Asianet News TeluguAsianet News Telugu

క్యాష్ కాదు, ఓపిక అవసరం.. ఈ కార్ బుక్ చేసుకున్నాక ఇంటికి చేరాలంటే రెండేళ్లు ఆగాల్సిందే!

ఇన్నోవా హైక్రాస్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. దీంతో ఈ వాహనం బుక్ చేసుకుని ఇంటికి తీసుకురావాలంటే చాలా కాలం పాటు  నిరీక్షించాల్సి వస్తోంది. 
 

not Cash, patience is required.. will have to wait for  two years to get this  car  to  home!-sak
Author
First Published Jun 16, 2023, 5:56 PM IST

జపానీస్ మల్టీనేషనల్ ఆటోమోటివ్ కంపెనీ టయోటా ఇన్నోవా హిక్రాస్ ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న హైబ్రిడ్ కారు . డిసెంబర్ 2022లో ప్రారంభించినప్పటి నుండి ఈ మూడు వరుసల సీట్ల MPVకి అధిక డిమాండ్ ఉంది. వచ్చిన కొద్ది నెలల్లోనే, ఇన్నోవా హైక్రాస్ మార్చి 2023లో 5,700 యూనిట్ల అత్యధిక ప్రతినెల  సేల్స్  నమోదు చేసింది.

ప్రస్తుతం ఇన్నోవా హైక్రాస్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. దీంతో వాహనం బుక్ చేసుకుని ఇంటికి తీసుకురావాలంటే చాలా కాలం పాటు నిరీక్షించాల్సి వస్తోంది. ఈ MPV  పవర్ ఫుల్ హైబ్రిడ్ వేరియంట్‌ కోసం 100 వారాల వరకు వేచి ఉండవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి (అంటే దాదాపు ఒక సంవత్సరం మీద తొమ్మిది నెలలు). అదే సమయంలో పెట్రోల్ వెర్షన్ కోసం వెయిటింగ్ పీరియడ్ 30 వారాల వరకు ఉండొచ్చని సూచిస్తున్నాయి. 

ఇన్నోవా Hycross MPV మోడల్ లైనప్ లో ప్రస్తుతం G, GX, VX, ZX అండ్ ZXX (O) ట్రిమ్‌లలో అందుబాటులో ఉన్నాయి. వీటి ఎక్స్-షోరూమ్ ధరలు రూ.18.55 లక్షల నుండి రూ.29.99 లక్షల వరకు ఉన్నాయి. టయోటా   TNGA-C ప్లాట్‌ఫారమ్ ఆధారంగా ఈ మోడల్ 2.0L, 4-సిలిండర్ అట్కిన్సన్ సైకిల్ అండ్  2.0L పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. శక్తివంతమైన హైబ్రిడ్ సెటప్, E-డ్రైవ్ ట్రాన్స్‌మిషన్, గరిష్టంగా 184 bhp శక్తిని అందిస్తుంది. మరోవైపు పెట్రోల్ మోటార్ 172 bhp ఇంకా  205 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. రెండు పవర్‌ట్రెయిన్‌లు ఫ్రంట్-వీల్ డ్రైవ్ (FWD) సిస్టమ్‌తో అందుబాటులో ఉన్నాయి.

ఇదిలా ఉంటే, మారుతి సుజుకి త్వరలో రీ-బ్యాడ్జ్ వెర్షన్‌ను విడుదల చేయనుంది. ఈ వాహనం పేరు మారుతి ఇన్విక్టో. కొత్త మారుతి ఇన్విక్టో ప్రీమియమ్ ఎమ్‌పివి టయోటా బిడాడీ ప్లాంట్‌లో తయారు చేయబడుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios