Asianet News TeluguAsianet News Telugu

New Safety Rules:మీరు బైక్ నడుపుతున్నారా.. అయితే ఈ కొత్త నిబంధనలు తెలుసుకోండి, లేదంటే జరిమానా తప్పదు..

చాలా మంది వాహనదారులకు రోడ్డు భద్రత నిబంధనల గురించి పూర్తిగా తెలియదు, దీంతో  ఆలోచించకుండా చట్టాలను ఉల్లంఘిస్తుంటారు. మీరు  డ్రైవింగ్ చేస్తున్నపుడు  రోడ్డు  నిబంధనలు పాటించకపోవడం వల్ల కలిగే పరిణామాలతో పాటు మీరు తప్పనిసరిగా తెలుసుకోవలసిన కొన్ని ప్రాథమిక నియమాలు  ఉన్నాయి.

New Safety Rules: If your driving two wheeler then know these new rules here
Author
Hyderabad, First Published Feb 17, 2022, 1:42 PM IST

ఎక్కడికైనా బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు మనం  బైక్ ని ఎక్కువగా వినియోగిస్తాం. కానీ ఒకే ఒక్క తేడా ఏమిటంటే కొందరు పబ్లిక్ వాహనంలో, మరికొందరు  సొంత వాహణాలలో ప్రయాణిస్తారు. సొంత వాహణాలలో ప్రజలు ఎక్కువగా బైక్ లేదా కార్ ని ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఈ వాహనాలు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి ఇంకా మిమ్మల్ని తక్కువ సమయంలో  ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ గమ్యస్థానానికి చేరుస్తాయి.

కార్లు పక్కన పెడితే ద్విచక్ర వాహనాలను అధిక సంఖ్యలో ప్రజలు వినియోస్తారు. అయితే ఇందులో చాలా ప్రమాదం కూడా ఉంది. కారులో సేఫ్టీ ఉన్నపటికి బైక్ పై  అజాగ్రత్తగా ప్రయాణించడం సురక్షితంగా పరిగణించబడదు. అయితే ఇప్పుడు రోడ్డు రవాణా అండ్ రహదారుల మంత్రిత్వ శాఖ ద్విచక్ర వాహనాల కోసం కొత్త నిబంధనలను అమలు చేసింది. కాబట్టి ఈ కొత్త నిబంధనలు ఏమిటి, ఎవరి కోసం అమలు చేయబడ్డాయి, వాటిని పాటించనందుకు ఎంత జరిమానా విధించవచ్చో  తెలుసుకోండి...

కొత్త నిబంధన ఏం చెబుతోంది?
రోడ్డుపై ద్విచక్ర వాహనాలు నడిపే వారి కోసం రోడ్డు రవాణా అండ్ రహదారుల మంత్రిత్వ శాఖ భద్రతా నియమాలను అమలు చేసింది. ఇందులో చిన్నారులకు హెల్మెట్ నుండి స్పీడ్ లిమిట్స్ వంటి వాటిని పొందుపరిచారు. డ్రైవర్లు ఇంకా వెనుక కూర్చున్న వారికి భద్రత కల్పించడానికి  ఈ చర్య తీసుకుంది.  

పిల్లల కోసం హెల్మెట్
మీరు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తే మీతో పాటు  చిన్న పిల్లలని కూర్చున్నట్లయితే హెల్మెట్ తప్పనిసరి. నిజానికి నాలుగేళ్లలోపు పిల్లలకు హెల్మెట్‌ ధరించడం తప్పనిసరి కాదు. కానీ సైకిల్ హెల్మెట్ ధరించవచ్చు.

భద్రతా నిబంధనలు
రోడ్డు రవాణా అండ్ రహదారుల మంత్రిత్వ శాఖ అమలు చేసిన కొత్త నిబంధనల ప్రకారం  భద్రతా కోసం తేలికైన, వాటర్ రిసిస్టంట్ హెల్మెట్ ఉండాలి. అలాగే ప్రయాణ సమయంలో పిల్లలు తప్పనిసరి ధరించేలా  చూసుకోవాలి.

స్పీడ్ 
అయితే మీరు ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్నట్లయితే ఇంకా మీతో పాటు పిల్లలు కూర్చొని ఉంటే మీ వాహనం స్పీడ్ గంటకు 40 కిలోమీటర్లకు మించకూడదు. అలాగే పిల్లలు హెల్మెట్‌తో పాటు కార్లులో అయితే సీట్  బెల్ట్‌ను ధరించడం తప్పనిసరి చేశారు.

ఈ కొత్త రూల్స్ అనుసరించకపోతే ఏం జరుగుతుంది?
రోడ్డు రవాణా అండ్ రహదారుల మంత్రిత్వ శాఖ ద్విచక్ర వాహనాదారుల కోసం ఈ కొత్త నిబంధనలను అమలు చేసింది. అయితే ఎవరైనా ఈ నిబంధనలను పాటించకపోతే జరిమానా విధించే నిబంధన కూడా ఉంది. కొత్త ట్రాఫిక్ రూల్‌ను ఉల్లంఘిస్తే రూ. 1,000 జరిమానా, మూడు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయబడుతుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios