Asianet News TeluguAsianet News Telugu

మార్పును ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధం అవండి: నేడే ఎంజి కోమెట్ ఎలెక్ట్రిక్ కార్ బుకింగ్స్ ఓపెన్..

కోమెట్ విద్యుత్ వాహనం బేస్ వేరియంట్  ప్రత్యేకమైన ప్రారంభ ధర రు.7.98 లక్షలు ఇంకా ప్లే అండ్  ప్లష్ వేరియంట్లు రు. 9.28 నుండి 9.98 లక్షలతో (ఎక్స్-షోరూమ్ ధర) మొదలుకొని లభిస్తాయి.  ఈ ఆఫర్ మొదటి 5,000 బుకింగుల వరకూ పరిమితమై ఉంటుంది.

MG Motor India today announced the commencement of bookings of the MG Comet EV-sak
Author
First Published May 15, 2023, 5:55 PM IST

మే 15, 2023:  బ్రిటిష్ ఆటోమొబైల్ బ్రాండ్ ఎంజి మోటర్ ఇండియా పట్టణ ప్రాంత మొబిలిటీ కోసం స్మార్ట్ ఇవి ఎంజి కోమెట్ ఎలెక్ట్రిక్ వాహనం బుకింగుల  ఓపెన్ గురించి నేడు ప్రకటించింది. కస్టమర్లు ఇప్పుడు ఎంజి మోటర్ ఇండియా వెబ్‌సైట్ https://www.mgmotor.co.in/ పైన ఆన్‌లైన్ ద్వారా కానీ లేదా ఎంజి డీలర్‌షిప్‌ల వద్ద రు. 11,000/- లు   చెల్లించి కోమెట్ ఎలెక్ట్ఱిక్ వాహనాన్ని బుక్ చేసుకోవచ్చు. దీనికి అదనంగా, డెలివరీ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండేలా చూసుకోవడానికి  ఎంజి, ‘MyMG’ యాప్ పైన పరిశ్రమలోనే ఫస్ట్ ‘ట్రాక్ అండ్ ట్రేస్’ ఫీచర్ (బుకింగ్ నుండి డెలివరీ వరకు పూర్తి  పారదర్శక అనుభవం) ని ప్రవేశపెడుతోంది. ఈ ఫీచర్ కస్టమర్లకు వారి ఫోన్ నుండే  కారు బుకింగు స్టేటస్  తెలుసుకోవడానికి వీలు కల్పిస్తుంది. 

ఎంజి కోమెట్ ఇవి బుకింగుల ప్రకటనపై  గౌరవ్ గుప్తా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్, ఎంజి మోటర్ ఇండియా మాట్లాడుతూ “భారతీయ పట్టణప్రాంత వినియోగదారుల  అవసరాలను తీర్చే ఉద్దేశ్యముతో ఎంజి కోమెట్ విద్యుత్ వాహనం అభివృద్ధి పర్చింది.  ఎంజి పరిశ్రమలో మొదటిసారి ‘ట్రాక్ అండ్ ట్రేస్’ ఫీచర్ తో  కార్ బుకింగ్ స్టేటస్  తెలుసుకోవడానికి మా కస్టమర్ల ఇబ్బందులకు ముగింపు పలకాలని మేము లక్ష్యంగా చేసుకున్నాము. కస్టమర్లు అతి త్వరలోనే స్వంత ఎంజి కోమెట్ ని అనుభూతి చెందగలుగుతారు." అని అన్నారు. 

కోమెట్ విద్యుత్ వాహనం బేస్ వేరియంట్  ప్రత్యేకమైన ప్రారంభ ధర రు.7.98 లక్షలు ఇంకా ప్లే అండ్  ప్లష్ వేరియంట్లు రు. 9.28 నుండి 9.98 లక్షలతో (ఎక్స్-షోరూమ్ ధర) మొదలుకొని లభిస్తాయి.  ఈ ఆఫర్ మొదటి 5,000 బుకింగుల వరకూ పరిమితమై ఉంటుంది. కంపెనీ మే నెల నుండి దశల వారీగా కోమెట్ వాహన డెలివరీలను మొదలుపెడుతుంది.

కోమెట్ విద్యుత్ వాహనం రిపేర్ అండ్  సర్వీస్ ఖర్చులను కవర్ చేస్తూ ఆలోచనాత్మకంగా రూపొందించబడిన ప్యాకేజీ ఒక ప్రత్యేకమైన ఎంజి ఇ-షీల్డుతో వస్తుంది. ఈ స్పెషల్ 3-3-3-8 ప్యాకేజ్ వీటిని అందజేస్తుంది: 
•    3 సంవత్సరాలు లేదా 1లక్ష కిలోమీటర్ల వారంటీ 
•    3 సంవత్సరాల రోడ్ సైడ్ అసిస్టెన్స్ (RSA)
•    3 ఉచిత లేబర్ సర్వీసులు- షెడ్యూల్ చేయబడిన మొదటి 3 సర్వీసులు
•    17.3 kWh Li-అయాన్ బ్యాటరీ IP67 రేటింగ్ అండ్ ప్రిస్మాటిక్ సెల్స్ తో 8 సంవత్సరాలు లేదా 1 లక్షా 20 వేల కిలోమీటర్ల వారెంటీతో వస్తుంది. 

కస్టమర్లు  నెక్స్ట్  ఎంజికి సులభంగా అప్‌గ్రేడ్ చేసుకోవడానికి వీలుగా ఒక అప్షనల్ బై-బ్యాక్ ప్రోగ్రామును ఎంజి అందజేస్తోంది. కస్టమర్లు ఈ ప్రత్యేకమైన ప్యాకేజీని కొనుగోలు చేసినప్పుడు 3 సంవత్సరాల  ఒరిజినల్ ఎక్స్-షోరూమ్ విలువ భరోసాతో కూడిన 60% బై-బ్యాక్ పొందుతారు. 

కోమెట్ విద్యుత్ వాహన వేరియంట్లు ప్రతి ఒక్కటీ సులభమైన ఎన్నో  సర్వీస్ ఆప్షన్లను అందిస్తాయి. ఇందులో My MG యాప్ ద్వారా DIY, కాల్ సర్వీస్ (రిమోట్ అసిస్టెన్స్), ఇంటివద్దనే సర్వీస్ ఇంకా కారును వర్క్‌షాపుకు తీసుకువెళ్ళాల్సిన అవసరం ఏర్పడిన సమయాలలో పికప్/డ్రాప్ సర్వీసు  చేర్చి ఉంటాయి.

Follow Us:
Download App:
  • android
  • ios