ఉద్యోగుల్లో తొలగింపు పై తేల్చి చెప్పిన టాటా మోటార్స్

ఆర్థిక మందగమనం నెలకొన్నా ఉద్యోగుల తొలగింపు ఊసే లేదని టాటా మోటార్స్ సీఈఓ కం మేనేజింగ్ డైరెక్టర్ గ్యుంటర్ బ్యుచెక్ స్పష్టం చేశారు. నూతన సంవత్సరంలో సరికొత్త మోడల్ కార్లను ఆవిష్కరించడంతో పరిస్థితుల్లో మార్పు వస్తుందన్నారు.
 

No plan to reduce headcount due to slowdown: Tata Motors

న్యూఢిల్లీ: ఆటోమొబైల్‌ రంగంలో మందగమనం నెలకొన్నా తమ సంస్థలో ఉద్యోగులను తొలగించాలనుకోవడం లేదని దేశీయ వాహన సంస్థ టాటా మోటర్స్‌ స్పష్టంచేసింది. నూతన వాహనాలను దేశీయ మార్కెట్లోకి విడుదల చేయనుండటంతో భవిష్యత్ అంతా సానుకూలంగా ఉంటుందని కంపెనీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

టాటా మోటార్స్ వెబ్‌సైట్‌ ప్రకారం కమర్షియల్‌, ప్యాసింజర్‌ వాహనా విభాగంలో 80 వేల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. సిబ్బంది తొలిగించే ప్రతిపాదనేది తమ వద్ద లేదని టాటా మోటర్స్‌ సీఈవో, ఎండీ గ్యుంటర్‌ బుచెక్‌ తెలిపారు. దీర్ఘకాలికంగా ఆటోమొబైల్‌ రంగం మందకొడి పరిస్థితులతో అల్లాడుతున్నా పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఏడాదిక్రితమే పలువురు ఉద్యోగులను తొలగించినట్లు, మరో దఫా తొలగించే అవకాశాలు లేవని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. 

also read బెంజ్, వోల్వో , ఆడి కార్లకు పోటీగా జాగ్వార్ కొత్త మోడల్‌ కారు

గత 12 నెలలుగా ఆటోమొబైల్‌ రంగం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నదని, ఇది భవిష్యత్తులోనూ కొనసాగే అవకాశాలున్నాయని గ్యుంటర్ బెచెక్ అన్నారు. టాటా నుంచి త్వరలో ఆలో్ట్రజ్‌, నెక్సాన్‌ ఈవీ, గ్రావిటాస్‌ ఎస్‌యూవీ వాహనాలు రానున్నాయి. దీంతో పాటు బీఎస్‌-6 నిబంధనలకు అనుగుణంగా ఉత్పత్తి మారాల్సిన అవసరం కూడా ఉందని టాటా మోటార్స్ గుర్తు చేసింది.

తమకు వెన్నెముక వంటి వాణిజ్య వాహనాల విభాగాన్ని పటిష్ఠపరిచామని, మందగమన దశను ఇబ్బందుల్లేకుండా దాటగలమని ధీమా వ్యక్తం చేసింది. ఇక జూలై-సెప్టెంబరు త్రైమాసికంలో గత ఏడాదితో పోలిస్తే.. ఏకంగా 44 శాతం అమ్మకాల్ని టాటా మోటార్స్ కోల్పోయింది. గత ఏడాది రూ.109.14 కోట్ల లాభాన్ని ఆర్జించగా.. ఈ ఏడాది రూ.1281 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది.

also read  వోల్వో నుంచి ఎంట్రీ లెవెల్ ఎస్‌యూ‌వి ‘ఎక్స్‌సీ40 టీ4’

ప్రస్తుత పరిస్థితి నుంచి బయటపడేందుకు, రెవెన్యూ విషయంలో కంపెనీకి వెన్నుముకగా నిలుస్తున్న కమర్షియల్ వెహికిల్ స్పేస్‌‌‌‌లో అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు గ్యుంటక్ బ్యుచెక్ తెలిపారు. మంచి ప్రొడక్ట్‌‌‌‌లను తాము ఆఫర్ చేస్తున్నామని, తమ డీలర్ నెట్‌‌‌‌వర్క్ బాగుందని చెప్పారు. 

కాస్ట్ అప్టిమైజేషన్, క్వాలిటీ కంట్రోల్ చర్యలు వంటి అన్ని రకాల మెకానిజాలను కంపెనీ ఫాలో అవుతుందని టాటా మోటర్స్‌ సీఈవో, ఎండీ గ్యుంటర్‌ బుచెక్‌ తెలిపారు. వర్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ రేషనలైజేషన్ ప్రస్తుతం అవసరం లేదన్నారు. 30 ఏళ్ల తన కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఆటోమొబైల్‌‌‌‌ ఇండస్ట్రీలో ఇలాంటి సంక్షోభం మునుపెన్నడూ చూడలేదని గుంటెర్ చెప్పుకొచ్చారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios