వోల్వో నుంచి ఎంట్రీ లెవెల్ ఎస్‌యూవి ‘ఎక్స్‌సీ40 టీ4’
స్వీడన్ విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ ‘వోల్వో’ విపణిలోకి ఎక్స్ సీ 40 టీ 4 ఆర్ డిజైన్ కార్లను విడుదల చేసింది. బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగానూ ఈ కారు అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ.39.9 లక్షలుగా నిర్ణయించారు.
న్యూఢిల్లీ: స్వీడన్ లగ్జరీ కార్ల కంపెనీ వోల్వో కార్స్ తాజాగా ‘ఎక్స్‌సీ40 టీ4 ఆర్’ డిజైన్ పేరుతో శుక్రవారం ఎస్‌యూవీ మోడల్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.39.9 లక్షలుగా నిర్ణయించింది.. ఈ మోడల్ బీఎస్-6లో కూడా లభిస్తుందని కంపెనీ తెలిపింది. ఇందులో 2.0 లీటర్ ఇంజన్ ఉంది.
also read కారు కొనాలనే వారికి ఇదే కరెక్ట్ టైం...బ్రాండెడ్ కార్లపై భారీగా డిస్కౌంట్లు, ఆఫర్లు
టూ జోన్ క్లైమేట్ కంట్రోల్, స్మార్ట్‌ఫోన్లకు వైర్‌లెస్ చార్జింగ్, పవర్ టెయిల్ గేట్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేలతో కూడిన 12.3 అంగుళాల క్లస్టర్, ముందు వెనుకలకు పార్కింగ్ అసిస్ట్ వంటి అధునాతన ఫీచర్లను ఈ ఎస్‌యూవీలో సమకూర్చినట్టు వోల్వో తెలిపింది. ఈ కారును కంపాక్ట్ మాడ్యులర్ ఆర్కిటెక్చర్ (సీఎంఎ) ఆధారంగా అభివ్రుద్ధి చేసినట్లు పేర్కొంది.
ఈ సందర్భంగా వోల్వో కార్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ చార్లెస్ ఫ్రంప్ మాట్లాడుతూ ఎంట్రీ లెవెల్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో తొలి పెట్రోల్ వర్షన్ కారును ఆవిష్కరించామని చెప్పారు. ఈ వేరియంట్ కార్లలో ఆర్-డిజైన్ ఆకర్షణీయమైన ధరతో అందరి ద్రుష్టిలో పొందిందన్నారు. వినియోగదారుల ఆకాంక్షల పట్ల తాము కాన్షియస్‌గా ఉన్నామని చార్లెస్ ఫ్రంప్ చెప్పారు.
ఇంతకుముందు డీజిల్ వర్షన్‌లో ఇదే మోడల్ కారును ఆవిష్కరించింది వోల్వో. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్, డీజిల్ పవర్డ్ కౌంటర్ పార్ట్, ఎక్స్సీ 40 పెట్రోల్ వర్షన్ స్పోర్ట్స్ కారు పనోరమిక్ సన్ రూఫ్, వైర్ లెస్ చార్జింగ్ ఫర్ స్మార్ట్ ఫోన్లు ఉంటాయని తెలిపింది. డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. 14-స్పీకర్ హార్మోన్ కార్డన్ సౌండ్ సిస్టమ్, డ్యుయల్ క్లైమేట్ కంట్రోల్ తదితర ఫీచర్లు ఉన్నాయి.
also read 2.74 సెకన్లలో 100 కి.మీ స్పీడ్: సరికొత్త స్పోర్ట్స్ బైక్ స్పెషాలిటీ
భారతదేశ మార్కెట్లో వోల్వో ఎక్సీ 40 పెట్రోల్ వేరియంట్ కార్లు.. బీఎండబ్ల్యూ ఎక్స్1, మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఏ, ఆడి క్యూ 3, మినీ కంట్రీ మెన్ (కూపర్ ఎస్) మోడల్ కార్లకు గట్టి పోటీ ఇవ్వనున్నాయి. ఎక్స్సీ 40 రీచార్జీ ఎలక్ట్రిక్ వెహికల్ నూ కూడా వోల్వో రూపొందిస్తున్నట్లు ఇంతకుముందు వార్తలొచ్చాయి.