ఇప్పుడు బయటకి వెళ్లాలన్నా ఈ కంపెనీ ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్ సర్వీస్‌ తీసుకురానుంది.. ఏంటంటే ?

ఇప్పుడు కంపెనీ ఈ నెలాఖరులోగా బెంగళూరులోని విమానాశ్రయానికి దాదాపు రూ. 3,500కే హెలికాప్టర్ ట్యాక్సీలను అందించడం ద్వారా సేవలను విస్తరిస్తోంది. 

Now whether to go inside or outside the city this company is going to bring electric aircraft service to India

మెట్రో నగరాలలో పెరుగుతున్న రద్దీ, పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య నుండి బయటపడటం బహుశా ఇప్పుడు సాధ్యమే. అయితే దీని కోసం మీరు కాస్త  ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రముఖ నగరాల్లో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ఎయిర్ టాక్సీ సర్వీస్ అందుబాటులోకి రానుంది. హంచ్ వెంచర్స్ అండ్ US-ఆధారిత సంస్థ బ్లేడ్ మధ్య జాయింట్ వెంచర్ న్యూ ఢిల్లీకి చెందిన ఫ్లైబ్లేడ్  హెలికాప్టర్లు ఇంకా ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ (eVTOL, eVTOL)తో సెగ్మెంట్‌లోకి ప్రవేశించాలని భావిస్తుంది. 

FlyBlade ఇప్పటికే ఇండియాలో అత్యంత రద్దీగా ఉండే కొన్ని మార్గాల కోసం తక్కువ ఖర్చుతో కూడిన విమాన రవాణా ఆప్షన్  అందిస్తుంది. కంపెనీ ముంబై, షిర్డీ, పూణే, బెంగళూరు నుండి హెలికాప్టర్ విమాన సేవలను అందిస్తుంది. ఇప్పుడు కంపెనీ ఈ నెలాఖరులోగా బెంగళూరులోని విమానాశ్రయానికి దాదాపు రూ. 3,500కే హెలికాప్టర్ ట్యాక్సీలను అందించడం ద్వారా సేవలను విస్తరిస్తోంది. రాబోయే కొన్ని సంవత్సరాల్లో మరిన్ని మార్గాలలో  200 VTOL విమానాలను జోడించే ప్రణాళికలను సంస్థ ఇటీవల ప్రకటించింది. 

మీడియా నివేదికల ప్రకారం, ముంబై-పూణె అండ్ ముంబై-షిర్డీ రూట్లతో సహా మధ్య ఇప్పటివరకు 1,000 ప్యాసెంజర్ బుకింగ్‌లను నిర్వహించిందని ఫ్లైబ్లేడ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ దత్తా తెలిపారు. ఎయిర్‌పోర్ట్ యాక్సెస్, టూరిజం అండ్ మెడికల్ సర్వీసెస్‌తో సహా మూడు ప్రముఖ అంశాలను మేము లక్ష్యంగా చేసుకున్నాము, మా విస్తరణలో భాగంగా మేము మరిన్ని ఇంటర్‌సిటీ షార్ట్ ఫ్లైట్‌లను రవాణా సేవగా అందించాలని చూస్తున్నాము అలాగే కొన్ని నెలల్లో మహారాష్ట్ర, కర్ణాటకలో టేకాఫ్ అండ్ ల్యాండింగ్ స్పాట్‌ల (హెలిప్యాడ్‌లు) కొత్త నెట్‌వర్క్ అభివృద్ధి చేయడానికి ప్లాన్ చేస్తున్నాము"  అని అన్నారు.

ముంబై-పూణే మార్గంలో ప్రయాణించడానికి సాధారణంగా ప్రయాణీకులకి సగటున 4-5 గంటలు పడుతుంది. ఇప్పుడు ఫ్లైబ్లేడ్ హెలికాప్టర్ టాక్సీలతో ఈ ప్రయాణాన్ని దాదాపు 50 నిమిషాల్లో పూర్తి చేయవచ్చు. దీని కోసం ఒక వైపు ప్రయాణానికి ప్రస్తుతం సుమారు రూ. 15,000 ఖర్చవుతుంది. అయితే ఫ్లైబ్లేడ్‌ను eVTO ఎయిర్‌క్రాఫ్ట్‌కు మార్చిన తర్వాత వన్-వే ధరను గణనీయంగా తగ్గించవచ్చని అమిత్ దత్తా విశ్వసిస్తున్నారు. ప్రస్తుతం పెట్రోల్ ఆధారిత హెలికాప్టర్ ట్యాక్సీలకు కిలోమీటరుకు దాదాపు రూ.60 ధర పలుకుతోంది. అయితే ఎలక్ట్రిక్ VTOL ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఉపయోగించడం ద్వారా కిలోమీటరుకు దాదాపు రూ.15-20కి తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. 

అయిత కొన్ని ప్రారంభ దశ సమస్యలు ఉన్నాయి. VTOL ఎయిర్‌క్రాఫ్ట్‌లను వర్షాకాలంలో జూన్ మధ్య నుండి సెప్టెంబర్ మధ్య వరకు నడపలేరు. అలాగే హెలికాప్టర్ల సప్లయ్ లేకపోవడం మరో సవాలు. భారతదేశంలో కేవలం 200 హెలికాప్టర్లు NSOP (నాన్ షెడ్యూల్డ్ ఆపరేటర్ పర్మిట్) ద్వారా నిర్వహించబడుతున్నాయని, వాటిలో సగం ఆయిల్ అండ్ మైనింగ్ సంస్థలకు చెందినవని దత్తా చెప్పారు.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios