ఇప్పుడు స్కూటర్‌లో కూడా ఎయిర్‌బ్యాగ్.. ఈ కంపెనీ వచ్చే ఏడాది తీసుకువచ్చేల సన్నాహాలు..
మీడియా నివేదికల ప్రకారం, జపాన్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా స్కూటర్లలో ఎయిర్‌బ్యాగ్‌లను తీసుకురావచ్చు. రిపోర్టుల ప్రకారం, కంపెనీ తాజాగా దీనికి సంబంధించి దరఖాస్తు కూడా చేసింది.
ప్రతి ఏడాది లక్షల మంది రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. వీరిలో పెద్ద సంఖ్యలో మరణిస్తున్నారు కూడా. ప్రమాదాలపై ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరిస్తూ ఎప్పటిక్కపుడు అభివృద్ధిని కొనసాగిస్తోంది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని స్కూటర్‌లో ఎయిర్‌బ్యాగ్‌ల వంటి సెక్యూరిటి ఫీచర్లను తీసుకురావడానికి ఒక ద్విచక్ర వాహన తయారీ సంస్థ కృషి చేస్తోంది.
ఎయిర్‌బ్యాగ్‌తో స్కూటర్ ఏ కంపెనీ తీసుకువస్తుంది?
మీడియా నివేదికల ప్రకారం, జపాన్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా స్కూటర్లలో ఎయిర్‌బ్యాగ్‌లను తీసుకురావచ్చు. రిపోర్టుల ప్రకారం, కంపెనీ తాజాగా దీనికి సంబంధించి దరఖాస్తు కూడా చేసింది.
స్కూటర్‌లో ఎయిర్‌బ్యాగ్
మీడియా నివేదికల ప్రకారం, ఎయిర్‌బ్యాగ్‌ను స్కూటర్ మధ్యలో అమర్చవచ్చు. హ్యాండిల్ మధ్యలో ఉండటం వల్ల ఎయిర్‌బ్యాగ్ ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్‌ను సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది కార్లలో ఉండే ఎయిర్‌బ్యాగ్‌ల లాగానే పని చేస్తుంది కానీ కార్లలోని సిస్టమ్‌కు భిన్నంగా ఉంటుంది.
లాంచ్ ఎప్పుడు ?
మీడియా నివేదికల ప్రకారం, 2009 సంవత్సరంలో హోండా థాయ్‌లాండ్ అండ్ జపాన్‌లలో ఈ స్కూటర్‌ను పరిచయం చేసింది. PCX అనే ఈ స్కూటర్‌లో ఎయిర్‌బ్యాగ్ ఆప్షన్ ఇచ్చారు. ఇప్పుడు కంపెనీ మరోసారి ఎయిర్‌బ్యాగ్‌లతో కూడిన కొత్త స్కూటర్‌ను అందించవచ్చు.
బైక్‌లో కూడా ఎయిర్‌బ్యాగ్
కొన్ని దేశాలలో బైక్‌లలో ఎయిర్‌బ్యాగ్‌లను కూడా పరీక్షించినట్లు కొన్ని నివేదికలలో సమాచారం. స్కూటర్‌తో పాటు, బైక్‌లో కూడా ఎయిర్‌బ్యాగ్‌ను ఆశించవచ్చు.
ధరలలో తేడా
వాహన తయారీ సంస్థ వాహనంలో ఇన్‌స్టాల్ చేసే ఏదైనా కొత్త సిస్టం ధరలలో తేడాను కలిగిస్తుంది. తాజాగా కారులో కనీసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే ధరల్లో మాత్రం తేడా వస్తుందని వాహన తయారీదారులు చెబుతున్నారు. అదేవిధంగా స్కూటర్లలో ఎయిర్‌బ్యాగ్‌లను అమర్చినట్లయితే ఖచ్చితంగా ద్విచక్ర వాహనాల ధరలు పెరుగుతాయి, అయితే ఇది భద్రతను కూడా అందిస్తుంది.