Mercedes-Benz C-Class 2022: మెర్సిడెస్ కొత్త లగ్జరీ కారు.. మే 10న లాంచ్.. దీని టాప్ స్పీడ్ ఎంతో తెలుసా..

మెర్సిడెస్-బెంజ్ కొత్త లగ్జరీ సెడాన్ 2022 సి-క్లాస్ (2022 c-class)ని అధికారికంగా ఆవిష్కరించింది. 2022 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్‌ను మే 10న భారత మార్కెట్లో విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది.

Mercedes-Benz C-Class 2022: Mercedes introduces its new luxury sedan car, will be launched on May 10, know details

జెర్మన్ లగ్జరీ ఆటోమోటివ్ బ్రాండ్ మెర్సిడెస్-బెంజ్  కొత్త లగ్జరీ సెడాన్ 2022 సి-క్లాస్ (2022 సి-క్లాస్)ని అధికారికంగా ఆవిష్కరించింది. 2022 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్‌ను మే 10న భారత మార్కెట్లో విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. బేబీ ఎస్-క్లాస్ అని పిలవబడే, కొత్త సి-క్లాస్ పూణే సమీపంలోని  చకాన్ ప్లాంట్‌లో తయారు చేయనుంది. మెర్సిడెస్ ఇప్పటికే కొత్త సి-క్లాస్ బుకింగులను కూడా ప్రారంభించింది. లాంచ్ తర్వాత, Mercedes-Benz C-క్లాస్ మూడు వేరియంట్లలో అందుబాటులోకి వస్తుంది - C200, C220d అండ్ టాప్-ఎండ్ C300d. ఈ మోడల్ ఆన్‌లైన్‌లో అలాగే మెర్సిడెస్ 'రిటైల్ ఆఫ్ ది ఫ్యూచర్' ప్రోగ్రామ్ కింద అందుబాటులో ఉంటుంది. 

ఎక్కువ లగ్జరీ ఫీచర్లు
సి-క్లాస్ (c-class) ఇ-క్లాస్ (e-class) అండ్ టాప్-ఆఫ్-ది-లైన్ ఎస్-క్లాస్ (s-class)కి దగ్గరగా తీసుకురావడానికి మెరుగుపరచబడిన లగ్జరీ ఫీచర్లను పొందుతుంది. మెర్సిడెస్  కొత్తగా అప్ డెటెడ్ సెడాన్ మునుపెన్నడూ లేనంత ఎక్కువ మంది కొనుగోలుదారులను ఆకర్షిస్తుందని భావిస్తోంది. లాంచ్ తరువాత కొత్త C-క్లాస్ వోల్వో ఎస్60 (Volvo S60), బి‌ఎం‌డబల్యూ 3 సిరీస్ (BMW 3 series), ఆడి ఏ4 (Audi A4) వంటి కార్లతో పోటీపడుతుంది. 

స్పెసిఫికేషన్స్
5వ జనరేషన్ Mercedes-Benz C-క్లాస్ మూడు వేరియంట్లలో విడుదల చేయనుంది. ఇందులో టాప్-ఆఫ్-ది-లైన్ C300dకి అదనంగా C200, C220d ఉన్నాయి. లగ్జరీ సెడాన్ కొత్త 1.5-లీటర్ పెట్రోల్ అండ్ 2.0-లీటర్ డీజిల్ ఇంజన్‌లతో అందించనుంది. రెండు ఇంజన్లు మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీ, 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ స్టాండర్డ్ గా పొందుతాయి.

ఇంజన్ అండ్ స్పీడ్ 
కొత్త పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 201 bhp శక్తిని, 300 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ ఇంజన్ 197 bhp శక్తిని, 440 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. C300dలో 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ 261 bhp, 550 Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కొత్త సి-క్లాస్ 7.3 సెకన్లలో 0 నుండి 100 కి.మీ స్పీడ్ అందుకోగలదని మెర్సిడెస్ పేర్కొంది. అయితే టాప్-స్పెక్ C300d కేవలం 5.7 సెకన్లలో 0 నుండి 100 kmph స్పీడ్ అందుకోగలదు.

బుకింగ్ వివరాలు
కంపెనీ ఇప్పటికే కొత్త 2022 Mercedes Benz C-క్లాస్ కోసం బుకింగులు ప్రారంభించింది. మే 1 నుండి కొనుగోలుదారులందరికీ బుకింగ్‌లు తెరవబడతాయి. మెర్సిడెస్-బెంజ్ సి-క్లాస్ బుకింగ్ మొత్తాన్ని రూ.50,000గా ఉంచారు. 

సైజ్ పెరిగిన
కొత్త C-క్లాస్ ఎన్నో డిజైన్ అప్‌డేట్‌లను పొందుతుంది. వీటిలో ఇంటిగ్రేటెడ్ DRLలతో కూడిన స్లిక్ LED హెడ్‌లైట్లు, కొత్త గ్రిల్ అండ్ కొత్త స్ప్లిట్ LED టైల్‌లైట్ ఉన్నాయి. ఈ సెడాన్ 17-అంగుళాల లేదా 18-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను పొందుతుంది. కొత్త సి-క్లాస్ పాత మోడల్ కంటే పెద్ద సైజ్ లో ఉంటుందని మెర్సిడెస్ తెలిపింది. అంటే ఇప్పుడు 25 mm పొడవైన వీల్‌బేస్‌ను పొందుతుంది, ఇంకా ప్రయాణీకులకు మరింత స్థలాన్ని ఇస్తుంది. 

కలర్ ఆప్షన్ 
మెర్సిడెస్ C300dని మూడు ఎక్స్టీరియర్ పెయింట్ స్కీమ్‌లతో అందిస్తుంది, ఇందులో మ్యానుఫ్యాక్చర్ ఒపలైట్ వైట్, కావాన్‌సైట్ బ్లూ, అబ్సిడియన్ బ్లాక్ ఉన్నాయి. C-క్లాస్  కింద రెండు వేరియంట్‌లు సెలెస్టైన్ గ్రే, మోజావే సిల్వర్, హై-టెక్ సిల్వర్‌లో మరో మూడు కలర్ ఆప్షన్ద్స్ పొందుతాయి. 

 కొత్త సి-క్లాస్ ఇంటీరియర్‌లో కూడా చాలా అప్‌డేట్‌లు చేశారు. క్యాబిన్ మూడు కలర్ థీమ్ ఆప్షన్స్ పొందుతుంది, ఇందులో మకియాటో బీజ్, సియెన్నా బ్రౌన్, బ్లాక్‌తో వుడ్ ట్రిమ్ లేదా మెటల్ ట్రిమ్ ఉన్నాయి. డ్యాష్‌బోర్డ్ మధ్యలో సరికొత్త MBUX సిస్టమ్, 2.3-అంగుళాల ఫుల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో కూడిన 11.9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. S-క్లాస్ లాగానే ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌లో ఫింగర్‌ప్రింట్ స్కానర్‌తో పాటు యూజర్ల ప్రొఫైల్‌లను సేవ్ చేయడానికి బయోమెట్రిక్ స్కానర్‌ ఉంటుంది. ఇంకా రీడిజైన్ ఎయిర్ వెంట్స్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వెనుక ప్రయాణీకుల కోసం ఆర్మ్‌రెస్ట్‌లు, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లతో వస్తుంది. 

సెడాన్ పోర్ట్‌ఫోలియోలో ముఖ్యమైనది
మెర్సిడెస్-బెంజ్ సి-క్లాస్, ఎ-క్లాస్ లిమోసిన్ పైన ఉంచబడింది. కానీ కంపెనీ  సెడాన్ పోర్ట్‌ఫోలియోలో అత్యంత ప్రజాదరణ పొందిన E-క్లాస్ క్రింద వస్తుంది. తాజా కాలంలో జర్మన్లు ​​​​ సెడాన్లు, SUVలు రెండింటికీ ప్రజాదరణను నొక్కిచెప్పారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios