోటారుతో ఇది గరిష్టంగా 85 kmph వేగంతో ప్రయానిస్తుంది. ఎలక్ట్రిక్ బైక్ లో కాంబి బ్రేకింగ్ సిస్టమ్ (CBS), ముందు 240ఎం‌ఎం డిస్క్ బ్రేక్, వెనుక 220ఎం‌ఎం డిస్క్ బ్రేక్ ఉన్నాయి. బైక్ బరువు 128 కిలోలు. 

ఫీచర్లు
ఆండ్రాయిడ్‌ కోసం అందుబాటులో ఉన్న ఒడిస్సే EV యాప్ ద్వారా పనిచేస్తుంది. ఈ EV యాప్ బైక్ లొకేటర్, జియో ఫెన్స్, ఇమ్మొబిలైజేషన్, యాంటీ-థెఫ్ట్, ట్రాక్ అండ్ ట్రేస్, లో బ్యాటరీ అలర్ట్ వంటి అనేక ఇతర యుటిలిటీలతో పాటు ద్విచక్ర వాహన వినియోగదారులకు నావిగేషన్ సౌలభ్యం కోసం అవసరమైన కనెక్టివిటీ ఫీచర్‌లతో వస్తుంది. 

ఎలక్ట్రిక్ మోటార్‌బైక్ కి 7.0-అంగుళాల ఆండ్రాయిడ్ డిస్‌ప్లే, గూగుల్ మ్యాప్స్ నావిగేషన్, 18 లీటర్ల స్టోరేజ్ స్పేస్, OTA అప్‌డేట్‌లు, బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తుంది. ఇంకా LED లైటింగ్ సిస్టమ్, రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్‌ కూడా ఉంది. 

కలర్ ఆప్షన్స్ 
ఈ ఎలక్ట్రిక్ మోటార్‌బైక్ ఐదు కలర్ ఆప్షన్స్ లో వస్తుంది. ఇందులో మిడ్‌నైట్ బ్లూ, ఫెయిరీ రెడ్, గ్లోసీ బ్లాక్, వెనమ్ గ్రీన్ ఇంకా మిస్టీ గ్రే వంటి కలర్స్ ఉన్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios