జాగ్వార్ విజన్ ఈవీ.. రెండు సెకన్లలో 100 కిమీ స్పీడ్
రెండు సెకన్లలో 100 కి.మీ. వేగంతో దూసుకెళ్లే హైపర్ విద్యుత్ కారును రూపొందించింది జాగ్వార్ లాండ్ రోవర్. వచ్చే నెలలో విపణిలోకి విడుదల చేసేందుకు కారు యాజమాన్యం కసరత్తు చేస్తొంది.
టోక్యో: టాటా మోటార్స్ అనుబంధ లగ్జరీ కార్ల సంస్థ జాగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్ఆర్) దూకుడు మీద ఉంది. తొలిసారిగా విద్యుత్ కారును ప్రవేశపెట్టనుంది. టోక్యోలో జరిగిన గ్రాండ్ టురిస్మో వరల్డ్ టూర్ ఈవెంట్‌లో కాన్సెప్ట్ కారు.. జాగ్వార్ విజన్ గ్రాన్ టురిస్మో కూపేను ఆవిష్కరించింది. దీన్ని అత్యంత ఆధునిక విద్యుత్ వాహనం (ఈవీ)గా జాగ్వార్ అభివర్ణిస్తోంది.
తమ రేసింగ్ కార్ల ఆధారంగా విజన్‌ను రూపొందించామని, కేవలం రెండు సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగం అందుకోవడం విజన్ ప్రత్యేకత అని జాగ్వార్ పేర్కొంది. నవంబరు నెలాఖరు నుంచి దీన్ని కస్టమర్లకు అందుబాటులోకి తేనున్నట్లు జాగ్వార్ తెలిపింది.
ఎప్పుడు వచ్చినా లేటెస్ట్‌గా రావాలన్నది ప్రముఖుల అభిమతం. అలాగే జాగ్వార్ లాండ్ రోవర్ కార్ల తయారీ సంస్థ కూడా విద్యుత్ వాహనం విజన్ గ్రాన్ టురిస్మో ప్రాజెక్టు కోసం ఆరేళ్లుగా కలలు కంటున్నది. ఇది ట్రూలీ వైల్డ్ కాన్సెప్ట్ కారుగా నిలుస్తుందని భావిస్తున్నారు. ఈ బ్రిటిష్ ఆటో మేకర్ ఫార్ములా ఈ, ఐ-పేస్ మోడల్ కార్లతోనూ పోటీ పడేందుకు సిద్ధమవుతున్నది.
నూతన కారులో 750 కిలోవాట్ల సామర్థ్యం గల (1000 హార్స్ పవర్) విద్యుత్ అందుబాటులో ఉంటుంది. త్రీ మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌కు ధన్యవాదాలు తెలియజేయాల్సి ఉంది. అన్ని రకాల జాగ్వార్ మోడల్ కార్ల డిజైన్ స్ఫూర్తితో విజన్ గ్రాన్ టురిస్మో కారును రూపొందించింది. ఆస్టన్ మార్టిన్ మాదిరిగా ఈ కారు ఉంది.
విజన్ గ్రాన్ టురిస్మో కాన్సెప్ట్ 2013లో పురుడు పోసుకున్నది. 2014లో టయోటా ఎఫ్ టీ-1, ఆడి కారు గతేడాది విడుదల చేసిన ఈ-ట్రాన్ మోడల్ కారును జాగ్వార్ విజన్ గ్రాన్ టురిస్మో కారు సరిపోలనున్నది.