మహీంద్రా టు మారుతి వయా టాటా మోటార్స్ అంతా డౌన్ ట్రెండే


పండుగల సీజన్ కావడంతో అక్టోబర్ నెలలో వాహనాల విక్రయాల్లో గణనీయ పురోగతి నమోదైంది. కానీ నెల తిరిగే సరికి నవంబర్‌లో యధారాజా తధాప్రజా అన్నట్లు మారుతి సేల్స్ రెండు శాతం క్షీణించాయి. మహీంద్రా, టాటా, హోండా కార్స్ సేల్స్ కూడా దిగజారాయి.

Car Sales November 2019: Maruti Suzuki Sales Decline By 3.2%

వాహన అమ్మకాలు మళ్లీ తిరోగమన బాటపట్టాయి. పండుగ సీజన్‌లో ఒకేఒక అక్టోబర్ నెలలో ఆశించిన స్థాయిలో నమోదైన విక్రయాలు ఆ తర్వాతీ నెలలో భారీగా పడిపోయాయి. కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 1.9 శాతం తగ్గి 1,50,630 యూనిట్లకు జారుకున్నాయి. క్రితం ఏడాది ఇదే నెలలో సంస్థ 1,53,539 వాహనాల విక్రయాలు జరిపింది. 

మారుతి సుజుకి వీటిలో దేశవ్యాప్తంగా 1,43,686 ల అమ్మకాలు జరుపగా, మిగతావి విదేశాలకు ఎగుమతి చేసింది. మినీ కార్ల విభాగానికి చెందిన ఆల్టో, వ్యాగన్ ఆర్ అమ్మకాలు 12.2 శాతం పడిపోయి 26,306లకు పరిమితమవగా, కాంప్యాక్ట్ సెగ్మెంట్‌కు చెందిన స్విఫ్ట్, సెలేరియో, ఇగ్నిస్, బాలెనో, డిజైర్ విక్రయాల్లో వృద్ధి 7.6 శాతంగా ఉండగా, మధ్యస్థాయి సెడాన్ సియాజ్ సేల్స్ 3,838ల యూనిట్ల నుంచి 1,448లకు పడిపోయాయి. యుటిలిటీ వాహన విక్రయాలకు బ్రేక్ పడింది. 

మరో సంస్థ మహీంద్రా సేల్స్ కూడా ఏడాది ప్రాతిపదికన 9 శాతం క్షీణించి 41,235లకు పడిపోయాయి. గతేడాది ఇదే నెల 45,101ల విక్రయాలు జరిపినట్లు సంస్థ తెలిపింది. వీటిలో దేశీయం గా 38,614లను విక్రయించిన సంస్థ.. 2,621 లను ఇతర దేశాలకు ఎగుమతి చేసింది.

పండుగ సీజన్ తర్వాత తొలి నెలలో ఆటోమొబైల్ రంగం ఎంతో నేర్చుకున్నదని, వినియోగదారుల డిమాండ్ అంతంత మాత్రమేనని, ముఖ్యంగా ప్యాసింజర్ వాహన విభాగం మందకొడిగా ఉన్నదని మహీంద్రా చీఫ్ సేల్స్, మార్కెటింగ్ విజయ్ రామ్ నక్రా తెలిపారు.

దేశవ్యాప్తంగా గత నెలలో 20,414 వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించిన మహీంద్రా అండ్ మహీంద్రా వీటిలో 618లను ఇతర దేశాలకు ఎగుమతి చేసింది. అలాగే 21,032 ల ట్రాక్టర్లను విక్రయించింది. కాగా, టాటా మోటర్స్ 41,124ల వాహనాలను మాత్రమే అమ్మింది. క్రితం ఏడాది ఇదే నెలలో విక్రయించిన 55,074లతో పోలిస్తే 25.32 శాతం పడిపోయాయి. 

నవంబర్ నెలలో హోండా కార్స్ అమ్మకాలు 50 శాతం తగ్గి 6,459లకు జారుకున్నాయి. అంచనావేసిన స్థాయి కంటే మెరుగైన స్థితిలోనే వాహనాలను విక్రయించినట్లు హెచ్‌సీఐఎల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజేశ్ గోయెల్ తెలిపారు. గత నెలలో 3,239 యూనిట్ల హెక్టార్ వాహనాన్ని విక్రయించినట్లు ఎంజీ మోటర్స్ ప్రకటించింది.

జర్మనీ కార్ల తయారీ సంస్థ వోక్స్ వ్యాగన్ నవంబర్ నెలలో 17 శాతం పురోగతిని నమోదు చేసింది. గతేడాది 2501 కార్లను విక్రయించిన వోక్స్ వ్యాగన్ ఈ ఏడాది నవంబర్ నెలలో 2937 కార్లు విక్రయించింది. పోలో, వెంటో మోడల్ కార్లకు డిమాండ్ ఏర్పడింది. 

హ్యుండాయ్ మోటార్ సేల్స్ స్వల్పంగా రెండు శాతం పెరిగాయి. 2018 నవంబర్ నెలలో విక్రయాలు 43,709 యూనిట్లుగా నమోదైతే, ఈ ఏడాది అది 44,600 యూనిట్లకు చేరుకున్నది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios