భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ గేర్ బైక్.. ఎలా స్టార్ట్ అవుతుందో తెలుసా..?
ఈ ఎలక్ట్రిక్ బైక్ ఇంటిగ్రేటెడ్, హై ఎనర్జి డెన్సిటీ, 5 kWh పవర్ ప్యాక్, మేటర్ ఎనర్జీ 1.0 పొందుతుంది. ఈ బైక్ భారతీయ వాతావరణం, వినియోగ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి చేసారు.
అహ్మదాబాద్‌కు చెందిన టెక్నాలజీ స్టార్టప్ మేటర్ ఇండియాలోనే మొట్టమొదటి గేర్ ఎలక్ట్రిక్ బైక్ ని పరిచయం చేసింది. ఈ ఎలక్ట్రిక్ బైక్ ని అహ్మదాబాద్‌లోని కంపెనీ ప్లాంట్ లో తయారు చేయనుంది అలాగే ఇండియాలోని ప్రముఖ నగరాల్లో అందుబాటులో ఉంటుంది. కంపెనీ నేడు సోమవారం బైక్‌ను ఆవిష్కరించింది అయితే ధర మాత్రం ప్రకటించలేదు. దీని బుకింగ్‌ను త్వరలో ప్రారంభించనున్నట్లు కంపెనీ తెలిపింది.
ఫౌండర్ అండ్ గ్రూప్ సిఈఓ మోహల్ లాల్భాయ్ మాట్లాడుతూ, “అరుణ్, ప్రసాద్, సరన్ అండ్ 300 మంది ఇన్నోవేటర్స్ ప్రయాణంలో ఇది ఒక పెద్ద మైలురాయి. ఈ బైక్ మనమందరం కలలుగన్న భవిష్యత్తు వైపు తీసుకెళ్తుందని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను" అని అన్నారు.
పవర్ ప్యాక్
ఈ ఎలక్ట్రిక్ బైక్ ఇంటిగ్రేటెడ్, హై ఎనర్జి డెన్సిటీ, 5 kWh పవర్ ప్యాక్, మేటర్ ఎనర్జీ 1.0 పొందుతుంది. ఈ బైక్ భారతీయ వాతావరణం, వినియోగ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి చేసారు. బైక్ లో ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెంట్ థర్మల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (IITMS)తో సహా చాలా పేటెంట్ టెక్నాలజిస్ ఉన్నాయి.
డ్రైవ్‌ట్రెయిన్
హై-క్వాలిటీ, స్ముత్ రైడ్ కోసం మ్యాటర్ డ్రైవ్ 1.0ని అభివృద్ధి చేసినట్లు బ్రాండ్ చెబుతోంది. ఎలక్ట్రిక్ బైక్ మేటర్ హైపర్‌షిఫ్ట్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో ప్రొపల్షన్ సిస్టమ్, రైడర్‌కు పవర్ డెలివరీపై ఫుల్ కంట్రోల్ ఇస్తుంది.
ఛార్జింగ్ సిస్టమ్
సాధారణ కనెక్టర్ ద్వారా బైక్ స్టాండర్డ్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ రెండింటినీ సపోర్ట్ చేస్తుంది. ఈ-బైక్‌లో స్టాండర్డ్ ఆన్-బోర్డ్ 1kW ఇంటెలిజెంట్ ఛార్జర్ వాహనాన్ని ఏదైనా 5A, 3-పిన్ ప్లగ్ పాయింట్ వద్ద ఛార్జ్ చేసే సౌలభ్యాన్ని అందిస్తుంది. ఆన్-బోర్డ్ ఛార్జర్ వాహనాన్ని 5 గంటలలోపు ఛార్జ్ చేయగలదు, ఓవర్ ఛార్జ్ ప్రొటెక్షన్ కూడా ఉంది.
ఎమోషన్‌ను ప్రేరేపించేలా ఈ బైక్ రూపొందించినట్లు మేటర్ చెబుతోంది. బైక్ తయారు చేయడంలో ఉన్న ఆలోచన మొత్తం విజువల్ అప్పీల్‌తో పాటు వర్చువల్ లో స్పష్టంగా కనిపిస్తుంది. బై-ఫంక్షనల్ LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, స్ప్లిట్ LED టెయిల్ ల్యాంప్‌లు, బాడీ-ఇంటిగ్రేటెడ్ ఫ్రంట్ టర్న్ సిగ్నల్స్, డిజైన్ లాంగ్వేజ్ సూచిస్తాయి. బిల్ట్ ఇన్ లైట్లు, స్మార్ట్ మొబైల్ ఛార్జింగ్ పోర్ట్‌తో 5-లీటర్ స్టోరేజ్ స్పేస్ వంటి సౌకర్యవంతమైన యుటిలిటీ ఎలిమెంట్స్‌తో ఈ బైక్ వస్తుంది.
ఈ బైక్ ఎల్లప్పుడూ రైడర్‌తో కనెక్ట్ అయ్యేలా రూపొందించబడింది. అడ్వన్సేడ్ ప్రాసెసర్, 4G కనెక్టివిటీ, ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ ద్వారా టచ్ ఎనేబుల్ చేయబడిన 7-అంగుళాల వెహికల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ (VIC) ఇంకా రైడర్‌కు అవసరమైన మొత్తం సమాచారాన్ని అందిస్తుంది. స్పీడ్, గేర్ పొజిషన్, రైడింగ్ మోడ్, నావిగేషన్, మీడియా, కాల్ కంట్రోల్, ఇతర స్మార్ట్ ఫీచర్లు ఏ బైక్ లో ఇంతకు ముందు చూసి ఉండరు. కనెక్ట్ చేయబడిన మొబైల్ అప్లికేషన్ రిమోట్ లాక్/అన్‌లాక్, జియోఫెన్సింగ్, లైవ్ లొకేషన్ ట్రాకింగ్, వెహికల్ హెల్త్ మానిటరింగ్, ఛార్జింగ్ స్టేటస్, పుష్ నావిగేషన్ ఇంకా మరిన్నింటిని అందిస్తుంది. నిజానికి ఈ బైక్ కీ లేకుండానే స్టార్ట్ అవుతుంది.