మారుతి సుజుకి మరో రికార్డు... మొదటి స్థానంలో మారుతీ ఆల్టో
దేశీయ ప్రముఖ ప్రయాణికుల వాహనాల తయారీ సంస్థ మారుతి సుజుకి మరో మైలురాయిని అధిగమించింది. 20 ఏళ్లలో 38 లక్షల ఆల్టో కార్లను విక్రయించిన ఘనత సాధించింది. తొలి ఎనిమిదేళ్లలో 10 లక్షలు విక్రయిస్తే, మరో 20 లక్షల యూనిట్ల విక్రయాల లక్ష్యం నాలుగేళ్లలోనే పూర్తి చేసుకున్నది.
న్యూఢిల్లీ: కార్ల తయారీలో అగ్రగామి సంస్థ, ప్రముఖ దేశీయ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) మరో రికార్డును సొంతం చేసుకున్నది. ఎంట్రీ లెవెల్ చిన్న కారు ఆల్టో విక్రయాలు 38 లక్షలు దాటాయని సంస్థ ప్రకటించింది. 2000లో మార్కెట్లోకి విడుదలైన ఈ మోడల్ చిన్న కారు 2008లో 10 లక్షల మార్క్ దాటింది. అనంతరం 2012లో 20 లక్షల మార్క్, 2016లో 30 లక్షల మార్క్ దాటిందని సంస్థ ప్రకటించింది.
also read వోక్స్ వేగన్ కార్ల ఉత్పత్తి నిలిపివేత....?
అంతేకాకుండా దేశంలో అత్యధికంగా అమ్ముడుపోయిన కార్ల జాబితాలో గత 15 ఏళ్లుగా మారుతీ ఆల్టో మొదటి స్థానంలో ఉందని ఎంఎస్‌ఐ తెలిపింది. ఈ కారు తొలి పది లక్షల యూనిట్లకు చేరుకోవడానికి ఎనిమిదేండ్లు పట్టగా..మరో పది లక్షల యూనిట్లను కేవలం నాలుగేండ్లలో అధిగమించింది. 2012లో 10 లక్షల కార్ల రికార్డును సొంతం చేసుకున్న సంస్థ..30 లక్షల యూనిట్లకు 2016లో చేరుకున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
‘కొత్తగా కారు కొనాలని అనుకునేవారు మొదటి ప్రాధాన్యత ఆల్టోకే ఇస్తున్నారు. కంపాక్ట్ డిజైన్, అందుబాటు ధరలో లభించడం, అధిక ఇంధన సామర్థ్యం, ఎప్పటికప్పుడు నవీకరించిన భద్రతాఫీచర్లు, తక్కువ మరమ్మతు తదితర అంశాలు ఈ ఎంట్రీ లెవెల్ చిన్నకారుకు అధిక ప్రాధాన్యం కల్పించాయి’ అని ఎంఎస్‌ఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింట్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ వివరించారు.
also read మానేసర్ ప్లాంట్ లో మళ్ళీ మొదలైన హోండా టువీలర్ ఉత్పత్తి
కాగా ఈ ఏడాది భారత్ స్టేజ్-6 ఆధారిత ఆల్టోని సంస్థ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. యాంటీ లాక్ బ్రేకింగ్ వ్యవస్థ (ఏబీఎస్), ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్(ఈబీడీ), రివర్స్ పార్కింగ్ సెన్సార్, స్పీడ్ అలర్ట్ వ్యవస్థ, సీట్ బెల్ట్ రిమైండర్ తదితర ఫీచర్లతో ఈ వాహనాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దినట్లు ఎంఎస్‌ఐ వివరించింది.
ఈ కారు కూడా లీటర్ పెట్రోల్‌కు 22.05 కిలోమీటర్ల మైలేజీ ఇస్తున్నదన్నారు. భద్రత ప్రమాణాలు మెరుగుపరుచడంలో భాగంగా పలు ఎయిర్‌బ్యాగులు, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్(ఏబీఎస్), ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్(ఈబీడీ), రివర్స్ పార్కింగ్ సెన్సార్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, సీట్ బెల్ట్ రిమైండర్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ మోడల్ రూ.2.89 లక్షల నుంచి రూ.4.09 లక్షల లోపు మధ్యలో లభిస్తున్నది.