ముంబై: దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్‌ఐ) మరోసారి నిరాశాజనక ఫలితాలను ప్రకటించింది. వార్షిక ప్రాతిపదికన మారుతి లాభాలు 39శాతం పతనమయ్యాయి. గత ఎనిమిదేళ్లలో త్రైమాసిక లాభంలో ఇదే అతిపెద్ద పతనం. ఏకీకృత నికర లాభం 38.99 శాతం క్షీణించి రూ. 1,391 కోట్లకు చేరుకున్నది.

అంతకుముందు ఏడాది ఇదే కాలంలో రూ .2,280.2 కోట్లు. ఎనిమిదేళ్లలో త్రైమాసిక లాభంలో అతిపెద్ద క్షీణతను నమోదు చేసింది. ఆదాయంలో కూడా 25.19 శాతం పతనమైంది. రెండో త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం రూ .16,123 కోట్లు అంతకు ముందు ఏడాది రూ. 21,553.7 కోట్లుగా నిలిచింది. 

also read 2030కల్లా డ్రైవర్‌లెస్ ‘ఎమిరాయ్ ఎస్’ కార్లు

ఆటోమందగమనం నేపథ్యంలో లాభాలు మరింత క్షీణిస్తాయన్న ఎనలిస్టుల అంచనాలను మారుతి బీట్‌ చేసింది. చివరిసారిగా కంపెనీ నికర లాభంలో పెద్ద క్షీణత 2011-12 రెండవ త్రైమాసికంలో రూ. 241 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది, అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో రూ.549 కోట్లతో పోలిస్తే  56 శాతం  క్షీణించింది. 

ఈ త్రైమాసికంలో 3,38,317 వాహనాలను విక్రయించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 30.2 శాతం తగ్గింది. ఆర్థిక పనితీరుపై ఎంఎస్‌ఐ చైర్మన్ ఆర్‌సి భార్గవ మాట్లాడుతూ రెండవ త్రైమాసికం, ఆర్థిక మొదటి సగం ఫలితాలు గత సంవత్సరంతో పోలిస్తే గణనీయంగా తక్కువగా ఉన్నాయన్నారు. 

also read ఇండియాలోకి న్యూ జనరేషన్ ఆడి ఎ6: ధర 54.20 లక్షలు

అమ్మకాలు 22 శాతం పడిపోయాయని మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ అన్నారు. బీమా, రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుతో పాటు  కొత్త సెక్యూరిటీ విధానాలు ఉద్గార నిబంధనల కారణంగా వాహనాల వ్యయం పెరగడం వల్ల  ఆటో పరిశ్రమ తీవ్రంగా ప్రభావితమైందని ఆయన అన్నారు. అయితే భవిష్యత్తుపై చాలా నమ్మకంగా ఉన్నామని  పేర్కొన్నారు. రాబోయే రెండు నెలల్లో ఏమి జరుగుతుందన్న దానిపై రికవరీ ఆధారపడి ఉంటుందన్నారు.