ఇటలీలోని మిలన్‌లో జరిగిన EICMA 2019 మోటార్‌సైకిల్ ప్రదర్శనలో ఇటాలియన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ మోటో మోరిని అడ్వెంచర్ మోటార్‌సైకిల్ విభాగంలో అడుగుపెట్టింది. కొత్త మోటో మోరిని ఎక్స్-కేప్ 650 బైక్ వివరాలు

ఇది  650 సిసి, లిక్విడ్-కూల్డ్, పారలెల్-ట్విన్ ఇంజిన్‌, 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో పనిచేస్తుంది. ఎక్స్-కేప్ బైకు రెండు వేరియంట్లలో లభిస్తుంది - 'స్టాండర్డ్' మరియు 'లిమిటెడ్' ఇంజిన్‌తో. మోటో మోరిని సంస్థ ఈ రెండు  వేరియంట్ల ఫీచర్స్ ఇంకా  ప్రచురించలేదు. కానీ 'పరిమిత' ఎడిషన్ బైక్ 48 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుందని చెప్పారు.

also read పెరిగిన R E బుల్లెట్ 350 ధరలు.. ఎంతంటే..

మోటో మోరిని కొత్త మోడల్ బైక్ బరువును కూడా ప్రచురించలేదు. కానీ సీటు ఎత్తు 830 mm కలిగి ఉంది.ఎక్స్-కేప్ ముందు భాగంలో 19-అంగుళాల వైర్-స్పోక్ వీల్, 17-అంగుళాల బ్యాక్ టైర్, సస్పెన్షన్ పూర్తిగా అడ్జస్ట్ చేయగల, 50 mm  ఫోర్క్ ద్వారా 160 mm ముందు భాగంలో ఉంటుంది.

వెనుక వైపున 135 mm, సింగిల్ షాక్ ప్రీలోడ్ మరియు రీబౌండ్ డంపింగ్ అందిస్తుంది. స్టాండర్డ్ ABS తో, ముందు భాగంలో ట్విన్ 300 mm డిస్క్‌. వెనుక టైర్ లో 265 mm డిస్క్‌లు బ్రేకింగ్‌ ఉన్నాయి. ఎక్స్-కేప్ పెద్ద 7-అంగుళాల టిఎఫ్‌టి కలర్ డిస్‌ప్లేను, సులభంగా అడ్జస్ట్ చేయగల విండ్‌స్క్రీన్, క్రాష్ బార్‌లు కూడా పొందుతుంది.

also read జనవరి నుంచి జావా పెరక్‌ బాబర్ బుకింగ్స్.. ధరెంతంటే?

డిజైన్ వారీగా ఎక్స్-కేప్ మొదటి తరం హోండా CRF1000L ఆఫ్రికా ట్విన్‌ను కొంత వరకు పోలి ఉంటుంది. కలర్ కాంబినేషన్ నుండి అధిక ఇంధన ట్యాంక్ కెపాసిటీ వరకు అలాగే పిలియన్ పెర్చ్. అండర్‌బెల్లీపై ప్లాస్టిక్ స్కిడ్ ప్లేట్ మరియు ఎల్‌ఈడీ లాగా కనిపించే డ్యూయల్ హెడ్‌లైట్లు కూడా ఉన్నాయి.


మోటో మోరిని 1937 లో స్థాపించబడింది కానీ సంవత్సరాలుగా, ఇటాలియన్ బ్రాండ్ యాజమాన్యాన్ని చాలాసార్లు మార్చింది. 2018 లో, మోటో మోరిని చైనీస్ దిగ్గజం  ఝంగ్ నెంగ్ వెహికల్ గ్రూప్ కొనుగోలు చేసింది.  ఇప్పటికీ ఇటలీలో బైక్  ఉత్పత్తి ఇంకా రూపకల్పన జరుగుతుంది.