మెర్సిడెస్ బెంజ్ నుండి రెండు కొత్త లగ్జరీ కార్లు.. సెకన్లలో కళ్ళు చెదిరే స్పీడ్.. లుకింగ్ చూసారా..

మెర్సిడెస్ బెంజ్ జి‌ఎల్‌బి  అనేది 7-సీటర్ ఎస్‌యూ‌వి, అంటే మూడవ వరుసలో రెండు అదనపు సీట్లను అందిస్తుంది.ఈ కారు రెండు ఇంజన్ ఆప్షన్‌లతో మూడు వేరియంట్‌లలో లభిస్తుంది.

Mercedes Benz launches GLB and EQB electric SUVs in India know price and features

లగ్జరీ కార్ బ్రాండ్  మెర్సిడెస్ బెంజ్ జి‌ఎల్‌బి అండ్ ఆల్-ఎలక్ట్రిక్ ఈ‌క్యూ‌బి అనే రెండు కొత్త మోడళ్లను లాంచ్  చేస్తూ భారతీయ మార్కెట్లో 7-సీటర్ ఎస్‌యూ‌వి లైనప్‌ను విస్తరించింది. మెర్సిడెస్ జి‌ఎల్‌బి ఎస్‌యూ‌వి మూడు వేరియంట్లలో వస్తుంది, దీని ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ. 63.80 లక్షలు. అలాగే మెర్సిడెస్ ఎలక్ట్రిక్ కారు EQB 300 4మ్యాటిక్ ట్రిమ్‌లో మాత్రమే వస్తుంది, దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 74.50 లక్షలు.

మెర్సిడెస్ బెంజ్ జి‌ఎల్‌బి 
మెర్సిడెస్ బెంజ్ జి‌ఎల్‌బి  అనేది 7-సీటర్ ఎస్‌యూ‌వి, అంటే మూడవ వరుసలో రెండు అదనపు సీట్లను అందిస్తుంది. దీనిని "మినీ GLS"గా సూచిస్తారు. ఈ కారు రెండు ఇంజన్ ఆప్షన్‌లతో మూడు వేరియంట్‌లలో లభిస్తుంది.

జి‌ఎల్‌బి 220d వేరియంట్ 2.0-లీటర్, 4-సిలిండర్ డీజిల్ ఇంజన్‌తో 3,800 rpm వద్ద 188 bhp ఇంకా 1,600-2,600 rpm వద్ద 400 Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. జి‌ఎల్‌బి 200 1.3-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో 5,500 rpm వద్ద 161 bhp, 1,620-4,000 rpm వద్ద 250 Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

పెట్రోల్ ఇంజన్ 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది, అయితే డీజిల్ ఇంజన్ 8-స్పీడ్ డ్యూయల్-క్లచ్ యూనిట్, ఆప్షనల్ గా ఆల్-వీల్ డ్రైవ్‌ను పొందుతుంది. 

ఈ‌క్యూ‌బి 300 4మాటిక్ 
ఈ‌క్యూ‌బి కారు జి‌ఎల్‌బికి ఫుల్-ఎలక్ట్రిక్ వెర్షన్. దీనిలో కూడా ఒకే బాడీ షెల్ ఉపయోగించారు. 

ఈ‌క్యూ‌బి 300 4మ్యాటిక్ 225 BHP, 390 Nm గరిష్ట అవుట్‌పుట్‌తో డ్యూయల్-మోటార్ సెటప్‌ లభిస్తుంది. ఈ ఎస్‌యూ‌వి 8 సెకన్లలో 0 నుండి 100 kmph స్పీడ్ అందుకోగలదని ఇంకా దీని టాప్ స్పీడ్ గంటకు 160 km అని మెర్సిడెస్ పేర్కొంది.

ఈ‌క్యూ‌బి 66.5 kWh బ్యాటరీ ప్యాక్‌ పొందుతుంది, దీనిని ఒక్కసారి ఛార్జ్‌పై  388 నుండి 423km పరిధిని అందిస్తుంది. ఈ కారు 11 kW AC ఛార్జర్‌తో వస్తుంది. కానీ 100 kW DC ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి బ్యాటరీని 32 నిమిషాల్లో 10 నుండి 80 శాతం వరకు రీఛార్జ్ చేయవచ్చు. 

మెర్సిడెస్ బెంజ్ జి‌ఎల్‌బి అండ్ ఈ‌క్యూ‌బి ఎక్స్-షోరూమ్ ధరలు :
జి‌ఎల్‌బి 200 – రూ 63.80 లక్షలు
జి‌ఎల్‌బి 220d - రూ. 66.80 లక్షలు
జి‌ఎల్‌బి 220d 4Matic - రూ. 69.80 లక్షలు
ఈ‌క్యూ‌బి 300 4మ్యాటిక్ - రూ. 74.50 లక్షలు

వారంటీ
ఈ రెండు SUVలు 7-సీటర్లు ఇంకా మూడవ వరుస, రెండవ వరుస ఫోల్డబుల్ సీట్లతో ఉంటాయి. మూడవ వరుస సీట్లు పిల్లలు ఇంకా పెంపుడు జంతువులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. జి‌ఎల్‌బి ఎస్‌యూ‌వి 8 సంవత్సరాల వారంటీతో వస్తుంది. ఈ‌క్యూ‌బి ఎలక్ట్రిక్ SUV 8 సంవత్సరాల బ్యాటరీ వారంటీతో వస్తుంది.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios