చైనాకు చెందిన  ఎస్‌ఏ‌ఐ‌సి (SAIC) చెందిన బ్రిటిష్ ఆటోమొబైల్ బ్రాండ్  మోరిస్ గ్యారేజెస్ (ఎంజి) భారత మార్కెట్లో నమ్మకంగా ఉందని, దేశంలో రూ.3వేల కోట్ల మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్నట్లు కంపెనీ అధికారి ఒకరు తెలిపారు.ఎంజీ మోటార్ ఇండియా ఇప్పటికే దేశంలో రూ.2,000 కోట్లు ఖర్చు చేసి గుజరాత్‌లోని హలోల్‌లోని తన ప్లాంట్‌లో తయారీ పనులను ప్రారంభించిందని ఓ అధికారి అన్నారు.

also read  ఆటో ఇండస్ట్రీ లేకుండా 5లక్షల కోట్ల...అసాధ్యం...

"మేము భారతదేశానికి కట్టుబడి ఉన్నాము,ఇండియాలో మా ప్రయాణాన్ని ఈ సంవత్సరం జూలై నెలలో ప్రారంభించాము. ఇండియాలో దీర్ఘకాలిక ప్రణాళిక ప్లాన్ కోసం ఆలోచిస్తున్నాము ఇందుకోసం మరో రూ.3,000 కోట్ల పెట్టుబడులను పెట్టాలి" అని ఎంజి మోటార్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ గౌరవ్ గుప్తా చెప్పారు.


కార్ల తయారీదారి ఎంజీ మోటార్ ఇప్పటివరకు  ఇంటర్నెట్ ఎస్‌యూవీ ఎంజి హెక్టర్‌ మోడల్ కారు దాదాపు 13,000 యూనిట్లను విక్రయించినట్లు ఆయన తెలిపారు. కంపెనీ ఎలక్ట్రిక్ ఇంటర్నెట్ స్పోర్ట్ యుటిలిటీ వాహనాన్ని విడుదల చేయనుందని, జూలై 2021 నాటికి మొత్తం నాలుగు మోడళ్లను ఎస్‌యూవీ విభాగంలో లాంచ్ చేయనుందని గుప్తా తెలిపారు.

also read బీఎస్-6 ఎఫెక్ట్: డీలర్ల ఆఫర్లపై ఇంట్రెస్ట్ చూపని హైదరాబాదీలు


కస్టమర్ల నుండి మంచి స్పందన రావడంతో కంపెనీ నవంబర్ నుండి ఉత్పత్తి స్థాయిలను పెంచాల్సి ఉందని, కార్ల తయారీ సంస్థ వేగంగా అభివృద్ధి చెందుతున్నందున, ప్రపంచ ధోరణికి అనుగుణంగా ఎస్‌యూవీ సెగ్మెంట్‌పై దృష్టి పెడుతుందని ఆయన అన్నారు. కస్టమర్ సేవా కేంద్రాలను విస్తరించడంపై కూడా సంస్థ దృష్టి సారించిందని, మార్చి 2020 నాటికి సుమారు 250 షోరూమ్-కమ్-వర్క్‌షాప్‌లు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.