maruti wagonr facelift:12 కంటే ఎక్కువ సేఫ్టీ ఫీచర్లతో లేటెస్ట్ వ్యాగన్ఆర్.. లాంచ్‌కు ముందే ఫీచర్స్ లీక్..
మారుతీ సుజుకి ఇండియా అప్ డెటెడ్ వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్‌ను పరిచయం చేసేందుకు సిద్ధమైంది. ఈ మోడల్‌లు భారతీయ రోడ్లపై టెస్టింగ్ సమయంలో చాలా సార్లు కనిపించింది. ఇప్పుడు వాటి డిజైన్, ఫీచర్ వివరాలు వెల్లడయ్యాయి.
దేశంలోని అతిపెద్ద వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా (maruti suzuki india) (MSI) మార్చి 2022లో అప్ డెటెడ్ ఎర్టిగా ఎమ్‌పివి అండ్ వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్‌లను పరిచయం చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ రెండు మోడల్‌లు భారతీయ రోడ్లపై టెస్టింగ్ సమయంలో చాలా సార్లు కనిపించింది. ఇప్పుడు వాటి డిజైన్, ఫీచర్ వివరాలు వెల్లడయ్యాయి. లాంచ్ ముందు 2022 మారుతి వ్యాగన్ఆర్ ఫేస్‌లిఫ్ట్ (new 2022 maruti wagonr facelift) బ్రోచర్ స్కాన్ ఇంటర్నెట్‌లో లీక్ అయ్యింది.
లీక్ ప్రకారం, ఈ హ్యాచ్‌బ్యాక్ డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్‌లో వస్తుందని వీటిలో గ్యాలంట్ రెడ్ అండ్ ఓఆర్‌విఎంతో బ్లాక్ రూఫ్, మాగ్మా గ్రేతో ఓఆర్‌విఎం అండ్ బ్లాక్ రూఫ్ తెలుస్తుంది.
ఫీచర్లు
కొత్త వ్యాగన్ఆర్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, నావిగేషన్‌తో పాటు డ్యూయల్-టోన్ గ్రే మెలాంజ్ ఫ్యాబ్రిక్‌తో 7-అంగుళాల స్మార్ట్‌ప్లే స్టూడియో సిస్టమ్‌తో వస్తుంది. 4 స్పీకర్లతో కూడిన ప్రీమియం ఆడియో సిస్టమ్, ఆటో గేర్ షిఫ్ట్ టెక్నాలజీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వంటి ఫీచర్లు కూడా ఉంటాయి.
12 కంటే ఎక్కువ సేఫ్టీ ఫీచర్లు
మారుతి వ్యాగన్ఆర్ 2022 ఫేస్‌లిఫ్ట్ గతం కంటే ఎక్కువ సేఫ్టీ ఫీచర్లను పొందుతుంది. హిల్ హోల్డ్ అసిస్ట్ (స్టాండర్డ్), డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు (స్టాండర్డ్), బ్యాక్ పార్కింగ్ సెన్సార్లు, EBDతో కూడిన ABS, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, సెక్యూరిటీ అలారం, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, బజర్‌తో సీట్ బెల్ట్ రిమైండర్, సీట్ బెల్ట్ ప్రీ-టెన్షనర్ వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఫోర్స్ లిమిటర్, స్పీడ్ సెన్సిటివ్ ఆటో డోర్ లాక్ అండ్ చైల్డ్ ప్రూఫ్ రియర్ డోర్ లాక్‌తో సహా 12 కంటే ఎక్కువ భద్రతా ఫీచర్లు ఉంటాయి.
ఇంజిన్ అండ్ మైలేజ్
ఈ హ్యాచ్‌బ్యాక్ 1.0-లీటర్ K10C పెట్రోల్ అండ్ 1.2-లీటర్ K12N పెట్రోల్ (90bhp/113Nm) ఇంజన్‌తో అందించబడుతుంది. ఈ రెండు ఇంజన్లు 5-స్పీడ్ మాన్యువల్ అండ్ 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్‌తో వస్తుంది. Idle Start Stop టెక్నాలజీతో అందించబడిన కొత్త DualJet ఇంజన్ 25.19 kmpl మైలేజీని ఇస్తుంది. ఈ మోడల్ లైనప్ తదుపరి దశలో సిఎన్‌జి వెర్షన్‌తో కూడా లాంచ్ చేయనున్నారు.
మెరుగైన సేఫ్టీ, మరిన్ని ఫీచర్లు, ధర
కొత్త 2022 మారుతి వ్యాగన్ఆర్ ఫేస్‌లిఫ్ట్ ధర దాదాపు రూ. 10,000 నుండి రూ. 15,000 వరకు పెరగవచ్చు. ప్రస్తుతం, ఈ కారు ఎక్స్-షోరూమ్ ధరలలో రూ. 5.18 లక్షల నుండి రూ. 6.58 లక్షల వరకు ఉంది. ఈ హ్యాచ్‌బ్యాక్ కారు టాటా టియాగో (tata tiago), హ్యుందాయ్ శాంత్రో (hyundai santro)తో పోటీపడుతుంది.