న్యూఢిల్లీ: ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా సంచలన నిర్ణయం తీసుకున్నది. వచ్చే ఏడాది విపణిలోకి విద్యుత్ వాహనాన్ని విడుదల చేయబోవడం లేదని ప్రకటించింది. టెస్టింగ్ కోసం గానీ, వ్యక్తిగత అవసరాల కోసం దాని విడుదల చేయడం లేదు. దీనికి దేశంలోని విద్యుత్ వాహనాలకు అవసరమైన మౌలిక వసతుల కొరతేనని కారణంగా చెప్పింది. 

also read జాగ్వార్‌ విజన్ ఈవీ.. రెండు సెకన్లలో 100 కిమీ స్పీడ్

ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది మారుతి వేగన్ ఆర్ విద్యుత్ కారును ఆవిష్కరించేందుకు ప్రణాళికలను రూపొందించింది. మౌలిక వసతుల లేమి కారణంగా ప్రస్తుతానికి ట్రయల్స్, టెస్టింగ్ కోసం తప్ప విపణిలోకి విడుదల చేస్తామన్నారు. కానీ ప్రస్తుత దశలో పబ్లిక్ లోకి వాణిజ్య పరంగా మార్కెట్లోకి విడుదల చేయబోమని మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్ఐ) చైర్మన్ ఆర్సీ భార్గవ ఇటీవల మీడియాకు చెప్పారు. 

విద్యుత్ వాహనాలను వినియోగంలోకి తేవడానికి ప్రభుత్వ మద్దతు కొరవడిందని ఆర్సీ భార్గవ చెప్పారు. ఇప్పటికిప్పుడు లక్ష విద్యుత్ కార్లు రోడ్లపైకి వచ్చే అవకాశాలే లేవన్నారు. విద్యుత్ వాహనాలకు ప్రభుత్వ ప్రాధాన్యం ఉన్నా భారీ స్థాయిలో ప్రజలు వినియోగించడానికి వీలుగా మౌలిక వసతుల మద్దతు కూడా అదే స్థాయిలో అవసరరం అని ఆర్సీ భార్గవ చెప్పారు. ప్రభుత్వం 18 నెలలు.. రెండేళ్లుగా విద్యుత్ వాహనాలకు ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించింది. 

also read దీపావళి స్పెషల్: ‘ద్విచక్ర’ వాహనాల ఆఫర్ల వర్షం

ఈనాడు టూవీలర్ వాహనాలకు కేంద్రం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు అర్థమవుతున్నది. విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రతిపాదించిన ఫేమ్- 2 పథకంలో వ్యక్తిగత వాహన వినియోగదారుల ఊసే లేదన్నారు ఆర్సీ భార్గవ. ఎటువంటి మౌలిక వసతులు లేకుండా ఎవరైనా విద్యుత్ వాహనాలను కొనుగోలు చేసేందుకు వెళితే అధిక మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. విద్యుత్ వాహనాల అభివ్రుద్ధితోపాటు భారతదేశంలో బ్యాటరీ మాన్యుఫాక్చరింగ్‌ను ప్రారంభించాల్సి ఉంటుందని ఆర్సీ భార్గవ చెప్పారు.