మహీంద్రా స్కార్పియో-ఎన్ డెలివరీలు ప్రారంభం.. 10 రోజుల్లో 7,000 యూనిట్లకు పైగా..
మహీంద్రా స్కార్పియో-ఎన్ జూన్ 27న లాంచ్ చేశారు. 'ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్' ప్రాతిపదికన రూ. 21వేల టోకెన్ మొత్తానికి ఎస్‌యూవి బుకింగ్‌లు జూలై 30న ప్రారంభమయ్యాయి.
ఇండియన్ మల్టీనేషనల్ కంపెనీ మహీంద్రా & మహీంద్రా స్కార్పియో-ఎన్ డెలివరీలతో ఫెస్టివల్ సీజన్ ప్రారంభించింది. మరోవైపు 10 రోజుల్లో 7,000 యూనిట్లకు పైగా ఎస్‌యూవిలని డెలివరీ చేయడానికి ప్లాన్ చేస్తోంది.
మహీంద్రా స్కార్పియో-ఎన్ జూన్ 27న లాంచ్ చేశారు. 'ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్' ప్రాతిపదికన రూ. 21వేల టోకెన్ మొత్తానికి ఎస్‌యూవి బుకింగ్‌లు జూలై 30న ప్రారంభమయ్యాయి. కంపెనీ ప్రకారం, స్కార్పియో-ఎన్ ప్రారంభమైన 30 నిమిషాల్లోనే 1 లక్ష బుకింగ్‌లను సంపాదించింది.
మహీంద్రా స్కార్పియో-ఎన్ ఐదు వేరియంట్‌లలో లభిస్తుంది. Z2, Z4, Z6, Z8 అండ్ Z8L. డిసెంబర్ నాటికి మహీంద్రా స్కార్పియో-N ఎస్‌యూవి Z8L వేరియంట్‌కు ప్రాధాన్యతనిస్తూ 20,000 యూనిట్ల కంటే ఎక్కువ డెలివరీలను లక్ష్యంగా పెట్టుకుంది.
ఇంజన్ల పరంగా స్కార్పియో-N TGDi mStallion పెట్రోల్ ఇంజన్ (200PS మ్యాక్స్ పవర్, 380Nm మ్యాక్స్ టార్క్), mHawk డీజిల్ ఇంజన్ (175PS మ్యాక్స్ పవర్, 400Nm మ్యాక్స్ టార్క్) పొందుతుంది. ఈ రెండు ఇంజన్లకు 6-స్పీడ్ MT అండ్ 6-స్పీడ్ AT గేర్ ఆప్షన్స్ ఇచ్చారు. Scorpio-N డీజిల్‌లో 4WD ఆప్షన్ కూడా ఉంది.
మహీంద్రా స్కార్పియో-ఎన్ ప్రారంభ ధర రూ. 11.99 లక్షల నుండి రూ. 23.90 లక్షల (ఎక్స్-షోరూమ్)కి ప్రవేశపెట్టారు. అయితే ఈ ధరలు ఫస్ట్ 25,000 బుకింగ్‌లకు మాత్రమే వర్తిస్తాయి.