maruti Baleno:అల్ న్యూ అప్ డేట్ ఫీచర్స్ తో బాలెనో ఫేస్‌లిఫ్ట్ లాంచ్.. ఆకర్షణీయమైన లుక్స్, కొత్త ఫీచర్లతో..

మారుతీ సుజుకి కొత్త తరం బాలెనో  ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను ఈరోజు ఫిబ్రవరి 23న విడుదల చేయబోతోంది. మారుతీ బాలెనో భారత మార్కెట్లో టాటా ఆల్ట్రోజ్, హ్యుందాయ్ ఐ20, హోండా జాజ్ వంటి కార్లతో పోటీపడనుంది. బాలెనోని 2015లో ప్రారంభించారు.

Maruti Suzuki Baleno facelift to launch in India today watch it LIVE here

భారతదేశపు అతిపెద్ద వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా ఎట్టకేలకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త బాలెనోను ఈరోజు (ఫిబ్రవరి 23) భారతదేశంలో విడుదల చేయనుంది. టీజర్‌ల ద్వారా వెల్లడించినట్లుగా, బాలెనో ఫేస్‌లిఫ్ట్ మల్టీ కొత్త అప్‌డేట్‌లను పొందుతుంది, సెగ్మెంట్ ఫీచర్‌లలో మారుతి సుజుకి  బాలెనో మొట్టమొదటి అత్యంత ఫీచర్ ప్యాక్డ్ కారుగా నిలిచింది. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, అదనపు ఫీచర్ల కారణంగా కొత్త బాలెనో ధరను కొద్దిగా పెంచుతుందని భావిస్తున్నారు.

ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో ఈ కారు హోండా జాజ్, టాటా ఆల్ట్రోజ్, హ్యుందాయ్ ఐ20 వంటి మోడళ్లతో పోటీపడుతుంది. దీని లూక్స్ బట్టి చూస్తే కొత్త బాలెనో మల్టీ ఎక్స్ టిరియర్ అప్‌డేట్‌లను కూడా పొందుతోంది. అయితే ఎక్ట్సీరియర్ వివరాలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

బాలెనో కారు లీక్  ఫోటోలు చూస్తే  డి‌ఆర్‌ఎల్ లు, పెద్ద గ్రిల్‌తో కూడిన కొత్త హెడ్‌లైట్‌లను పొందుతుందని భావించవచ్చు. వెనుక భాగం బంపర్ డిజైన్‌లో కూడా కొన్ని మార్పులతో కొత్త టెయిల్‌లైట్ డిజైన్ ఎల్‌ఈ‌డిలను పొందుతుంది. ఇంకా ఇప్పుడు 10-స్పోక్ అల్లాయ్ వీల్స్  కొత్త సెట్‌ను కూడా పొందింది.

ఫీచర్ అప్‌గ్రేడ్‌ల విషయానికి వస్తే హెడ్-అప్ డిస్‌ప్లేను పొందుతుంది. HUD ఫీచర్ ద్వారా కస్టమర్‌లు స్పీడోమీటర్, క్లైమేట్ కంట్రోల్ మొదలైన  ముఖ్యమైన సమాచారాన్ని సౌకర్యవంతంగా డిస్‌ప్లే ద్వారా రోడ్డుపై నుండి తమ కళ్లను తీసుకోకుండా డ్రైవ్ చేయడానికి సహాయపడుతుంది.

ఇంకా 22.86 సెం.మీ (9-అంగుళాల) హై-డెఫినిషన్ డిస్‌ప్లేతో కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కూడా పొందుతుంది, కస్టమర్‌లకు కనెక్టెడ్ డ్రైవింగ్ అనుభవాన్ని అందించడానికి అడ్వాన్స్‌డ్ వాయిస్ అసిస్ట్‌తో కూడిన ఈజీ యూజర్ ఇంటర్‌ఫేస్ అందించింది. అలాగే ARKAMYS ఆధారితమైన “సరౌండ్ సెన్స్”తో మెరుగైన సౌండ్ అనుభవాన్ని అందిస్తుంది, వివిధ మూడ్‌లకు అనుగుణంగా రూపొందించబడిన సిగ్నేచర్ అంబియన్స్ అందిస్తుంది.

ఈ ఇంటీరియర్ ఫీచర్లన్నీ తాజా ఇంటీరియర్ డిజైన్‌లతో అనుబంధించబడతాయి. కొత్త డిజైన్‌లు కొత్త అప్హోల్స్టరీతో డ్యూయల్-టోన్ డ్యాష్‌బోర్డ్‌లను ఇంకా అక్కడక్కడ క్రోమ్ సూచనలు ఉంటాయని భావిస్తున్నారు.

సేఫ్టీ కోసం న్యూ ఏజ్ బాలెనోలో 360 వీక్షణ కెమెరాతో అమర్చబడింది, డ్రైవింగ్ స్థలన్నీ దృష్టిలో ఉంచుకుని కస్టమర్‌లకు భద్రత & సౌకర్యాన్ని పెంచుతుంది. ఇరుకైన ప్రదేశాలలో వాహనాన్ని పార్కింగ్ చేసేటప్పుడు లేదా ఐడియా చేస్తున్నప్పుడు  ఎక్కువ సమాచారంతో నిర్ణయాలు తీసుకునేలా  సహాయపడుతుంది.

నెక్స్ట్ జనరేషన్  సుజుకి కనెక్ట్  అల్ న్యూ సుజుకి కనెక్ట్ యాప్ (స్మార్ట్‌ఫోన్ & స్మార్ట్‌వాచ్) ద్వారా  వాహన సేఫ్టీ-సెక్యూరిటి,  ట్రిప్  & డ్రైవింగ్, స్టేటస్-అలర్ట్‌లు, రిమోట్ ఆపరేషన్స్ తో సహా 40+ కంటే ఎక్కువ ఫీచర్లను అందిస్తుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios