మహింద్రా నుండి మరో కొత్త మల్టీ పర్పస్ వెహికిల్
వాహనాల తయారీ రంగంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న సంస్థ మహింద్రా ఆండ్ మహింద్రా. వినియోగదారుల అభిరుచికి తగ్గట్లుగా తమ కంపెనీ నుండి వాహనాలను విడుదల చేస్తూ మార్కెట్లో మంచి పేరు సంపాదించుకుంది. తాజాగా ఎం ఆండ్ ఎం మరో కొత్త రకం మల్టీ పర్పస్ వెహికల్ (ఎంపివి)ని మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్దమైంది.

''మరాజ్జో'' పేరుతో ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఓ కొత్త మోడల్ వెహికల్ ని విడుదల చేయనున్నట్లు ఎం ఆండ్ ఎం మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంక తెలిపారు. చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ (ఎంఆర్‌వి), నార్త్ అమెరికా టెక్నికల్ సెంటర్ (ఎంఎన్‌ఎటిసి)లతో పాటు ఎం ఆండ్ ఎం కు చెందిన ఇటాలియన్ ఆటో డిజైనింగ్ కంపెనీ పినిన్‌ఫరీనా కలిసి మరాజ్జోను అభివృద్ధి చేశాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం నాసిక్‌లోని సంస్థ ప్లాంటులో ఈ కారును తయారు చేస్తున్నట్లు తెలిపారు. వీటి తయారీ వేగంగా జరుగుతోందని, సెప్టెంబర్ లో వినియోగదారులకు అందెబాటులోకి వస్తాయని గోయెంక తెలిపారు.
మహింద్రా సంస్థ ఇప్పటివరకు ఎంపివి సెగ్మెంట్ లో వాహనాల తయారీకి అంతగా ఆసక్తి చూపలేదు. అయితే ప్రతి నెలా దేశంలో 10,000-12,000 ఎంపివిలు అమ్ముడవుతున్నట్లు గుర్తించిన సంస్థ ఆ వైపు అడుగులు వేసింది. దీంతో మరాజ్జో పేరుతో ఈ తరహా వాహనాన్ని విడుదల చేసి ఈ సెగ్మెంట్ మార్కెట్ వాటా బాగా పెంచుకోవాలని అనుకుంటున్నట్లు మహింద్రా ఆండ్ మహింద్రా వెల్లడించింది.